పెళ్లి కార్డుతో పాటు స్పెషల్ బాక్స్.. రష్మిక-విజయ్ పంపించే గిఫ్ట్ బాక్స్‌లో ఏముందంటే! వీడియోలు వైరల్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పెళ్లి పనులు ఊపందుకున్నాయి. తమ వివాహానికి అతిథులను ఇన్వైట్ చేస్తున్నారు. వీళ్లు పెళ్లి పత్రికతో పాటు స్పెషల్ గిఫ్ట్ బాక్స్ పంపించి మరీ ఆహ్వానిస్తున్నారు. ఈ బాక్స్ లో ఉన్న ఐటెమ్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి.. ఇప్పుడు టాలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న హాట్ టాపిక్ ఇది. ఇదే నెలలో మూడుముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటి కానుంది. ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఓ ప్యాలెస్ లో వీళ్ల వివాహం జరుగుతుంది. ఈ నేపథ్యంలో శుభలేఖలు పంచుతూ అతిథులను ఈ జంట ఆహ్వానిస్తోంది. వెడ్డింగ్ కార్డుతో పాటు పంపిస్తున్న ఓ స్పెషల్ గిప్ట్ బాక్స్ తెగ వైరల్ అవుతోంది.

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి
టాలీవుడ్ లవ్ బర్డ్స్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ జంట ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లో వివాహం చేసుకోనుంది. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్ లోని ఓ హోటల్లో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు షురూ అయ్యాయి. స్పెషల్ వెడ్డింగ్ కార్డులతో అతిథులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు.
ఆ బాక్స్ లో ఏముంది?
పెళ్లి పత్రికతో పాటు అతిథులకు ఓ ప్రత్యేక గిఫ్ట్ బాక్స్ ను రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ అందిస్తున్నారు. ఈ బాక్స్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ కు చెందిన ఓ టీషర్ట్ ఉంది. రష్మిక మందన్న కంపెనీకి చెందిన నేషనల్ క్రష్ పర్ఫ్యూమ్ బాటిల్ ఉంది. చేతులకు, కాళ్లకు రాసుకునే ఓ ఆయుర్వేదిక్ క్రీమ్, ఓ జీడిపప్పు ప్యాకెట్, స్వీట్ బాక్స్ కూడా ఉన్నాయి.
వీడియో వైరల్
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి కార్డు బాక్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బాక్స్ కోసమే భారీగా ఖర్చు పెట్టారనే కామెంట్లు వస్తున్నాయి. కేవలం పెళ్లి పత్రిక ఇవ్వడమే కాకుండా ఇలా లగ్జరీ బాక్స్ పంపించి రష్మిక, విజయ్ మరోసారి తాము స్పెషల్ అని చాటుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
లవ్ స్టోరీ
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. వీళ్లు గీత గోవిందం మూవీలో తొలిసారి కలిసి నటించారు. అప్పుడే వీళ్ల మధ్య ప్రేమ మొదలైందనే టాక్ ఉంది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ మూవీతో అది ఇంకా బలపడింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రణబాలి చిత్రంలో ఈ జంట నటిస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


