Dhurandhar 2 World Wide Collections: ధురంధర్ 2 ఆల్‌టైమ్ హిస్టరీ-ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్-అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు
Dhurandhar 2 World Wide Collections: రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాగా ధురంధర్ 2 నిలిచింది. ఆర్ఆర్ఆర్ రికార్డును ఇది బ్రేక్ చేసింది.
ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదో సరికొత్త చరిత్ర. రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద ఊహకందని సునామీని సృష్టించింది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే రూ.240 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 సినిమాల రికార్డును బ్రేక్ చేసింది.

ధురంధర్ 2 రికార్డు
రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2కు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. గురువారం థియేటర్లకు వచ్చిన ఈ మూవీ ఓపెనింగ్ కలెక్షన్లలో కొత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన సినిమాగా ధురంధర్ 2 నిలిచింది.
వరల్డ్ వైడ్ కలెక్షన్లు
ధురంధర్ 2 సినిమా ఓపెనింగ్ కలెక్షన్లు అదిరిపోయాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఇందులో ప్రీమియర్ షో ప్లస్ ఫస్ట్ డే వసూళ్లు ఉన్నాయి. సక్నిల్క్ ప్రకార ప్రీమియర్ షోల ద్వారా ధురంధర్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లు వసూలు చేసింది. ఇక ఫస్ట్ డే కలెక్షన్లు రూ.165 కోట్లుగా ఉన్నాయ
ఆర్ఆర్ఆర్ ను దాటి
ఇప్పటివరకు తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్ కొనసాగేది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్లు సాధించింది. ఆ తర్వాత బాహుబలి 2 (రూ.214 కోట్లు) సెకండ్ ప్లేస్ లో ఉండేది. ఇప్పుడు ధురంధర్ 2 ఏకంగా రూ.240 కోట్లు రాబట్టి ఆల్ టైమ్ నంబర్ 1 ఇండియన్ ఓపెనర్‌గా నిలిచింది.
అసలు కారణం
ధురంధర్ 2 కలెక్షన్లలో పెయిడ్ ప్రివ్యూలు కీలక పాత్ర పోషించాయి. బుధవారం సాయంత్రం వేసిన షోల ద్వారానే ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లు వచ్చాయి. ఇక విడుదల రోజైన గురువారం నాడు దేశవ్యాప్తంగా ఉగాది, గుడి పడ్వా సెలవులు ఉండటంతో థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి.
అక్కడ కూడా
కేవలం ఇండియాలోనే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ధురంధర్ 2 అదరగొట్టింది. 9 మిలియన్ డాలర్లు (సుమారు రూ.75 కోట్లు) ఓవర్సీస్ కలెక్షన్లు సాధించింది. ఫస్ట్ పార్ట్ 'ధురంధర్' ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రికార్డు ఓపెనింగ్ తో ఆ సంఖ్యను ధురంధర్ 2 దాటేలా కనిపిస్తుంది. ఈ మూవీ రూ.2 వేల కోట్ల వసూళ్లు సాధించిన ఆశ్చర్యపోనవసరం లేదని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


