Dhurandhar 2: బాలీవుడ్ కా బాప్ ధురంధర్ 2-ఫస్ట్ హిందీ సినిమాగా హిస్టరీ-బాక్సాఫీస్ విధ్వంసం వేరే లెవల్-ఎన్ని కోట్లంటే?
Dhurandhar 2: ధురంధర్ 2 మూవీ రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. తాజాగా మరో హిస్టరీ క్రియేట్ చేసింది. చైనా మార్కెట్ ను మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా ధురంధర్ 2 నిలిచింది.
రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్ "ధురంధర్ 2" బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతోంది. రెండో వారంలోనూ ఈ మూవీ తగ్గేదేలేదన్నట్లుగా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తోంది. 13వ రోజు (మార్చి 31) ముగిసే సమయానికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1435 కోట్ల మార్కును దాటేసింది. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.

ధురంధర్ 2 హిస్టరీ
ధురంధర్ 2 సినిమా కలెక్షన్ల పరంగా కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. చైనా మార్కెట్ మినహాయించి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ సినిమాగా ధురంధర్ 2 నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1435 కోట్ల కలెక్షన్లను ఖాతాలో వేసుకుంది.
దంగల్ ఉన్నా
చైనాను కలిపి చూసుకుంటే అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా దంగల్ కొనసాగుతోంది. చైనాలోనే ఈ మూవీ రూ.1300 కోట్లు సాధించింది. కానీ ధురంధర్ 2 సినిమా చైనాలో రిలీజ్ కాకుండానే ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడం ట్రేడ్ పండితులను సైతం విస్మయానికి గురి చేస్తోంది.
ఇండియాలో ఇలా
ధురంధర్ 2 సినిమా ఇండియాలోనూ అదరగొడుతోంది. ఈ మూవీ మంగళవారం ఇండియాలో రూ.27 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ఇండియాలో మొత్తం వసూళ్లు రూ.899 కోట్లకు చేరుకున్నాయి. బుధవారం ఉదయం షోలతోనే ఈ చిత్రం రూ.900 కోట్ల మార్కును సునాయాసంగా దాటేసింది. భారతీయ సినిమా చరిత్రలో రెండో వారాంతంలో రూ.170 కోట్లు సాధించిన తొలి చిత్రంగా కూడా ఇది రికార్డుకెక్కింది.
దేశీయంగా ధురంధర్ 2 చిత్రం మొదటి వారంలోనే రూ.1000 కోట్ల ప్రపంచవ్యాప్త వసూళ్లను దాటి రికార్డు సృష్టించింది.
ఓవర్సీస్‌లో బాహుబలి 2 రికార్డ్ బ్రేక్
విదేశాల్లోనూ ధురంధర్ 2 ప్రభంజనం మామూలుగా లేదు, అంతర్జాతీయంగా ఇప్పటివరకు $38.4 మిలియన్ల వసూళ్లను సాధించింది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో "బాహుబలి 2" పేరిట ఉన్న 9 ఏళ్ల నాటి రికార్డును ఈ సినిమా బద్దలు కొట్టింది.
చైనాలో విడుదల కాకుండానే ధురంధర్ 2 ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. గతంలో అమీర్ ఖాన్ 'దంగల్' ఈ మార్కును దాటినప్పటికీ, అందులో ఎక్కువ భాగం చైనా వసూళ్లే ఉండటం గమనార్హం.
ధురంధర్ 2 గురించి..
ధురంధర్ 2 సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి దిగ్గజ నటులు నటించారు. ఈ సినిమా మొదటి భాగం రూ.1300 కోట్లు వసూలు చేయగా, ఈ సీక్వెల్ ఏకంగా రూ. 2000 కోట్ల క్లబ్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం ఇంకా థియేటర్లలో స్ట్రాంగ్‌గా కొనసాగుతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


