Ira Bhaskar: ప్రతి ఒక్కరూ టెర్రరిస్టులుగానే కనిపిస్తారు, తమకు కావాల్సినదానికోసమే: ధురంధర్‌పై హీరోయిన్ తల్లి ఐరా విమర్శలు

Ira Bhaskar About Dhurandhar Movie: బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న 'ధురంధర్' సినిమాపై సినీ విశ్లేషకురాలు, హీరోయిన్ తల్లి ఐరా భాస్కర్ విమర్శలు గుప్పించారు. ఈ చిత్రం హిందుత్వ భావజాలాన్ని ప్రచారం చేస్తూ, ముస్లింలను, పాకిస్థాన్‌ను కరుడుగట్టిన హింసావాదులుగా చిత్రీకరించిందని ఐరా ఆరోపించారు.

Published on: Mar 14, 2026, 12:26:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గతేడాది డిసెంబర్‌లో విడుదలై భారతీయ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని వసూళ్లతో రికార్డులు తిరగరాసిన చిత్రం 'ధురంధర్'. రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ నెలలు గడుస్తున్నా ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంది.

ప్రతి ఒక్కరూ టెర్రరిస్టులుగానే కనిపిస్తారు, తమకు కావాల్సినదానికోసమే: ధురంధర్‌పై హీరోయిన్ తల్లి ఐరా విమర్శలు
ప్రతి ఒక్కరూ టెర్రరిస్టులుగానే కనిపిస్తారు, తమకు కావాల్సినదానికోసమే: ధురంధర్‌పై హీరోయిన్ తల్లి ఐరా విమర్శలు

తాజాగా ధురంధర్ సినిమాపై హీరోయిన్ స్వరా భాస్కర్ తల్లి, ప్రముఖ ఫిల్మ్ స్కాలర్ ఐరా భాస్కర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చిత్రంలోని రాజకీయ కోణంపై ఐరా భాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

సాంకేతికత బాగుంది.. కానీ ఉద్దేశం?

ఇటీవల ‘కార్వాన్ ఎ మొహబ్బత్’ అనే యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐరా భాస్కర్ మాట్లాడుతూ.. భారతీయ సినిమాలో కథలు చెప్పే విధానం ఎలా మారిపోయిందో వివరించారు.

"కోట్లు కొల్లగొడుతున్న ధురంధర్ వంటి సినిమాలను చూస్తుంటే.. ఒక ప్రత్యేక భావజాలానికి లోబడిన దర్శకులు వీటిని తెరకెక్కిస్తున్నారని అర్థమవుతోంది. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. కానీ, అందులోని కంటెంట్ విషయానికి వస్తే అది హిందుత్వ అజెండాను ప్రచారం చేసేలా ఉంది" అని ఐరా భాస్కర్ అభిప్రాయపడ్డారు.

ముస్లింల చిత్రీకరణపై అభ్యంతరం

ధురంధర్ సినిమాలో చూపించిన విపరీతమైన హింస ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని ఐరా భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. "ముస్లింలంటే హింసావాదులని, పాకిస్థాన్ అంటే ఒక ఉగ్రవాద దేశమని ఈ సినిమా బలంగా నమ్ముతోంది. అక్కడ మనకు ఏ ఒక్కరు కూడా సాధారణ ముస్లిం వ్యక్తిలా కనిపించడు. ప్రతి ఒక్కరూ టెర్రరిస్టులుగానో లేదా గ్యాంగ్‌స్టర్లుగానో కనిపిస్తారు. మేకప్ వాడి నిజమైన వ్యక్తుల్లా చూపించి, వాస్తవ సంఘటనల పేరుతో తమకు కావాల్సిన అంశాలనే ఎంచుకుని ఇలాంటి చిత్రాలు తీస్తున్నారు" అని ఐరా భాస్కర్ విమర్శించారు.

ప్రోపగాండా వ్యాఖ్యలను కొట్టిపారేసిన సినీ పెద్దలు

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంపై ఇప్పటికే సోషల్ మీడియాలో 'ప్రోపగాండా' (ప్రచార చిత్రం) అనే ముద్ర పడింది. అయితే కరణ్ జోహార్, శత్రుఘ్న సిన్హా వంటి ప్రముఖులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.

"హాలీవుడ్‌లో మార్వెల్ సినిమాలు అమెరికా గొప్పతనాన్ని చాటుతాయి, అప్పుడు ఎవరూ విమర్శించరు.. మరి మన దేశభక్తిని చాటే సినిమాలపైనే ఎందుకీ విమర్శలు?" అని అనురాగ్ కశ్యప్ గతంలోనే ప్రశ్నించారు.

రికార్డుల వేటలో 'ధురంధర్'

కరాచీలోని అండర్ వరల్డ్ నెట్‌వర్క్‌ను ఛేదించే ఒక భారతీయ గూఢచారి కథతో ఈ చిత్రం రూపొందింది. ఐసీ-814 హైజాకింగ్, ముంబై దాడులు వంటి నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేసింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More