విజయ్ దేవరకొండకు మరో దెబ్బ.. కింగ్డమ్ సీక్వెల్ లేనట్లే.. మరో సినిమాలో ఆ డైరెక్టర్ బిజీ
విజయ్ దేవరకొండకు మరో దెబ్బ తగిలింది. అతడు నటించాల్సిన కింగ్డమ్ మూవీ సీక్వెల్ అటకెక్కినట్లే కనిపిస్తోంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అతనికి ఇది మరో షాక్ అని చెప్పొచ్చు.
వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండ.. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన 'కింగ్డమ్' సినిమాపై కోటి ఆశలు పెట్టుకున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా పాటలు, ప్రోమోలు సంచలనం సృష్టించినా.. సినిమా మాత్రం అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. దీంతో ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ ప్లాన్స్ ను పక్కన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

భారీ నష్టాలతో సీక్వెల్ రద్దు
విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ లీడ్ రోల్స్ లో నటించిన మూవీ కింగ్డమ్. భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాలతో మూవీ రిలీజ్ అయింది. అంతేకాదు ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ మొదట ప్లాన్ చేశారు. రెండో భాగం 2026 ఆరంభంలో రావాల్సి ఉంది. అయితే తాజాగా ఓటీటీప్లే రిపోర్టు ప్రకారం ప్రకారం మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగలడంతో నిర్మాతలు సీక్వెల్ ఆలోచనను పూర్తిగా విరమించుకున్నారు.
నిర్మాత నాగ వంశీకి మొదట ఈ కింగ్డమ్ రూపంలో దెబ్బ పడగా.. ఈ మధ్యే రవితేజ నటించిన మాస్ జాతర కూడా తీవ్ర నిరాశనే మిగిల్చింది. సుమారు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన కింగ్డమ్ మూవీ.. అందులో కనీసం సగం కూడా వెనక్కి రాబట్టలేకపోయింది. ఇదే సీక్వెల్ రద్దుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఇప్పటికే 'మ్యాజిక్' అనే ఓ చిన్న చిత్రాన్ని పూర్తి చేశాడు. ఇకపై ఆ మ్యూజికల్ డ్రామాపైనే దృష్టి పెట్టాలని నిర్మాతలు అతనికి సూచించినట్లు తెలుస్తోంది.
వృథా అయిన విజయ్ కష్టం
'కింగ్డమ్' కోసం విజయ్ దేవరకొండ చాలా సమయం కేటాయించాడు. కొత్త లుక్ కోసం కష్టపడ్డాడు. అద్భుతమైన నటన కనబరిచాడు. కానీ సినిమాపై విమర్శకులు, ప్రేక్షకుల నుంచి తీవ్రమైన ట్రోలింగ్ రావడంతో ఆ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది.
మరీ ముఖ్యంగా సినిమా విడుదలకు ముందు సూపర్ హిట్ అయిన రెండు పాటలు అసలు సినిమాలో లేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇలాంటి అనేక కారణాల వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.
విజయ్ కెరీర్, వ్యక్తిగత జీవితం ఇలా..
గత కొన్ని సంవత్సరాలుగా విజయ్ మార్కెట్ గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం అతడు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఒక సినిమా, అలాగే 'శ్యామ్ సింగరాయ్' ఫేమ్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు 2026లో విడుదల కానున్నాయి.
మరోవైపు విజయ్ ఇటీవల తన ప్రేయసి రష్మిక మందన్నతో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది వీరి వివాహం జరగనుంది. వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉన్నా, కెరీర్ పరంగా మాత్రం విజయ్ ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


