విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి.. 60 కోట్ల ఓటీటీ డీల్.. నో చెప్పిన లవ్ బర్డ్స్.. కారణం ఇదేనా?

లవ్ బర్డ్స్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి విషయం హాట్ టాపిక్ గా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రేమ జంట ఇదే నెలలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. వీళ్ల పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్‌ కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చిందని టాక్. కానీ రష్మిక, విజయ్ ఈ ఆఫర్ కు నో చెప్పినట్లు లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది

Published on: Feb 14, 2026, 20:11:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సెలబ్రిటీల పెళ్లిళ్లంటే ఉండే క్రేజ్, ఏర్పడే బజ్ అంతా ఇంతా కాదు. ఇక సెలబ్రిటీల లవ్ మ్యారేజీ అంటే డిస్కషన్ మొత్తం దాని చుట్టూనే తిరుగుతోంది. ఇక ఇందులోనూ నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ వెడ్డింగ్ అంటే సందడి మరో రేంజ్ లో ఉంటుంది. అందుకే ఇప్పుడు రష్మిక, విజయ్ కు సంబంధించిన ప్రతి చిన్న విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (instagram-Vijay Deverakonda)
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (instagram-Vijay Deverakonda)

రష్మిక, విజయ్ పెళ్లి

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఉదయ్ పూర్ లో వీళ్ల మ్యారేజీ గ్రాండ్ గా జరగబోతుందని టాక్. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఏం రాలేదు. కానీ పెళ్లికి మాత్రం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయని అంటున్నారు.

క్రేజ్ వేరే లెవల్

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ వేరే లెవల్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుసగా సూపర్ హిట్ సినిమాలతో దూసుకెళ్తోంది. పుష్ప మూవీస్ తో పాన్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. 2025లో అయిదు చిత్రాలతో థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసింది. మరోవైపు కింగ్డమ్ మూవీ ఫ్లాప్ అయినా విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రౌడీ జనార్ధన్, రణబాలి లాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు.

ఓటీటీ డీల్

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ కారణంగా వీళ్ల పెళ్లిని స్ట్రీమింగ్ చేసేందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పోటీపడుతున్నాయని తెలిసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ అయితే ఏకంగా రూ.60 కోట్లు ఆఫర్ చేసినట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ రష్మిక, విజయ్ ఈ డీల్ కు నో చెప్పారని తెలిసింది. తమ పెళ్లిని బిజినెస్ చేయడం వాళ్లకు ఇష్టం లేదని, అందుకే ఓటీటీ డీల్ వద్దనుకున్నారని లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది.

రష్మిక, విజయ్ లవ్ స్టోరీ

రష్మిక, విజయ్ కలిసి ఫస్ట్ గీతా గోవిందం మూవీ చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్ల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ మూవీలో కలిసి నటించారు. అక్కడి నుంచి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు మూడోసారి రణబాలిలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడేమో పెళ్లి బంధంతో విజయ్, రష్మిక ఒక్కటి కానున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More