Heroine: బాలీవుడ్‌కు తొలి 100 కోట్ల సినిమా ఇచ్చిన తెలుగు హీరోయిన్- 30 ఏళ్లకే రిటైర్-గ్రామర్‌కు దూరంగా ఉన్న బ్యూటీ ఎవరు?
Meet The Telugu Actress Who Gave 100 Cr To Bollywood: బాలీవుడ్‌లో ఇప్పుడు 100 కోట్ల సినిమా అంటే సర్వసాధారణం. కానీ, బాలీవుడ్‌కు తొలిసారి 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమా అంటే స్పెషల్‌గానే ఉంటుంది. అలాంటి సినిమాను ఇచ్చిన తెలుగు స్టార్ హీరోయిన్ ఇప్పుడు గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంది. ఆమె ఎవరంటే?
Meet The Telugu Actress Who Gave 100 Cr To Bollywood: చిత్ర పరిశ్రమలో ఏ నటికైనా దశాబ్దాల పాటు స్టార్ హోదాను కాపాడుకోవడం, వరుస అవకాశాలు అందుకోవడం అంత సులువైన విషయం కాదు. అందులోనూ ఫామ్‌లో ఉన్నప్పుడే, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే నటనకు స్వస్తి చెప్పే ధైర్యం మరెవ్వరూ చేయలేరు.

100 కోట్లు రాబట్టడమంటే
కానీ, ఒకే ఒక్క హీరోయిన్ ఆ నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ వ్యాపార వర్గాల్లో 'రూ. 100 కోట్ల క్లబ్' అనే పదం ఇప్పుడు ఒక సాధారణ చర్చగా మారింది. కానీ, దానికంటే ముందు రూ. 100 కోట్లను రాబట్టడం అనేది మాములు విషయం కాదు.
అలాంటి రికార్డును అందుకుని భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు బ్యూటిఫుల్ హీరోయిన్ ఆసిన్. పూర్తి పేరు ఆసిన్ తొట్టుంకల్. గ్లామరస్ బ్యూటీ ఆసిన్ బాలీవుడ్‌లోనే కాదు తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ అని తెలిసిన విషయమే.
100 కోట్ల సినిమాను ఇచ్చిన
టీనేజర్‌గా కెరీర్ ప్రారంభించి, చాలా తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీతో పాటు నార్త్ ఇండస్ట్రీని సైతం తన వైపు తిప్పుకున్నారు ఆసిన్. హిందీ చిత్ర పరిశ్రమకు మొట్టమొదటి రూ. 100 కోట్ల బ్లాక్‌బస్టర్ సినిమాను ఇచ్చిన హీరోయిన్‌గా ఆసిన్ అరుదైన ఘనత సాధించింది.
ముప్పై ఏళ్ల వయసు రాకముందే అగ్ర దర్శకులు, స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది ఆసిన్. వరుస కమర్షియల్ హిట్లు అందుకని అత్యంత క్రేజ్ ఉన్న హీరోయిన్‌గా నిలిచిన తరుణంలోనే, ఆమె సైలెంట్‌గా వెండితెరకు దూరమయ్యారు. సినిమా రంగానికి దూరమై దశాబ్దం దాటిపోతున్నా, ఇప్పటికీ ఆసిన్ ఒక అద్భుతమైన సక్సెస్ స్టోరీగా మిగిలిపోయారు.
బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన 'గజినీ'
దర్శకుడు మురుగదాస్ కాన్సెప్ట్, అమీర్ ఖాన్ సిక్స్ ప్యాక్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ చుట్టూ 'గజినీ' (2008) చిత్రం తిరిగినప్పటికీ, అందులో కల్పనగా ఆసిన్ పండించిన నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. హాలీవుడ్ చిత్రం 'మెమెంటో' ఆధారంగా వచ్చిన ఈ ఇంటెన్స్ రివెంజ్ డ్రామాకు ఆసిన్ పాత్రే ప్రాణంగా నిలిచింది.
ఆసిన్ పండించిన భావోద్వేగాలు సినిమాను ఒక కల్ట్ క్లాసిక్‌గా మార్చాయి. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దేశీయంగా రూ. 100 కోట్ల వసూళ్ల మైలురాయిని దాటిన తొలి బాలీవుడ్ చిత్రంగా గజినీ సరికొత్త రికార్డు సృష్టించింది.
సౌత్ ఇండస్ట్రీలో అప్పటికే టాప్ హీరోయిన్‌గా ఉన్న అసిన్‌కు, ఈ సినిమా బాలీవుడ్‌కు ఒక గ్రాండ్ వెల్‌కమ్ చెప్పడమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లోనూ ఆమె పేరు మార్మోగిపోయేలా చేసింది.
దక్షిణాది సామ్రాజ్యం నుంచి టాలీవుడ్, బాలీవుడ్ హవా వరకు
ఉత్తరాది ప్రేక్షకులు గజినీ సినిమా చూసి ఆసిన్‌ను ఒక కొత్త నటిగా భావించారు కానీ, ఆమె అప్పటికే సౌత్ ఇండియాలో స్టార్ హీరోలందరితో కలిసి నటించి స్టార్ హోదాలో ఉన్నారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే మలయాళ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఆసిన్, తమిళం, తెలుగు చిత్రసీమలో తిరుగులేని హీరోయిన్‌గా ఎదిగారు.
తమిళంలో సూర్యతో కలిసి ఒరిజినల్ 'గజినీ', 'పేరళగన్' చిత్రాల్లో, విజయ్‌తో 'శివకాశి', 'పోకిరి', అజిత్‌తో 'వరలారు', విక్రమ్‌తో 'మజా' వంటి హిట్ సినిమాల్లో నటించారు. ఇక తెలుగులో పవన్ కల్యాణ్‌తో 'అన్నవరం', రవితేజతో 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి', బాలకృష్ణతో లక్ష్మీ నరసింహా, నాగార్జునతో శివమణి వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా నిలిచారు.
గజినీ సక్సెస్ తర్వాత బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో 'రెడీ', అక్షయ్ కుమార్‌తో 'హౌస్‌ఫుల్ 2', 'ఖిలాడీ 786', అజయ్ దేవగన్‌తో 'బోల్ బచ్చన్' వంటి వరుస విజయాలతో బాక్సాఫీస్ క్వీన్‌గా నిలిచారు ఆసిన్.
వైవాహిక జీవితం.. గ్లామర్ ప్రపంచానికి శాశ్వత వీడ్కోలు
చాలా మంది నటీనటులు అవకాశాలు ఉన్నంత కాలం స్టార్‌డమ్‌ని అనుభవించాలని చూస్తారు. కానీ, ఆసిన్ తన జీవితానికి ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. 2015లో అభిషేక్ బచ్చన్ సరసన నటించిన 'ఆల్ ఈజ్ వెల్' ఆమెకు చివరి చిత్రమైంది.
తన సహనటుడు అక్షయ్ కుమార్ చేసిన పరిచయంతో మైక్రోమాక్స్ కో-ఫౌండర్, ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ శర్మతో 2016 జనవరిలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం ఆసిన్ వివాహం జరిగింది.

ప్రైవేట్ లైఫ్ గడుపుతూ
పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో లేదా బాలీవుడ్ ఈవెంట్లలో కనిపించే ఇతర హీరోయిన్లలా కాకుండా, ఆసిన్ పూర్తిగా గ్లామర్ ప్రపంచానికి దూరంగా వెళ్లిపోయారు. కేవలం కుటుంబానికే తన సమయాన్ని కేటాయిస్తూ ప్రైవేట్ లైఫ్‌ను గడుపుతున్నారు ఆసిన్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


