Dhurandhar 2 Collections: ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 1067 కోట్ల కలెక్షన్లు.. కల్కి, పఠాన్ రికార్డులు గల్లంతు
Dhurandhar 2 Collections: ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద హిస్టరీ క్రియేట్ చేస్తోంది. కేవలం 8 రోజుల్లో రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ రికార్డులు బ్రేక్ చేస్తోంది. పూర్తి బాక్సాఫీస్ రిపోర్ట్ ఇక్కడ చూడండి.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీ రూ.1,000 కోట్ల క్లబ్‌లో చేరి అదరగొట్టింది.

పుష్ప 2 తర్వాత
అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2' ఆరు రోజుల్లోనే రూ.1,000 కోట్లు వసూలు చేయగా, ధురంధర్ 2 ఎనిమిది రోజుల్లో ఆ ఘనత సాధించింది. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ 'పఠాన్', ప్రభాస్ 'కల్కి 2898 AD' వంటి భారీ చిత్రాల రికార్డులను ధురంధర్ 2 సినిమా అధిగమించింది.
ధురంధర్ 2 కలెక్షన్లు
మార్చి 19న విడుదలైన ధురంధర్ 2 మూవీ మొదటి మూడు రోజుల్లో ప్రతిరోజూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో ఓపెనింగ్ వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
దేశీయ బాక్సాఫీస్ వద్ద పంజా
వీక్ డేస్‌లో కూడా ధురంధర్ 2 సినిమా తన జోరును ఏమాత్రం తగ్గించకుండా నిలకడగా కలెక్షన్లు సాధిస్తోంది. గురువారం నాటికి ఇండియా బాక్సాఫీస్ కలెక్షన్లు రూ.674.14 కోట్లు నెట్ (రూ.805.32 కోట్లు గ్రాస్) కు చేరుకున్నాయి.
ఓవర్సీస్‌లోనూ రణ్‌వీర్ మేనియా
విదేశీ మార్కెట్లలో కూడా ధురంధర్ 2 సంచలనం సృష్టిస్తోంది. ఎనిమిది రోజుల్లో విదేశీ మార్కెట్ల నుంచి మొత్తం రూ.261.92 కోట్లు రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్ రూ.1,067.24 కోట్లకు చేరింది. గురువారం (మార్చి 27) నాటికి ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ 2కు వచ్చిన ఈ కలెక్షన్లు మరో రేంజ్ లో ఉన్నాయి.
స్టార్ హీరోల రికార్డులు
ఈ భారీ వసూళ్లతో ప్రభాస్ 'కల్కి 2898 AD' (రూ.1,042 కోట్లు), షారుఖ్ ఖాన్ 'పఠాన్' (రూ.1,050 కోట్లు) రికార్డులను ధురంధర్ 2 సినిమా తుడిచిపెట్టేసింది. ఇప్పుడు ఈ చిత్రం కన్ను 'జవాన్' (రూ.1,100 కోట్లు), 'KGF 2' కలెక్షన్లపై పడింది.
ధురంధర్ 2 గురించి
2025లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'ధురంధర్' కు సీక్వెల్ గా ధురంధర్ 2 సినిమా తెరకెక్కింది. మొదటి భాగంలో పాకిస్తాన్ అండర్ వరల్డ్ లోకి హమ్జా చొరబడటాన్ని చూపిస్తే, ఈ సీక్వెల్ లో అతని అసలు మూలాలు, జస్కిరాత్ సింగ్ రంగిగా అతని ప్రయాణాన్ని చూపించారు. రణ్‌వీర్ సింగ్ యాక్టింగ్, ఆదిత్య ధర్ టేకింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
అగ్ర దర్శకుల ప్రశంసలు
రణ్‌వీర్ సింగ్ తో పాటు ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి దిగ్గజ నటులు ఈ సినిమాలో నటించారు. ఈ చిత్రంపై ఎస్.ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకులు ప్రశంసలు కురిపించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


