Dhurandhar 2 Collections: ధురంధర్ 2 దూకుడు.. 6 రోజుల్లోనే 900 కోట్లు దాటిన కలెక్షన్లు.. తెలుగులో ఇలా

Dhurandhar 2 Collections: ర‌ణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధ‌ర్‌ 2' బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగిస్తూనే ఉంది. ఈ సినిమా కేవలం 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.919 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో అద్భుతాలు సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ కలెక్షన్ల మోత మోగిస్తోంది.

Published on: Mar 25, 2026, 05:39:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌వీర్ సింగ్ నటించిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'ధురంధ‌ర్‌: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం 6 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.919 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది.

ధురంధర్ 2లో ర‌ణ్‌వీర్
ధురంధర్ 2లో ర‌ణ్‌వీర్

ధురంధర్ 2 కలెక్షన్లు

ధురంధర్ 2 సినిమా రన్నింగ్ టైమ్ 3 గంటల 49 నిమిషాలు ఉన్నప్పటికీ, ప్రేక్షకులు ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు కలెక్షన్లే నిదర్శనం. సక్నిల్క్ ప్రకారం ధురంధర్ 2 సినిమాకు ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.919 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇండియాలో చూసుకుంటే గ్రాస్ కలెక్షన్లు రూ.687.43 కోట్లుగా ఉన్నాయి.

ఆరో రోజు

వీక్ డేస్ లో కూడా ధురంధర్ 2 జోరు కొనసాగుతోంది. అయిదో రోజు రూ.65 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ ఆరో రోజు (మార్చి 24) రూ.56.55 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. మంగళవారం థియేటర్ల ఆక్యుపెన్సీ 36.6% గా నమోదైంది.

ఆ రికార్డు దిశగా

ధురంధర్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద అత్యంత వేగంగా దూసుకుపోతోంది. ధురంధ‌ర్‌ 2 కేవలం ఆరు రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్లను సాధించి, అతి తక్కువ కాలంలో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరే దిశగా దూసుకుపోతోంది.

తెలుగులో

ధురంధర్ 2 ఆరో రోజు కలెక్షన్లు చూసుకుంటే హిందీ వెర్షన్ నుంచి అత్యధిక వసూళ్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా 17,910 షోలతో 36.7% ఆక్యుపెన్సీతో రూ.52.00 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత తెలుగు వర్షన్ నుంచే ఎక్కువ కలెక్షన్లు రావడం విశేషం. తెలుగు వెర్షన్ 42.0% ఆక్యుపెన్సీతో రూ.3.10 కోట్లు వసూలు చేసి మంచి ప్రదర్శన కనబరిచింది. తమిళ వెర్షన్ నుంచి రూ.1.10 కోట్లు వచ్చాయి.

ధురంధర్ 2 గురించి

జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ నిర్మించిన ధురంధర్ 2 చిత్రంలో ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా అదరగొట్టాడు. ఈ మూవీలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్.మాధవన్ వంటి హేమాహేమీలు నటించడం కలిసొచ్చింది. వాస్తవిక సంఘటనల ఆధారంగా, ముఖ్యంగా 26/11 దాడులకు ప్రతీకారం తీర్చుకుంటూ సాగే అండర్ కవర్ ఆపరేషన్ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

మార్చి 19న ధురంధర్ 2 థియేటర్లలో రిలీజైంది. అప్పటి నుంచి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తూనే ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More