Aamir Khan Birthday: అమీర్ ఖాన్ 61వ పుట్టినరోజు- మాజీ భార్యలు, పిల్లలు, గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి సెలబ్రేషన్స్!
Aamir Khan Birthday Celebration With Daughter Girlfriend: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన 61వ పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్, మాజీ భార్యలు కిరణ్ రావు, రీనా దత్తా, పిల్లలతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. ఈ ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ అమీర్ ఖాన్ తన 61వ పుట్టినరోజును (మార్చి 14) ఎంతో ఆత్మీయంగా, తన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. ఎటువంటి ఆడంబరాలు లేకుండా, ఇంట్లోనే అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక సాగింది.

ఈ వేడుకలో అమీర్ ఖాన్ ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో పాటు ఆయన పిల్లలు జునైద్ ఖాన్, ఐరా ఖాన్, ఆజాద్ రావు ఖాన్ సందడి చేశారు. విశేషమేమిటంటే, అమీర్ ఖాన్ ఇద్దరు మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు కూడా ఈ వేడుకలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆత్మీయ వేడుక.. అల్లరి ముచ్చట్లు
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఒక అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇర్ఫాన్ ఖాన్ తన భార్య సఫా బేగ్‌తో కలిసి ఈ విందుకు హాజరయ్యారు. ఈ వీడియోలో అమీర్ ఖాన్ చాలా సింపుల్‌గా స్ట్రిప్డ్ టీ-షర్ట్, బ్లాక్ ప్యాంట్‌లో కనిపించగా.. గౌరీ స్ప్రాట్ గ్రీన్ కలర్ డ్రెస్సులో మెరిశారు.
కేక్ కట్ చేసే సమయంలో ఐరా ఖాన్ కొవ్వొత్తికి బదులుగా లైటర్‌ను వెలిగించగా.. అమీర్ దానిని ఊదుతూ సరదాగా నవ్వులు పూయించారు. అనంతరం ఐరా తన తండ్రి ముఖానికి కేక్ పూసి అల్లరి చేసింది. అమీర్ తన చేతులతో మొదట ఆజాద్‌కు, ఆ తర్వాత ఐరా, గౌరీ, జునైద్‌లకు కేక్ తినిపించారు.
ఈ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. "అమీర్ భాయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. అగత్సు ఫౌండేషన్ ద్వారా ఐరా ఖాన్ చేస్తున్న సామాజిక సేవ, మానసిక ఆరోగ్యంపై ఆమె కల్పిస్తున్న అవగాహన అభినందనీయం" అని పేర్కొన్నారు.
ప్రముఖుల శుభాకాంక్షలు
సినీ పరిశ్రమ నుంచి అమీర్‌కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందాయి. కిరణ్ రావు అమీర్ ప్రొడక్షన్ హౌస్ వీడియోను షేర్ చేస్తూ.. "నా ఫరెవర్ సికందర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు" అని రాసుకొచ్చారు. అమీర్ ఖాన్‌తో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన కాజోల్ కూడా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ విష్ చేశారు.
కెరీర్ జోరు.. వరుస ప్రాజెక్టులు
ఇదిలా ఉంటే, ‘లాల్ సింగ్ చద్దా’ పరాజయం తర్వాత గతేడాది ‘సితారే జమీన్ పర్’తో అమీర్ ఖాన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన నిర్మాణ రంగంలోనూ చాలా బిజీగా ఉన్నారు. సన్నీ డియోల్ నటిస్తున్న ‘లాహోర్ 1947’ చిత్రాన్ని అమీర్ ఖాన్ నిర్మిస్తున్నారు. అలాగే, ఈ ఏడాది జనవరిలో విడుదలైన ‘హ్యాపీ పటేల్: ఖతర్నాక్ జాసూస్’లో ఆయన అతిథి పాత్రలో కనిపించారు.
అన్నిటికంటే ముఖ్యంగా, తన కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా రూపొందుతున్న ‘ఏక్ దిన్’ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఒకే వేదికపైకి తెచ్చి
ఈ సినిమా మే 1, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ బంధాలకు విలువనిచ్చే అమీర్ ఖాన్ తన పాత కొత్త బంధాలన్నిటినీ ఒకే వేదికపైకి తెచ్చి తన పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా మార్చుకున్నారు. దీంతో అమీర్ ఖాన్ అభిమానులు ఖుష్ అవుతున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


