Medha Shankr: రూట్ మార్చిన 12th ఫెయిల్ పిల్ల- పక్కింటి అమ్మాయి ఇమేజ్‌కు దూరం- గ్లామరస్ సిటీ బ్యూటీగా మేధా శంకర్!
Medha Shankr Step Out From Girl Next Door Image: సూపర్ హిట్ 12th ఫెయిల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న బ్యూటిఫుల్ మేధా శంకర్ రూట్ మార్చింది. తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం పక్కింటి అమ్మాయి అనే ఇమేజ్‌ను పక్కన పెట్టి గ్లామరస్ సిటీ బ్యూటీగా మారుతున్నట్లు తాజాగా మేధా శంకర్ తెలిపింది.
Medha Shankr Break Girl Next Door Image: బాలీవుడ్ బ్యూటి మేధా శంకర్ కెరీర్ 2019లో 'బీచమ్ హౌస్'తో మొదలైనప్పటికీ, ఆమెకు అసలైన గుర్తింపు ఇచ్చింది మాత్రం విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన '12th ఫెయిల్' చిత్రమే. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఆ సినిమాలో శ్రద్ధా జోషి పాత్రలో మేధా ఒదిగిపోయిన తీరుకు యావత్ భారతం ఫిదా అయింది.

కేవలం రూ. 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన 12th ఫెయిల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 70 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆ సినిమా తెచ్చిన క్రేజ్‌తో సోషల్ మీడియాలో మేధా శంకర్ 'నేషనల్ క్రష్'గా మారిపోయింది.
శ్రద్ధా నుంచి గిన్నీ వరకు: ఇమేజ్ మేకోవర్
తాజాగా మేధా శంకర్ 'గిన్నీ వెడ్స్ సన్నీ 2' సినిమాలో అవినాష్ తివారీతో జతకడుతోంది. ఈ సినిమాలో మేధా ఒక సిటీ అమ్మాయిగా, అరేంజ్‌డ్ మ్యారేజ్ కోసం అబద్ధాలు ఆడే 'గిన్నీ' పాత్రలో కనిపిస్తుంది. శ్రద్ధా జోషి పాత్రలో ఉన్న అమాయకత్వం, నిశ్శబ్దం ఈ రోల్‌లో ఉండవు. ఈ పాత్రపై తాజాగా మేధా శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
"గిన్నీ పాత్ర చాలా చురుకైనది, కాస్త అసహనంతో కూడినది. కానీ, శ్రద్ధా లాగే గిన్నీని కూడా ప్రేక్షకులు ప్రేమిస్తారు" అని మేధా శంకర్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఒక నటిగా తనను తాను నిరూపించుకోవాలంటే ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు అవసరమని ఆమె నమ్ముతోంది.
టైప్‌కాస్ట్ ముద్ర పడకూడదనేనా?
అయితే, తనకు ఎక్కువగా పక్కింటి తరహా పాత్రలు వస్తున్నాయని, అవే చేసుకుంటూ వెళ్తే పక్కింటి అమ్మాయి అనే ముద్రే పడుతుందని, దాంతో వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం ఉండకపోవచ్చని మేధా శంకర్ అభిప్రాయపడుతోంది. అందుకే అందుకోసం కొత్త తరహా పాత్రల కోసం పక్కింటి అమ్మాయి అనే ట్యాగ్, ఇమేజ్ బ్రేక్ చేయాలనుకుంటున్నట్లు, అందుకే రూట్ మార్చినట్లు మేధా చెబుతోంది.
"12th ఫెయిల్ తర్వాత నాకు వచ్చిన అవకాశాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఆ ఇమేజ్ (పక్కింటి అమ్మాయి) నుంచి బయటకు రావాలని అనుకున్న మాట వాస్తవమే. ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు చేస్తే అందులో కిక్కు ఏముంటుంది? కష్టమైన సవాళ్లు ఎదుర్కొన్నప్పుడే నటిగా తృప్తి కలుగుతుంది" అని మేధా శంకర్ తన మనసులోని మాటను బయటపెట్టింది. కేవలం సేఫ్ జోన్‌లో ఉండి సినిమాలు చేయడం తనకు ఇష్టం లేదని ఆమె స్పష్టం చేసింది.
విడుదల ఎప్పుడు?
కాగా ప్రశాంత్ ఝా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2020లో వచ్చిన 'గిన్నీ వెడ్స్ సన్నీ'కి స్పిరిచువల్ సీక్వెల్‌గా వస్తోంది. సుధీర్ పాండే, లిలెట్ దూబే, గోవింద్ నామ్‌దేవ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గిన్నీ వెడ్స్ సన్నీ 2 సినిమా ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదల కానుంది. శ్రద్ధా జోషిగా అలరించిన మేధా శంకర్ ఇప్పుడు గిన్నీగా గ్లామరస్ సిటీ అమ్మాయి పాత్రలో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


