అల్లు అర్జున్ ఓ లూజర్.. వాళ్లకు పవర్ మాత్రమే కావాలి.. నాపై దాడి చేస్తారా: ఐకాన్ స్టార్‌పై పాడ్‌కాస్టర్ సంచలన పోస్ట్

అల్లు అర్జున్, అతని టీమ్ లూజర్స్ అంటూ ఓ పాడ్‌కాస్టర్ చేసిన పోస్ట్ సంచలనం రేపుతోంది. స్వీకృతి అనే ఆ పాడ్‌కాస్టర్ బ్రాండ్ మేనేజర్ కావేరీ బారువాతో చేసిన ఇంటర్వ్యూలో బన్నీపై చేసిన కామెంట్స్, ఆ వీడియో వైరల్ కావడంతో అతని టీమ్ నుంచి తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నట్లు చెప్పింది.

Published on: Feb 11, 2026, 13:50:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 రూల్స్ పాటించాలన్న వివాదం ముదురుతోంది. బన్నీ టీమ్ లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించిన తర్వాత.. సదరు పాడ్‌కాస్ట్ హోస్ట్ స్వీకృతి వీడియోను డిలీట్ చేసింది. అయితే అల్లు అర్జున్ టీమ్ తనను, తన గెస్ట్‌ను వేధిస్తోందంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. వారిని 'లూజర్స్' అని అంటూ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

అల్లు అర్జున్ ఓ లూజర్.. వాళ్లకు పవర్ మాత్రమే కావాలి.. నాపై దాడి చేస్తారా: ఐకాన్ స్టార్‌పై పాడ్‌కాస్టర్ సంచలన పోస్ట్ (X/@PushpaMovie)
అల్లు అర్జున్ ఓ లూజర్.. వాళ్లకు పవర్ మాత్రమే కావాలి.. నాపై దాడి చేస్తారా: ఐకాన్ స్టార్‌పై పాడ్‌కాస్టర్ సంచలన పోస్ట్ (X/@PushpaMovie)

పీఆర్ టీమ్, బాట్స్ దాడి చేస్తున్నాయి..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ ముసురుకున్న '42 రూల్స్' వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరీ బారువా చేసిన ఆరోపణలు నిరాధారమని, ఆమెపై పరువు నష్టం దావా వేస్తామని అల్లు అర్జున్ టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు పాడ్‌కాస్ట్ హోస్ట్ స్వీకృతి (Sweekriti) స్పందించింది. వీడియోను తొలగిస్తూనే.. బన్నీ టీమ్‌పై సంచలన ఆరోపణలు చేసింది.

మంగళవారం (ఫిబ్రవరి 10) సాయంత్రం స్వీకృతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోను (YouTube, Instagram నుంచి) తొలగించినట్లు తెలిపింది. దీనికి కారణం చెబుతూ.. "నా గెస్ట్ (కావేరీ)పై పీఆర్ మిషనరీ, బాట్ అకౌంట్స్ (Bot accounts) ద్వారా మూకుమ్మడిగా దాడి జరుగుతోంది. ఆమె ఒక ప్రముఖ సంస్థలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ఆన్‌లైన్ బూతులతో ఆమె కెరీర్ నాశనం కావడం నాకు ఇష్టం లేదు. అందుకే వీడియో తీసేసాను" అని రాసుకొచ్చింది.

"అల్లు అర్జున్ టీమ్ పవర్ హంగ్రీ.."

వీడియో తీసేసినా ఆమె తగ్గలేదు. "మా చర్చ వాస్తవాల ఆధారంగానే జరిగింది. పరువు తీయడానికి కాదు. కానీ అల్లు అర్జున్, ఆయన టీమ్ జవాబుదారీగా ఉండకుండా.. అధికారాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు. వాళ్లు కేవలం ‘లూజర్స్’. అధికార దాహం ఉన్నవాళ్లు" అంటూ స్వీకృతి ఘాటు వ్యాఖ్యలు చేసింది.

"నిజం మాట్లాడితే ఇలాగే ఉంటుంది.."

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడి గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. "ఒక మహిళ ఇంటర్నెట్‌లో ప్రశాంతంగా కంటెంట్ చేసుకోలేదా? బన్నీ పీఆర్ టీమ్ నాపై దాడి చేస్తోంది. నన్ను తిట్టినంత మాత్రాన నన్ను కిందకు లాగలేరు. నిజం మాట్లాడితే ఏం జరుగుతుందో ఇప్పుడు అర్థమైంది" అని ఆమె పేర్కొంది. బన్నీ అభిమానులు పెడుతున్న అసభ్యకర కామెంట్ల స్క్రీన్ షాట్లను కూడా ఆమె షేర్ చేశారు.

అసలు వివాదం ఇదీ..

'స్వీకృతి టాక్స్'లో కావేరీ బారువా మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌ను కలవడానికి వెళ్లినప్పుడు 42 కండిషన్లు పెట్టారని, కళ్ళల్లోకి చూడకూడదని చెప్పారని ఆరోపించారు. దీనిపై బన్నీ టీమ్ స్పందిస్తూ ఇవన్నీ అబద్ధాలని, లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది. ప్రస్తుతం కావేరీ తన సోషల్ మీడియా ఖాతాలను డీయాక్టివేట్ చేసుకున్నారు.

స్వీకృతి పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ
స్వీకృతి పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ
  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More