ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ నామినేషన్లు.. బెస్ట్ మూవీ రేసులో పుష్ప 2, కల్కి 2898 ఏడీ, హనుమాన్.. నామినేషన్ల పూర్తి జాబితా

70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సౌత్ నామినేషన్ల జాబితా వచ్చేసింది. 2024 ఏడాదికిగాను తెలుగుతోపాటు కన్నడ, తమిళ, మలయాళ భాషలకు చెందిన బెస్ట్ మూవీస్, డైరెక్టర్స్, యాక్టర్స్ కు ఈ అవార్డులను ఇస్తారు. ఆ నామినేషన్ల పూర్తి జాబితా ఇక్కడ చూడండి.

Feb 12, 2026, 17:03:27 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2024లో విడుదలైన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలకు గాను 70వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్ నామినేషన్లను గురువారం (ఫిబ్రవరి 12) ప్రకటించారు. ఫిబ్రవరి 21న కేరళ వేదికగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. అల్లు అర్జున్ 'పుష్ప 2', శివకార్తికేయన్ 'అమరన్', ఫహద్ ఫాసిల్ 'ఆవేశం' వంటి సినిమాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. పూర్తి నామినేషన్ల జాబితా ఇక్కడ చూడండి.

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ నామినేషన్లు.. బెస్ట్ మూవీ రేసులో పుష్ప 2, కల్కి 2898 ఏడీ, హనుమాన్.. నామినేషన్ల పూర్తి జాబితా
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ నామినేషన్లు.. బెస్ట్ మూవీ రేసులో పుష్ప 2, కల్కి 2898 ఏడీ, హనుమాన్.. నామినేషన్ల పూర్తి జాబితా

పూర్తి నామినేషన్ల జాబితా

తెలుగు (Telugu):

బెస్ట్ మూవీ

35 చిన్న కథ కాదు

కమిటీ కుర్రోళ్ళు

హను-మాన్

కల్కి 2898 AD

లక్కీ భాస్కర్

పుష్ప 2: ది రూల్

బెస్ట్ డైరెక్టర్

నాగ్ అశ్విన్ (కల్కి 2898 AD)

నంద కిషోర్ ఈమని (35 చిన్న కథ కాదు)

ప్రశాంత్ వర్మ (హను-మాన్)

సుకుమార్ (పుష్ప 2: ది రూల్)

వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)

యదు వంశీ (కమిటీ కుర్రోళ్ళు)

బెస్ట్ యాక్టర్ (మేల్)

అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)

దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)

జూనియర్ ఎన్టీఆర్ (దేవర: పార్ట్ 1)

నాని (సరిపోదా శనివారం)

సిద్దు జొన్నలగడ్డ (టిల్లు స్క్వేర్)

తేజ సజ్జా (హను-మాన్)

బెస్ట్ యాక్టర్ (ఫిమేల్)

అనుపమ పరమేశ్వరన్ (టిల్లు స్క్వేర్)

ఆషికా రంగనాథ్ (నా సామిరంగ)

మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)

నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)

ప్రియాంక మోహన్ (సరిపోదా శనివారం)

రష్మిక మందన్న (పుష్ప 2: ది రూల్)

ఉత్తమ సహాయ నటుడు (మేల్)

అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 AD)

ధనంజయ (జీబ్రా)

ఫహద్ ఫాసిల్ (పుష్ప 2: ది రూల్)

సత్య (మత్తు వదలరా 2)

ఎస్.జె. సూర్య (సరిపోదా శనివారం)

వినయ్ రాయ్ (హను-మాన్)

ఉత్తమ సహాయ నటి (Female)

అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)

ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)

రాశి సింగ్ (ప్రసన్న వదనం)

శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజి బ్యాండు)

శ్రద్ధా శ్రీనాథ్ (మెకానిక్ రాకీ)

వరలక్ష్మి శరత్‌కుమార్ (హను-మాన్)

ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్

అనిరుధ్ రవిచందర్ (దేవర: పార్ట్ 1)

చైతన్ భరద్వాజ్ (హరోం హర)

దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప 2: ది రూల్)

జి.వి. ప్రకాష్ కుమార్ (లక్కీ భాస్కర్)

గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ (హను-మాన్)

జేక్స్ బిజోయ్ (సరిపోదా శనివారం)

తమన్ ఎస్ (గుంటూరు కారం)

తమిళం (Tamil)

ఉత్తమ చిత్రం: అమరన్, కొట్టుక్కాలి, లబ్బర్ పండు, మహారాజా, మెయ్యళగన్, వాళై

ఉత్తమ దర్శకుడు: సి. ప్రేమ్ కుమార్ (మెయ్యళగన్), మారి సెల్వరాజ్ (వాళై), నితిలన్ స్వామినాథన్ (మహారాజా), పా. రంజిత్ (తంగలాన్), పి.ఎస్. వినోద్‌రాజ్ (కొట్టుక్కాలి), రాజ్‌కుమార్ పెరియసామి (అమరన్)

ఉత్తమ నటుడు: అరవింద్ స్వామి (మెయ్యళగన్), అట్టకత్తి దినేశ్ (లబ్బర్ పంతు), విక్రమ్ (తంగలాన్), ధనుష్ (కెప్టెన్ మిల్లర్), శివకార్తికేయన్ (అమరన్), సూరి (గరుడన్), విజయ్ సేతుపతి (మహారాజా)

ఉత్తమ నటి: అన్న బెన్ (కొట్టుక్కాలి), కీర్తి సురేష్ (రఘు తాత), సాయి పల్లవి (అమరన్), సిమ్రాన్ (అంధగన్), శ్రీ గౌరీ ప్రియ (లవర్), ఊర్వశి (జే బేబీ)

మలయాళం (Malayalam)

ఉత్తమ చిత్రం: ఆడుజీవితం, ఆట్టం, ఆవేశం, భ్రమయుగం, కిష్కింధ కాండం, మంజుమ్మెల్ బాయ్స్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, ప్రేమలు, ఉల్లోళుక్కు

ఉత్తమ దర్శకుడు: బ్లెస్సీ (ఆడుజీవితం), చిదంబరం (మంజుమ్మెల్ బాయ్స్), జిత్రు మాధవన్ (ఆవేశం), రాహుల్ సదాశివన్ (భ్రమయుగం) తదితరులు.

ఉత్తమ నటుడు: ఆసిఫ్ అలీ (కిష్కింధ కాండం), బేసిల్ జోసెఫ్ (సూక్ష్మదర్శిని), ఫహద్ ఫాసిల్ (ఆవేశం), మమ్ముట్టి (భ్రమయుగం), పృథ్వీరాజ్ సుకుమారన్ (ఆడుజీవితం), టొవినో థామస్ (ARM)

ఉత్తమ నటి: మమితా బైజు (ప్రేమలు), నజ్రియా (సూక్ష్మదర్శిని), పార్వతి తిరువోతు (ఉల్లోళుక్కు), ఊర్వశి (ఉల్లోళుక్కు) తదితరులు.

కన్నడ (Kannada)

ఉత్తమ చిత్రం: బఘీర, భీమ, బ్లింక్, హదినెలెంటు, కృష్ణం ప్రణయ సఖి, శాఖాహారి

ఉత్తమ నటుడు: దునియా విజయ్ (భీమ), గణేష్ (కృష్ణం ప్రణయ సఖి), శివరాజ్‌కుమార్ (భైరతి రణగల్), శ్రీమురళి (బఘీర), సుదీప్ (మ్యాక్స్)

ఉత్తమ నటి: రుక్మిణి వసంత్ (బఘీర), చైత్ర ఆచార్ (బ్లింక్) తదితరులు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More