Animal: సార్ అంత తింటాడా? బూతులు తిట్టిన రణ్‌బీర్ కపూర్- యానిమల్ షూటింగ్ విషయాలు చెప్పిన రష్మిక సోదరుడు శ్రీనాథ్ మాగంటి
Srinath Maganti On Ranbir Kapoor: ‘యానిమల్’ సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్ ప్రవర్తన ఎలా ఉండేదో ఈ నగరానికి ఏమైంది 2 హీరో శ్రీనాథ్ మాగంటి వివరించారు. సెట్స్‌లో రణ్‌బీర్ కపూర్ ఇచ్చే చిరుతిండి ప్లేట్ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను శ్రీనాథ్ పంచుకున్నారు.
క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 915 కోట్ల వసూళ్లను సాధించింది.

రష్మిక మందన్నాకు సోదరుడుగా
ఈ సినిమాలో రష్మిక మందన్నాకు సోదరుడుగా నటించిన తెలుగు నటుడు శ్రీనాథ్ మాగంటి.. తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని రణ్‌బీర్ కపూర్‌తో తనకున్న అనుభవాలను నెమరువేసుకున్నారు.
ఎంతో నిరాడంబరంగా!
రణ్‌బీర్ కపూర్ లాంటి పెద్ద స్టార్‌తో కలిసి పనిచేయడం తనకు ఒక గొప్ప పాఠమని శ్రీనాథ్ మాగంటి పేర్కొన్నారు. "ఆయన తాత రాజ్ కపూర్ ఒక స్టార్, తండ్రి రిషి కపూర్ ఒక స్టార్, ఆయన కూడా ఒక పెద్ద స్టార్. కానీ రణ్‌బీర్ కపూర్‌కు ఉన్న అంకితభావం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన సెట్స్‌కి వచ్చేటప్పుడు తన వెనుక పెద్ద సైన్యాన్ని (Entourage) వేసుకొని రారు. చాలా సాదాసీదాగా వస్తారు" అని శ్రీనాథ్ వివరించారు.
ప్లేట్ నిండా
యానిమల్ సెట్స్‌లో రణ్‌బీర్ కపూర్ అందరితో ఎంత సరదాగా ఉంటారో చెబుతూ శ్రీనాథ్ ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. "రణ్‌బీర్ సెట్స్‌కి వచ్చినప్పుడు తనతో పాటు ఒక పెద్ద ప్లేట్ నిండా హెల్తీ చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు ఇలా రకరకాల స్నాక్స్ తెప్పించేవారు. అది ఆయన కోసం కాదు, సెట్స్‌లో చుట్టుపక్కల ఉన్న వారి కోసం" అని శ్రీనాథ్ మాగంటి తెలిపారు.
రణ్‌బీర్ కపూర్ బూతులు
"ఎవరికి ఆకలి వేసినా అందులో నుంచి తీసుకోవచ్చు. నేను మొదటిసారి ఆ ప్లేట్ చూసి 'సార్ అంత తింటారా?' అని అనుకుంటూ ఒక స్నాక్ తీసుకున్నాను. అప్పుడు ఎవరో వచ్చి అది సార్ ప్లేట్ అని నన్ను వారించారు. అది విన్న రణ్‌బీర్ వెంటనే జోక్యం చేసుకొని.. తనదైన శైలిలో సరదాగా బూతులు తిడుతూ 'అరేయ్.. తనని తిననివ్వు' అని నవ్వుతూ చెప్పారు. ఆయన బూతులు తిట్టినా అది ఎంతో ప్రేమతో కూడి ఉంటుంది" అని శ్రీనాథ్ మాగంటి గుర్తుచేసుకున్నారు.
అత్యంత నిగర్వి
గతంలో కూడా రణ్‌బీర్‌తో ఉన్న సెల్ఫీని షేర్ చేస్తూ.. తాను కలిసిన అత్యంత నిగర్వి అయిన నటుడు రణ్‌బీర్ కపూర్ అని శ్రీనాథ్ కొనియాడారు. ‘యానిమల్’ తర్వాత రణ్‌బీర్ కపూర్ ఇప్పటివరకు వెండితెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఆయన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’ పార్ట్ 1, పార్ట్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
‘లవ్ అండ్ వార్’ చిత్రంలోనూ
సాయి పల్లవి, యశ్ సహనటులుగా వస్తున్న ఈ చిత్రాలు 2026, 2027 దీపావళి కానుకగా విడుదల కానున్నాయి. దీనితో పాటు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘లవ్ అండ్ వార్’ చిత్రంలోనూ రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నారు.
ఈ నగరానికి ఏమైంది 2లో
ఇక శ్రీనాథ్ మాగంటి తెలుగులో లక్కీ భాస్కర్ సినిమాలో మెరిశాడు. సూపర్ హిట్ మూవీ ఈ నగరానికి ఏమైందికి సీక్వెల్‌గా వస్తున్న ఈ నగరానికి ఏమైంది 2 (ENE2)లో ఒక హీరోగా శ్రీనాథ్ మాగంటి చేస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












