సాయి పల్లవి తొలి హిందీ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆమిర్ ఖాన్ కొడుకుతో రొమాంటిక్ సినిమా.. రిలీజ్ డేట్ ఇదే

సాయి పల్లవి తొలి హిందీ మూవీ ఏక్ దిన్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఆమిర్ ఖాన్ తన కొడుకు జునైద్ ఖాన్ తో తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కాగానే.. చాలా మంది ఓ పాత మూవీతో దీనిని పోలుస్తున్నారు.

Published on: Jan 15, 2026, 15:10:49 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తన కుమారుడు, యువ నటుడు జునైద్ ఖాన్ కెరీర్‌పై ప్రత్యేక దృష్టి సారించాడు. జునైద్ హీరోగా, సౌత్ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్‌గా ఒక స్వచ్ఛమైన లవ్ స్టోరీని ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు ‘ఏక్ దిన్’ (ఒక రోజు) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ.. గురువారం (జనవరి 15) నాడు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ విడుదల చేసింది.

సాయి పల్లవి తొలి హిందీ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆమిర్ ఖాన్ కొడుకుతో రొమాంటిక్ సినిమా.. రిలీజ్ డేట్ ఇదే
సాయి పల్లవి తొలి హిందీ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆమిర్ ఖాన్ కొడుకుతో రొమాంటిక్ సినిమా.. రిలీజ్ డేట్ ఇదే

మంచులో రొమాంటిక్ జర్నీ

ఏక్ దిన్ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులకు ఒక ఫీల్ గుడ్ వైబ్‌ని ఇస్తోంది. చుట్టూ మంచు కురుస్తుండగా.. జునైద్, సాయి పల్లవి చేతిలో ఐస్‌క్రీమ్ పట్టుకొని నవ్వుతూ నడుచుకుంటూ వెళ్తున్న సీన్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. "ఒకే ప్రేమ.. ఒకే అవకాశం" అనే క్యాప్షన్ సినిమాలోని గాఢతను తెలియజేస్తోంది. "జీవితపు గందరగోళంలో.. ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.. ఏక్ దిన్" అంటూ మేకర్స్ పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటోంది.

అంజానా అంజానీ కాపీనా?

అయితే ఈ పోస్టర్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. జునైద్, సాయి పల్లవి జోడీ చాలా బాగుందని, 2000 దశకంలో వచ్చిన రొమాంటిక్ సినిమాల ఫీల్ కలుగుతోందని కొందరు ప్రశంసిస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం ఇది రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రా నటించిన ‘అంజానా అంజానీ’ పోస్టర్‌ను పోలి ఉందని విమర్శిస్తున్నారు. "వారి గెటప్, ఆ బ్యాక్‌గ్రౌండ్ చూస్తుంటే అంజానా అంజానీ కాపీలా ఉందేంటి?" అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

జునైద్‌కు కలిసొచ్చేనా?

గతంలో ఖుషీ కపూర్ సరసన జునైద్ నటించిన ‘లవ్‌యాపా’ (Loveyapa) బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ సినిమా తనకు వ్యక్తిగతంగా నచ్చినప్పటికీ, ఫలితం నిరాశపరిచిందని ఆమిర్ ఖాన్ గతంలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు సాయి పల్లవి వంటి బలమైన నటితో జునైద్‌ను జత కట్టడం ద్వారా ఆమిర్ కొత్త మ్యాజిక్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

ఏక్ దిన్ సినిమా విశేషాలు

సాయి పల్లవి, జునైద్ ఖాన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఏక్ దిన్ మూవీని సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది ‘వన్ డే’ (One Day) అనే థాయ్ సినిమాకు రీమేక్ అని సమాచారం. ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణా పురోహిత్ మూవీని నిర్మిస్తుండగా.. రామ్ సంపత్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ శుక్రవారం (జనవరి 16న) విడుదల కానుండగా, సినిమా మే 1న థియేటర్లలోకి రానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More