Priyanka Chopra: హాలీవుడ్ అగ్ర తారల పక్కన ప్రియాంక చోప్రా- ద్వేషించిన భారతీయులు- విషపూరితమైన మనస్తత్వం అంటూ!
Priyanka Chopra Liked Social Media Influencer Video: మిలన్ వేడుకలో సింగర్ దువా లిపా తనను పట్టించుకోలేదంటూ వస్తున్న ట్రోల్స్‌పై గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పరోక్షంగా స్పందించారు. భారతీయులే మన దేశ ప్రతిభను తక్కువ చేస్తున్నారంటూ ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన వీడియోను ప్రియాంక చోప్రా లైక్ చేసింది.
గ్లోబల్ వేదికలపై ఒక భారతీయ నటి సత్తా చాటుతుంటే గర్వపడాల్సింది పోయి, ఆమెను తక్కువ చేసేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? ప్రస్తుతం ప్రియాంక చోప్రా విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇదే.

ఇటీవల మిలన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 'బల్గారీ' (Bvlgari) జ్యువెలరీ ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా తన స్టైల్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే, ఆ వేడుకకు సంబంధించిన ఒక వీడియోను పట్టుకుని, హాలీవుడ్ సింగర్ దువా లిపా ఆమెను పట్టించుకోలేదని, ఆ గుంపులో ప్రియాంకకు గుర్తింపు లేదని కొందరు నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు.
"మన వాళ్లే మనల్ని తొక్కేస్తున్నారు"
ఈ ట్రోలింగ్‌పై ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ విశ్వాస్ వర్మ ఘాటుగా స్పందించారు. భారతీయ పాపరాజీలు, నెటిజన్ల మనస్తత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఒక వీడియోను పోస్ట్ చేశారు.
"ఒక భారతీయుడు విదేశాల్లో సక్సెస్ అయితే మనం ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. కానీ, మనవాళ్లు మాత్రం ప్రియాంక చోప్రా స్థాయిని గుర్తు చేస్తూ వెక్కిరిస్తున్నారు. హాలీవుడ్ స్టార్ల పక్కన ఆమె ఎలా నిలబడుతుంది? అని ప్రశ్నిస్తున్నారు" అని ఆయన అన్నారు.
మిలియన్ల వ్యూస్ పొందుతూ
"ప్రియాంక చోప్రా ఫొటోలు, వీడియోలను వాడుకుని మిలియన్ల వ్యూస్ పొందుతున్న ఈ పాపరాజీ (ఫొటోగ్రాఫర్స్) పేజీలే, మళ్లీ ఆమెను అవమానిస్తూ కామెంట్స్ పెడుతున్నాయి. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కానీ, దురదృష్టవశాత్తు ఆమెను ద్వేషించేది మాత్రం భారతీయులే. ఇది నిజంగా విషపూరితమైన మనస్తత్వం" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విశేషమేమిటంటే, ఈ వీడియోను ప్రియాంక చోప్రా స్వయంగా లైక్ చేశారు. కేవలం ఆమె మాత్రమే కాకుండా నటీమణులు రవీనా టాండన్, హర్లీన్ సేథి కూడా ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా తమ మద్దతు తెలిపారు.
గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రియాంక
బల్గారీ వంటి అంతర్జాతీయ బ్రాండ్‌కు ప్రియాంక చోప్రా గ్లోబల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె అక్కడ కేవలం అతిథి మాత్రమే కాదు, ఆ బ్రాండ్ ముఖచిత్రం. అన్నా హతావే, జేక్ గిలెన్‌హాల్ వంటి హాలీవుడ్ అగ్ర తారల సరసన ప్రియాంక చోప్రా సమాన హోదాలో మెరిశారు. అటువంటప్పుడు ఆమెను 'ఇర్రెలివెంట్' (గుర్తింపు లేని వ్యక్తి) అని పిలవడం ప్రియాంక చోప్రా కష్టాన్ని అవమానించడమేనని నెటిజన్లు మండిపడుతున్నారు.
హాలీవుడ్‌లో తిరుగులేని ప్రయాణం
2015లో 'క్వాంటికో'తో మొదలైన ప్రియాంక చోప్రా హాలీవుడ్ ప్రయాణం ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉంది. 'బేవాచ్', 'మ్యాట్రిక్స్ రివల్యూషన్స్', 'సిటాడెల్' వంటి ప్రాజెక్టులతో ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ రిలీజ్ అయిన ది బ్లఫ్ (The Bluff) చిత్రంలో 'బ్లడీ మేరీ'గా ప్రియాంక చోప్రా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం తన భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్తీ మేరీతో కలిసి అమెరికాలో ఉంటున్న ప్రియాంక, గ్లోబల్ వేదికలపై భారత్ గర్వపడేలా చేస్తూనే ఉన్నారు.

వారణాసి సినిమాలో
అలాగే, మహేశ్ బాబు వారణాసి సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


