ఇట్స్ అఫీషియల్! పెళ్లిని కన్ఫర్మ్ చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా- విరోష్ వెడ్డింగ్ పేరుతో పోస్ట్- వారిపై గౌరవంతో!
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తమ పెళ్లిని ఎట్టకేలకు అధికారికంగా ధ్రువీకరించారు. ‘విరోష్’ పేరుతో వెడ్డింగ్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించారు విజయ్, రష్మిక.
టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న అతిపెద్ద రూమర్.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నాల ప్రేమాయణం. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాల నుంచి మొదలైన వీరి బంధం ఇప్పుడు వివాహ బంధంగా మారబోతోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది.

లేని రియాక్షన్
అందుకు తగినట్లుగా విజయ్ దేవరకొండ, రష్మిక పోస్టులు, ఫొటోలు ఉండేవి. ఇక కొన్ని రోజులుగా విజయ్, రష్మిక పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు జోరందుకున్న విషయం తెలిసిందే. కానీ, వివాహం గురించి ఇద్దరిలో ఎవరు రియాక్ట్ కాలేదు.
ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు
కానీ, తాజాగా ఆదివారం (ఫిబ్రవరి 22) రాత్రి 10 గంటల సమయంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించేశారు. విరోష్ అనే పేరుతో వెడ్డింగ్ పోస్టులను విజయ్ దేవరకొండతోపాటు రష్మిక మందన్నా ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. దీంతో విజయ్, రష్మికల వివాహం ఎట్టకేలకు అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది.
'విరోష్' వెడ్డింగ్.. అభిమానుల గౌరవార్థం!
"మా ప్రియమైన అభిమానులకు.. మేము ఏదైనా ప్లాన్ చేసే ముందే, మా కోసం మేము ఏదైనా ఎంచుకునే ముందే మీరు ఎప్పుడూ అక్కడ ఉన్నారు. మీరు ఎంతో ప్రేమతో మాకు ‘విరోష్’ (Virosh) అని పేరు పెట్టారు. అందుకే మా ఈ కలయికను మీ గౌరవార్థం ‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్’గా పిలవాలని అనుకుంటున్నాము. ఎప్పుడూ మాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు" అని ఆ నోట్‌లో విజయ్, రష్మిక పేర్కొన్నారు.
ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్?
గత ఏడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌లో అత్యంత రహస్యంగా వీరి నిశ్చితార్థం జరిగిందని, ఇప్పుడు ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల ఒక పురాతన ప్యాలెస్‌లో వీరి వివాహం జరగబోతోందని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఈ ప్రచారం అంత నిజమే అని తేలిపోయింది.
ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో జరిగే రష్మిక, విజయ్ వివాహ వేడుకకు కేవలం అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
ముహూర్తం.. వేదిక.. విశేషాలు!
అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది కాబట్టి, ఇప్పుడు అందరి కళ్లు ఫిబ్రవరి 26పైనే ఉన్నాయి.
వేదిక: రాజస్థాన్‌లోని చారిత్రాత్మక నగరం ఉదయ్‌పూర్. అక్కడి ఒక హెరిటేజ్ ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా, అదే సమయంలో ప్రైవేట్‌గా ఈ వివాహం జరగనుంది.
షెడ్యూల్: ఫిబ్రవరి 24న హల్దీ వేడుకతో హంగామా మొదలవుతుంది. 25న సంగీత్, మెహందీ.. 26న ప్రధాన వివాహ వేడుక ఉంటుంది.
రిసెప్షన్: కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఉదయ్‌పూర్‌లో పెళ్లి ముగించుకుని, మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో చిత్ర పరిశ్రమ కోసం భారీ రిసెప్షన్ ఇవ్వనున్నారు.
ఎయిర్‌పోర్టులో విజయ్, రష్మిక
ఇటీవల విమానాశ్రయంలో ఒక ఫోటోగ్రాఫర్ రష్మికను పలకరిస్తూ "మేడమ్.. 26న మీ పెళ్లి కదా, కంగ్రాచ్యులేషన్స్" అని చెప్పగా.. ఆమె కాదనకుండా కేవలం చిరునవ్వు చిందిస్తూ సిగ్గుపడటం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే, మరోవైపు రష్మిక ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ "గత నాలుగేళ్లుగా ఈ పుకార్లు వస్తూనే ఉన్నాయి కదా, జనం కూడా ఇదే అడుగుతున్నారు" అని దాటవేశారు.

న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లోనూ, అలాగే ఇటీవల జరిగిన భారత్ బియాండ్ బోర్డర్స్ కార్యక్రమంలోనూ వీరిద్దరూ కలిసి కనిపించడం, చేతికి ఉంగరాలు ధరించడం తెలిసిన విషయమే. ఇప్పుడు విజయ్, రష్మిక పెళ్లి వార్తలు నిజం కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


