Aamir Khan: మద్యానికి బానిసయ్యా, ఏడాదిన్నరపాటు రాత్రి ఫుల్ బాటిల్ తాగేవాన్ని.. మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కామెంట్స్
Aamir Khan Revealed Drinking Addiction: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ బాధ భరించలేక మద్యానికి బానిస అయినట్లు తాజాగా వెల్లడించాడు. ఏకంగా ఏడాదిన్నర కాలం పాటు ప్రతి రోజూ రాత్రి ఫుల్ బాటిల్ తాగేవాడినని, అందుకు గల కారణాలను అమీర్ ఖాన్ తెలిపాడు. దీంతో అమీర్ ఖాన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సినిమా తెరపై ఎంతో క్రమశిక్షణగా, పర్‌ఫెక్ట్‌గా కనిపించే అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తన మొదటి భార్య రీనా దత్తా నుంచి విడిపోయిన సమయంలో ఆయన అనుభవించిన మానసిక వేదన గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పారు అమీర్ ఖాన్.

ఒంటరితనం తెచ్చిన వ్యసనం
మొదటి భార్య తనను విడిచిపెట్టి వెళ్లిపోయినప్పుడు తాను తీవ్రమైన మద్యపాన వ్యసనానికి గురయ్యానని ఆమిర్ ఖాన్ వెల్లడించడం ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రీనా దత్తా తన పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిన మొదటి రోజు తన జీవితంలో అత్యంత కష్టతరమైన రోజని ఆమిర్ ఖాన్ గుర్తుచేసుకున్నారు.
"నేను అంతకుముందు అసలు మద్యం ముట్టుకునేవాడిని కాదు. కేవలం సినిమాల్లో సీన్ల కోసం మాత్రమే ఒకట్రెండు సార్లు తాగాను. కానీ, రీనా వెళ్లిపోయాక ఆ ఒంటరితనాన్ని, బాధను భరించలేకపోయాను. ఆ రాత్రి ఇంట్లో ఉన్న మద్యాన్ని తీసి తాగడం మొదలుపెట్టాను. అది అక్కడితో ఆగలేదు.. దాదాపు ఏడాదన్నర పాటు ప్రతిరోజూ రాత్రి ఒక ఫుల్ బాటిల్ మద్యం తాగేవాడిని" అని ఆమిర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
16 ఏళ్ల బంధం.. ముగిసిన ప్రయాణం
టీటోటలర్‌గా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఇలా బాటిళ్లకు బాటిళ్లు ఖాళీ చేయడం అనేది అప్పట్లో తనను తాను నాశనం చేసుకోవడమేనని అమీర్ ఖాన్ అంగీకరించారు. ఇప్పుడు అమీర్ ఖాన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే, అమీర్ ఖాన్, రీనా దత్తా పొరుగువారిగా ఉండేవారు. కిటికీల గుండా చూసుకుంటూ మొదలైన వీరి ప్రేమ కథ 1986లో పెళ్లి పీటలెక్కింది. ఆమిర్ ఖాన్ కెరీర్ ఆరంభంలో రీనా ఆయనకు కొండంత అండగా నిలిచారు. వీరిద్దరికీ జునైద్ ఖాన్, ఐరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే, మనస్పర్థల కారణంగా 2002లో అమీర్ ఖాన్-రీనా దత్తా జంట విడాకులు తీసుకున్నారు. 19 ఏళ్ల సుదీర్ఘ బంధం ముగియడం కేవలం తమకే కాదు, తమ కుటుంబాలకు కూడా పెద్ద ట్రామా అని గతంలో 'కాఫీ విత్ కరణ్' షోలో కూడా ఆమిర్ ఖాన్ పేర్కొన్నారు. అయితే విడిపోయినప్పటికీ, రీనాపై తనకు ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గలేదని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు.
కెరీర్, వ్యక్తిగత జీవితం
రీనాతో విడాకుల తర్వాత 2005లో కిరణ్ రావును వివాహం చేసుకున్న ఆమిర్ ఖాన్, 2021లో ఆమెతో కూడా విడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి కొడుకు ఆజాద్ బాధ్యతలను చూసుకుంటున్నారు. కాగా, గతేడాది తన 60వ పుట్టినరోజు వేడుకల్లో గౌరీ స్ప్రట్‌ను తన గర్ల్ ఫ్రెండ్‌గా అమీర్ ఖాన్ మీడియాకు పరిచయం చేయడం విశేషం.
వృత్తిపరంగా చూస్తే, 'లాల్ సింగ్ చద్దా' పరాజయం తర్వాత 'సితారే జమీన్ పర్' చిత్రంతో ఆమిర్ ఖాన్ మళ్లీ వెండితెరపైకి వచ్చారు. ప్రస్తుతం తనయుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ఏక్ దిన్' చిత్రాన్ని అమీర్ ఖాన్ నిర్మిస్తున్నారు. థాయ్ చిత్రం 'వన్ డే'కి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా మే 1న విడుదల కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


