Ramayana Leaked: రామాయణం సెట్స్ నుంచి రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ఫొటోలు లీక్? అసలు గుట్టు విప్పిన టీవీ రాముడు!

Ramayana Ranbir Kapoor Sai Pallavi Look Leaked: రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి నటించిన మైథలాజికల్ అండ్ డివోషనల్ మూవీ 'రామాయణం'. ఈ సినిమాపై ఫుల్ బజ్ క్రియేట్ అవుతున్న వేళ రామాయణం షూటింగ్‌ నుంచి రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవిల లీక్‌డ్ ఫొటోలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ క్లారిటీ వచ్చింది.

Mar 9, 2026, 15:31:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందీ ప్రముఖ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’ గురించి రోజుకో వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తాజాగా శనివారం (మార్చి 7) నాడు రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడుగా, సాయి పల్లవి సీతాదేవి వేషధారణలో ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

రామాయణం సెట్స్ నుంచి రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ఫొటోలు లీక్? అసలు గుట్టు విప్పిన టీవీ రాముడు!
రామాయణం సెట్స్ నుంచి రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ఫొటోలు లీక్? అసలు గుట్టు విప్పిన టీవీ రాముడు!

రాముడు, సీత పెళ్లి వేడుకకు సంబంధించినవేనని

రాజసం ఉట్టిపడేలా కిరీటం, నగలు ధరించి ఉన్న ఈ లీక్‌డ్ ఫోటోలు చూసి.. సినిమాలోని రాముడు, సీత పెళ్లి వేడుకకు సంబంధించినవేనని అంతా భావించారు. అయితే, ఈ ఫోటోలు అసలైనవి కావు, ఏఐ (AI) సృష్టించిన నకిలీ ఫోటోలని తాజాగా తేలిపోయింది.

అనుమానం రేకెత్తించిన క్లారిటీ!

సాధారణంగా సెట్స్ నుంచి లీక్ అయ్యే ఫోటోలు కాస్త అస్పష్టంగా ఉంటాయి. కానీ, ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటోలు అత్యంత స్పష్టంగా (HD Quality) ఉండటంతో నెటిజన్లకు అనుమానం వచ్చింది. దీనిపై కొందరు ఆరా తీయగా, ‘గ్రోక్’ (Grok) చాట్‌బాట్ కూడా ఇవి ఫేస్-స్వాప్ ఎడిటింగ్ అని తేల్చేసింది. గతేడాది పూర్తయిన సీక్వెన్స్ ఫోటోలు ఇప్పుడు ఎలా బయటకు వస్తాయని కొందరు నెటిజన్లు లాజిక్ తీశారు.

గుట్టు విప్పిన టీవీ రాముడు!

ఈ ఫోటోల వెనుక ఉన్న అసలు నిజాన్ని 2015-16లో వచ్చిన ‘సియా కే రామ్’ (Siya Ke Ram) (తెలుగులో సీతారామ) సీరియల్ నటుడు ఆశిష్ శర్మ బయటపెట్టారు. ఆ సీరియల్‌లో రాముడి పాత్ర పోషించింది ఆయనే.

రణ్‌బీర్ కపూర్ ముఖాన్ని అతికించారని

ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటోలలో ఆశిష్ శర్మ ముఖాన్ని తీసేసి రణ్‌బీర్ కపూర్ ముఖాన్ని అతికించారని ఆయన ఆధారాలతో సహా నిరూపించారు. "ఇదిగోండి.. మరో ‘ఒరిజినల్’ లీక్‌డ్ ఫోటో. ఏఐ నా ముఖాన్ని మార్చగలిగింది కానీ, నా జుట్టును మార్చలేకపోయింది" అని ఆశిష్ శర్మ సరదాగా ట్వీట్ చేస్తూ, ఆ సీరియల్‌లోని తన అసలైన ఫోటోను షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు ఫేక్ అని స్పష్టమైంది.

భారీ బడ్జెట్ మూవీగా రామాయణం

ఇదిలా ఉంటే, రామాయణం కావ్యాన్ని రెండు భాగాలుగా నితీష్ తివారీ వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఇందులో రావణుడిగా యశ్, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు.

అత్యంత భారీ వ్యయంతో

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ రామాయణ చిత్రం.. ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఆస్కార్ గ్రహీత ‘ప్రైమ్ ఫోకస్’ స్టూడియో ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అందిస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More