Sign in

రప్పా.. రప్పా.. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో పుష్ప 2 డామినెన్స్.. బెస్ట్ హీరో అల్లు అర్జున్ రియాక్షన్.. తెలుగు ఫుల్ లిస్ట్

థియేటర్లలోనే కాదు అవార్డుల్లోనూ పుష్ప 2 డామినెన్స్ కొనసాగుతోంది. తాజాగా 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో పుష్ప 2 అదరగొట్టింది. ఏకంగా అయిదు అవార్డులు ఖాతాలో వేసుకుంది. ఇందులో బెస్ట్ హీరో, బెస్ట్ మూవీ కేటగిరీలు కూడా ఉన్నాయి. 

Published on: Feb 22, 2026, 15:10:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాక్సాఫీస్ ను షేక్ చేసిన పుష్ప 2 మూవీ.. ఇప్పుడు అవార్డుల్లోనూ అదరగొట్టింది. ప్రతిష్ఠాత్మక ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాల్లో ఆధిపత్యం చలాయించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు అవార్డులు ఖాతాలో వేసుకుంది. 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో పుష్ప 2 సినిమా గెలిచిన పురస్కారాలు, తెలుగు మూవీస్ అందుకున్న అవార్డుల లిస్ట్ ఇక్కడుంది.

అవార్డుతో అల్లు అర్జున్ (x.alluarjun)
అవార్డుతో అల్లు అర్జున్ (x.alluarjun)

పుష్ప 2 జోరు

2024కు గాను అందించిన 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో పుష్ప 2 అదరగొట్టింది. అయిదు అవార్డులు సొంతం చేసుకుంది. తెలుగు చిత్రాల విభాగంలో సత్తాచాటింది. బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్, బెస్ట్ డైరెక్టర్ గా సుకుమార్, బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డులను పుష్ప 2 సినిమా సొంతం చేసుకుంది.

అల్లు అర్జున్ రియాక్షన్

పుష్ప 2 సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ సోషల్ మీడియాలో రియాక్టయ్యాడు. ఫ్యాన్స్ కు ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు తెలిపాడు.

‘‘ఈ అద్భుతమైన గౌరవానికి ఫిల్మ్‌ఫేర్‌ కు ధన్యవాదాలు. నాకెంతో విలక్షణమైన ప్రేమ అందించే ప్రాంతంలో ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరి ఆశీర్వాదాలు నాపై ఉన్నాయి. నాపై అమితమైన ప్రేమ చూపించే నా ఫ్యాన్స్ కు ఈ అవార్డు అంకితం’’ అని అల్లు అర్జున్ ఎక్స్ లో రాసుకొచ్చాడు.

ఫుల్ లిస్ట్

70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో తెలుగు సినిమాలకు సంబంధించి విజేతల లిస్ట్ ఇక్కడుంది.

ఉత్తమ చిత్రం: పుష్ప 2: ది రూల్

ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2: ది రూల్)

ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): లక్కీ భాస్కర్

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజ సజ్జా (హను మాన్)

ఉత్తమ నటి: నివేతా థామస్ (35 చిన్న కథ కాదు)

ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ అగర్వాల్ (సత్యభామ)

ఉత్తమ సహాయ నటుడు : అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 AD)

ఉత్తమ సహాయ నటి: అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)

ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప 2: ది రూల్)

ఉత్తమ లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి (దేవర పార్ట్ 1లోని చుట్టమల్లే)

ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్: శిల్పారావు (దేవర: పార్ట్ 1లోని చుట్టమల్లె సాంగ్)

ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ మేల్: శ్రీ కృష్ణ (గుంటూరు కారంలోని కుర్చి మడతపెట్టి సాంగ్)

ఉత్తమ డెబ్యూ డైరెక్టర్: యధు వంశీ (కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ డెబ్యూ నటి: నయన్ సారిక (గం గం గణేశ)

ఉత్తమ డెబ్యూ నటుడు: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కల్కి 2898 ఏడీ, పుష్ప 2

ఉత్తమ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్ (కుర్చీ మడతపెట్టి)

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More