లెజెండరీ సింగర్ బయోపిక్‌లో సాయి పల్లవి.. కింగ్డమ్ డైరెక్టర్ దర్శకత్వంలో..?

ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఆసక్తి రేపుతోంది. టాలెంటెడ్ నటి సాయి పల్లవి లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాను ఓ తెలుగు డైరెక్టరే డైరెక్ట్ చేయనున్నట్లు కూడా తెలుస్తోంది.

Published on: Dec 15, 2025, 15:56:44 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రస్తుతం రణబీర్ కపూర్‌తో 'రామాయణం' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సాయి పల్లవి.. త్వరలో మరో భారీ ప్రాజెక్టులో నటించే అవకాశం ఉంది. లెజెండరీ సింగర్ ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నటించేందుకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఆమెను సంప్రదించినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పుడీ వార్త ఎంతో ఆసక్తి రేపుతోంది.

లెజెండరీ సింగర్ బయోపిక్‌లో సాయి పల్లవి.. కింగ్డమ్ డైరెక్టర్ దర్శకత్వంలో..?
లెజెండరీ సింగర్ బయోపిక్‌లో సాయి పల్లవి.. కింగ్డమ్ డైరెక్టర్ దర్శకత్వంలో..?

సుబ్బలక్ష్మి బయోపిక్‌లో సాయి పల్లవి?

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గత కొన్ని నెలలుగా కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ మూవీ 'రామాయణం' (Ramayana) షూటింగ్‌లో బిజీగా ఉంది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

'జెర్సీ' ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.. దిగ్గజ గాయని, భారతరత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత చరిత్రను వెండితెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ బయోపిక్‌లో ప్రధాన పాత్ర కోసం గౌతమ్ ఇప్పటికే సాయి పల్లవిని సంప్రదించి, కథాంశాన్ని వివరించినట్లు సమాచారం.

అయితే సాయి పల్లవి ఇంకా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఒకవేళ ఆమె ఒప్పుకుంటే, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి పాత్రలో సాయి పల్లవిని చూడటం నిజంగా కన్నుల పండుగే అని చెప్పాలి.

విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సీక్వెల్ రద్దు?

గౌతమ్ తిన్ననూరి చివరగా విజయ్ దేవరకొండతో 'కింగ్డమ్' అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. దురదృష్టవశాత్తు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. దీంతో మేకర్స్ ప్లాన్ చేసిన ఈ సినిమా సీక్వెల్ ఇప్పుడు రద్దయినట్లు తెలుస్తోంది. అందుకే గౌతమ్ ఇప్పుడు బయోపిక్ వైపు దృష్టి సారించాడు.

మరోవైపు గౌతమ్ తిన్ననూరి కొత్త నటీనటులతో తెరకెక్కించిన చిన్న సినిమా 'మ్యాజిక్' విడుదలకు సిద్ధంగా ఉంది. 'కింగ్డమ్' సినిమా ఆలస్యం అవుతున్న సమయంలో అతడు ఈ సినిమాను పూర్తి చేశాడు. దీనికి అనిరుధ్ సంగీతం అందించడం విశేషం. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయి.

అయితే గౌతమ్ తిన్ననూరి, సాయి పల్లవి కాంబినేషన్.. అది కూడా లెజెండరీ సింగర్ ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ కావడం ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి రేపుతోంది. ఈ వార్తలు నిజం కావాలని వాళ్లు కోరుకుంటున్నారు. అటు సాయి పల్లవి వచ్చే ఏడాది దీపావళికి రామాయణం పార్ట్ 1తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More