Mani Ratnam Sai Pallavi: విజయ్ సేతుపతి, సాయి పల్లవి హీరో హీరోయిన్‌గా మణిరత్నం కొత్త మూవీ-సంగీత దర్శకుడిపై రూమర్లకు చెక్!

Mani Ratnam New Movie With Vijay Sethupathi Sai Pallavi: గతేడాది 'థగ్ లైఫ్' నిరాశపరిచిన తర్వాత దర్శకుడు మణిరత్నం తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Published on: Mar 20, 2026, 12:22:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ చలనచిత్ర దిగ్గజం మణిరత్నం తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో గతేడాది విడుదలైన 'థగ్ లైఫ్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో మణిరత్నం ఒక క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేశారు.

విజయ్ సేతుపతి, సాయి పల్లవి హీరో హీరోయిన్‌గా మణిరత్నం కొత్త మూవీ-సంగీత దర్శకుడిపై రూమర్లకు చెక్!
విజయ్ సేతుపతి, సాయి పల్లవి హీరో హీరోయిన్‌గా మణిరత్నం కొత్త మూవీ-సంగీత దర్శకుడిపై రూమర్లకు చెక్!

మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తేలిపోయింది!

మణిరత్నం కొత్త చిత్రంలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, ‘నేచురల్ బ్యూటీ’ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గురువారం (మార్చి 19) మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి. ఈ చిత్రానికి సోనీ మ్యూజిక్ సౌత్ ఆడియో పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.

‘ఆస్కార్’ విజేత

అయితే గత కొద్దిరోజులుగా ఈ సినిమాకు యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తారనే ప్రచారం జరిగింది. కానీ, ఆ రూమర్లకు చెక్ పెడుతూ.. ఈ చిత్రానికి ‘ఆస్కార్’ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.

మ్యాజిక్ అని భావించే అభిమానులు

మణిరత్నం-రెహమాన్ కాంబినేషన్ అంటేనే ఒక మ్యాజిక్ అని భావించే అభిమానులు ఈ ప్రకటనతో ఖుషీ అవుతున్నారు. "మరో సోల్ ఫుల్ ఆల్బమ్ లోడింగ్" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

విజయ్, సాయి పల్లవి బిజీ బిజీ..

కాగా మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతికి ఇది రెండో సినిమా. గతంలో వీరు ‘చెక్క చివంద వానమ్’ (నవాబ్) కోసం కలిసి పనిచేశారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి చేతిలో ‘జైలర్ 2’, ‘ట్రైన్’, ‘అరసన్’ వంటి భారీ చిత్రాలు ఉన్నాయి.

సాయి పల్లవికి ఇదే తొలిసారి

ఇక సాయి పల్లవి విషయానికి వస్తే, ఆమె మణిరత్నం సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. తెలుగులో చివరిగా ‘తండేల్’తో ఆకట్టుకున్న సాయి పల్లవి హిందీలో ప్రతిష్టాత్మక ‘రామాయణ’ పార్ట్ 1 అండ్ 2 చిత్రాల్లో నటిస్తోంది.

'థగ్ లైఫ్' చేదు జ్ఞాపకాలు..

కమల్ హాసన్ హీరోగా వచ్చిన ‘థగ్ లైఫ్’ మీద భారీ అంచనాలు ఉండటంతో.. అది ‘నాయకన్’ (నాయకుడు) స్థాయి మ్యాజిక్ రిపీట్ చేస్తుందని అందరూ భావించారు. కానీ, సుమారు రూ. 200-300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది.

తన మార్క్ చూపించాలని

ఈ నేపథ్యంలో మణిరత్నం తన తర్వాతి సినిమాతో మళ్లీ తన మార్క్ చూపించాలని కంకణం కట్టుకున్నారు. త్వరలోనే విజయ్ సేతుపతి, సాయి పల్లవి, ఏఆర్ రెహమాన్, మణిరత్నం ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More