విజయ్ దేవరకొండతో పెళ్లి ఆ రోజేనా.. రష్మిక మందన్న సమాధానం ఇదీ..

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా. దీనిపై తాజాగా రష్మిక స్పందించింది. అదే జరిగితే తానే చెబుతానని ఓ ఇంటర్యూలో ఆమె అనడం విశేషం.

Jan 19, 2026, 16:14:59 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ పెయిర్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) పెళ్లి గురించి గత కొన్ని నెలలుగా జోరుగా చర్చ జరుగుతోంది. వీరిద్దరూ అక్టోబర్ 2025లో దసరాకు ముందే నిశ్చితార్థం చేసుకున్నారని వార్తలు రాగా, తాజాగా ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో వీరి వివాహం జరగనుందని సన్నిహిత వర్గాలు ధృవీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రష్మిక స్వయంగా ఈ విషయంపై స్పందించింది.

విజయ్ దేవరకొండతో పెళ్లి ఆ రోజేనా.. రష్మిక మందన్న సమాధానం ఇదీ..
విజయ్ దేవరకొండతో పెళ్లి ఆ రోజేనా.. రష్మిక మందన్న సమాధానం ఇదీ..

సరైన సమయం వచ్చినప్పుడు చెబుతా..

ప్రేమ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. విజయ్‌ దేవరకొండతో పెళ్లి వార్తలు, ఫిబ్రవరి 26న ఉదయపూర్ వెడ్డింగ్ గురించి రష్మికను ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చింది. "ఈ రూమర్స్ మొదలై ఇప్పటికి నాలుగేళ్లు అవుతోంది కదా? జనం కూడా ఎప్పటి నుంచో ఇదే ప్రశ్న అడుగుతున్నారు. దాని కోసమే ఎదురుచూస్తున్నారు" అని చెప్పింది.

అందరూ ఆమె గుడ్ న్యూస్ చెబుతుందేమో అని ఎదురుచూస్తుండగా.. రష్మిక తెలివిగా సమాధానం దాటవేసింది. "నిజం ఏంటంటే.. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే దీని గురించి మాట్లాడతాను. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా మేమే చెబుతాం" అని స్పష్టం చేసింది. అంతేకాకుండా కెమెరా ముందు కాకుండా ఆఫ్ ది రికార్డ్‌లో దీని గురించి మాట్లాడతానని హోస్ట్‌తో అనడం గమనార్హం.

ఉంగరాలు.. చేతిపై ముద్దు..

గతేడాది అక్టోబర్ లో నిశ్చితార్థం వార్తలు వచ్చినప్పటి నుంచి వీరిద్దరి చేతి వేళ్లకు ఉంగరాలు కనిపిస్తున్నాయి. గత నవంబర్‌లో రష్మిక నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సక్సెస్ ఈవెంట్‌లో విజయ్ ఆమె చేతిపై ముద్దు పెట్టడం వైరల్ అయ్యింది. అలాగే న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌లోనూ, ఆ తర్వాత న్యూ ఇయర్ వెకేషన్‌లోనూ ఈ జంట కలిసి సందడి చేసింది.

రాజకోటలో పెళ్లి?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ఒక పురాతన ప్యాలెస్‌లో వీరి పెళ్లి జరగనుంది. నిశ్చితార్థంలాగే పెళ్లి కూడా అత్యంత సన్నిహితుల సమక్షంలోనే జరుపుకోవాలని భావిస్తున్నారట. హైదరాబాద్ తిరిగొచ్చాక రిసెప్షన్ ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు.

సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది ‘ఛావా’, ‘సికిందర్’, ‘కుబేర’ వంటి చిత్రాలతో అలరించిన రష్మిక.. త్వరలో ‘కాక్‌టెయిల్ 2’, ‘మైసా’ చిత్రాల్లో కనిపించనుంది. అటు విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన’ సినిమాతో పాటు మరో కొత్త ప్రాజెక్టులో నటిస్తున్నాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More