అల్లు అర్జున్ కళ్లలోకి చూడొద్దు.. షేక్ హ్యాండ్ ఇవ్వొద్దా? 42 కండిషన్ల రచ్చ.. బ్రాండ్ మేనేజర్‌పై లీగల్ యాక్షన్
అల్లు అర్జున్ సీరియస్ అయ్యాడు. తనను కలవాలంటే 42 కండిషన్లకు ఒప్పుకోవాల్సిందే అంటూ ఓ బ్రాండ్ మేనేజర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ పై లీగల్ యాక్షన్ కు రెడీ అయ్యాడు. కళ్లలోకి చూడొద్దు, షేక్ హ్యాండ్ ఇవ్వొద్దంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 రూల్స్ పాటించాలంటూ బ్రాండ్ మేనేజర్ కావేరీ బారువా చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. కళ్ళల్లోకి చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అంటూ ఆమె చేసిన ఆరోపణలను బన్నీ టీమ్ తీవ్రంగా ఖండించింది. ఆమెపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించింది.

అసలేం జరిగిందంటే?
'పుష్ప' స్టార్ అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. అయితే ఈసారి సినిమా వల్ల కాదు.. ఒక వివాదాస్పద ఆరోపణ వల్ల. కావేరీ బారువా అనే బ్రాండ్ మేనేజర్ ఒక పాడ్‌కాస్ట్‌లో అల్లు అర్జున్‌ను కలవడానికి వెళ్లినప్పుడు తనకు ఎదురైన వింత అనుభవాల గురించి చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. దీనిపై బన్నీ టీమ్ సీరియస్‌గా స్పందించింది.
'స్వీకృతి టాక్స్' అనే పాడ్‌కాస్ట్‌లో కావేరీ మాట్లాడుతూ.. "హైదరాబాద్ మెగాస్టార్ అల్లు అర్జున్‌ను కలవడానికి వెళ్ళినప్పుడు.. ఆయన టీమ్ నాకు ఒక లిస్ట్ ఇచ్చింది. అందులో ఏం చేయాలి ఏం చేయొద్దని చెప్పే ఏకంగా 42 కండిషన్లు ఉన్నాయి. ఆయన మేనేజర్‌కి మేనేజర్, అతనికి ఇంకో మేనేజర్.. ఇలా పెద్ద పరివారమే ఉంటుంది. వాళ్లు చాలా స్ట్రిక్ట్. 'సార్ కళ్ళల్లోకి చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు' అని చెప్పారు," అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. "ఎందుకు ఇలా?" అని అడిగితే.. "మాకు తెలీదు, అదే రూల్" అని చెప్పారని ఆమె పేర్కొంది.
బన్నీ టీమ్ రియాక్షన్.. లీగల్ యాక్షన్
ఈ వీడియో వైరల్ అవ్వడం, నెటిజన్లు అల్లు అర్జున్‌పై విమర్శలు చేయడం మొదలుపెట్టడంతో బన్నీ టీమ్ రంగంలోకి దిగింది. మంగళవారం (ఫిబ్రవరి 10) ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
"అల్లు అర్జున్ గారి గురించి వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవం. ఆయన ఎప్పుడూ అందరితో చాలా గౌరవంగా, హుందాగా ప్రవర్తిస్తారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. బాధ్యులపై మా లీగల్ టీమ్ పరువు నష్టం కేసు నమోదు చేస్తోంది. దయచేసి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయకండి" అని బన్నీ టీమ్ హెచ్చరించింది.
సోషల్ మీడియా నుంచి మాయం..
రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) బ్రాండ్ స్ట్రాటజీ విభాగంలో పనిచేసినట్లు చెప్పుకున్న కావేరీ.. ఈ వివాదం ముదరడంతో తన సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే యూట్యూబ్‌లో ఆ పాడ్‌కాస్ట్ వీడియో ఇంకా ఉంది. బన్నీపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు ఆమె ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


