పచ్చని కొండల మధ్య విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా పెళ్లి- 117 విల్లాల రిసార్ట్- రోజుకు అయ్యే ఖర్చు, ప్రత్యేకతలు ఇవే!

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల వివాహానికి ముహూర్తం ఖరారైంది. రాజస్థాన్‌లోని ‘ఐటీసీ మెమెంటోస్’ వేదికగా ఫిబ్రవరి 26న ఈ వేడుక జరగనుంది. ప్రకృతి ఒడిలో అత్యంత విలాసవంతంగా సాగే ఈ వెడ్డింగ్ వేదిక ధర, ప్రత్యేకతలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Feb 23, 2026, 14:24:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ సెన్సేషనల్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల పెళ్లి గురించి వస్తున్న వార్తలకు ఎట్టకేలకు తెరపడింది. విజయ్, రష్మిక ఫిబ్రవరి 26, 2026న వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ధృవీకరణ నిన్న (ఫిబ్రవరి 22) రాత్రే వచ్చేసింది.

పచ్చని కొండల మధ్య విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా పెళ్లి- 117 విల్లాల రిసార్ట్- రోజుకు అయ్యే ఖర్చు, ప్రత్యేకతలు ఇవే!
పచ్చని కొండల మధ్య విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా పెళ్లి- 117 విల్లాల రిసార్ట్- రోజుకు అయ్యే ఖర్చు, ప్రత్యేకతలు ఇవే!

25 కిలోమీటర్ల దూరంలో

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తమ పెళ్లికోసం భారీ డెస్టినేషన్ వెడ్డింగ్ ఎంచుకున్నారు. అందుకోసం వారు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ను వేదికగా సెలెక్ట్ చేసుకున్నారు. ఉదయ్‌పూర్ నగరానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో అరావళి పర్వత శ్రేణుల మధ్య ఉన్న ‘మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్ ఏకాయా’ (ITC Mementos) రిసార్ట్‌లో రష్మిక, విజయ్ పెళ్లి వేడుక అత్యంత వైభవంగా జరగనుంది.

ఒక అందమైన కలలాంటి వేదిక

ప్రకృతి ఒడిలో, పచ్చని కొండలు, నీలి ఆకాశం సాక్షిగా సాగే ఈ రిసార్ట్ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఉదయ్‌పూర్‌లోని రద్దీగా ఉండే కోటలు, సరస్సులకు దూరంగా, రాయల్ వెడ్డింగ్స్‌కు ఇది కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఇక్కడ మొత్తం 117 విల్లాలు ఉన్నాయి. ప్రతి విల్లా నుంచి చూస్తే చుట్టూ ఉండే లోయలు, ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తాయి.

ఖర్చు ఎంతంటే?

విజయ్-రష్మికల పెళ్లి వార్తతో ఈ హోటల్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతానికి ఫిబ్రవరి చివరి వారంతో పాటు మార్చి, ఏప్రిల్ నెలల్లో కూడా బుకింగ్స్ దాదాపు ఫుల్ అయిపోయాయి. ఈ రిసార్ట్‌లో వసతి కోసం రకాన్ని బట్టి రోజుకు అయ్యే ఖర్చు ఇలా ఉంది:

వ్యాలీ వ్యూ విల్లా: రూ. 28,399 - రూ. 28,666

లేక్ వ్యూ విల్లా: రూ. 30,799 - రూ. 31,088

ప్రీమియం విల్లా: రూ. 34,799 - రూ. 35,126

అరావళి సూట్: రూ. 57,199 - రూ. 71,499

మెమెంటోస్ సూట్: రూ. 73,199 - రూ. 91,499

ఇక ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, జాకుజీ వంటి హై-ఎండ్ సౌకర్యాలు ఉండే ‘ప్రెసిడెన్షియల్ సూట్స్’ ధరలను కేవలం ప్రత్యేక విన్నపం మేరకే వెల్లడిస్తారని సమాచారం.

రాచ మర్యాదలు.. విందు భోజనాలు

ఈ రిసార్ట్‌లో డైనింగ్ ఆప్షన్స్ కూడా రాయల్‌గా ఉంటాయి. ఉదయ్ పెవిలియన్, రాయల్ వేగా వంటి రెస్టారెంట్లలో సాంప్రదాయ భారతీయ రుచులతో పాటు అంతర్జాతీయ వంటకాలు కూడా లభిస్తాయి. దీనికి తోడు ‘రాయల్ స్పా’లో పురాతన చికిత్సలతో సేదతీరవచ్చు. ఇన్ఫినిటీ పూల్, ఫిట్‌నెస్ సెంటర్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More