Dhurandhar 2 Review: ధురంధర్ 2 రివ్యూ- ట్విస్టులు, అదిరిపోయే యాక్షన్ సీన్లు- రణ్‌వీర్ సింగ్ నట విశ్వరూపం-పగ తీరినట్టేనా?

Dhurandhar 2 Review In Telugu: గతేడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘ధురంధర్’ మూవీ సీక్వెల్‌ చిత్రం ‘ధురధర్: ది రివెంజ్’ థియేటర్లలోకి ఇవాళ వచ్చేసింది. రణ్‌వీర్ సింగ్ తన నట విశ్వరూపాన్ని చూపించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, అంచనాలను అందుకుందా లేదా అన్నది నేటి ధురంధర్ 2 రివ్యూలో చూద్దాం.

Published on: Mar 19, 2026, 12:19:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినీ ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎన్నో అంచనాలు ఉన్న ధురంధర్: ది రివేంజ్ మూవీ ఇవాళ (మార్చి 19) థియేటర్లలో అడుగుపెట్టింది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

ధురంధర్ 2 రివ్యూ- ట్విస్టులు, అదిరిపోయే యాక్షన్ సీన్లు- రణ్‌వీర్ సింగ్ నట విశ్వరూపం-పగ తీరినట్టేనా?
ధురంధర్ 2 రివ్యూ- ట్విస్టులు, అదిరిపోయే యాక్షన్ సీన్లు- రణ్‌వీర్ సింగ్ నట విశ్వరూపం-పగ తీరినట్టేనా?

ఆ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ధురంధర్ 2 సుమారు నాలుగు గంటల రన్‌టైమ్‌తో ఇండియన్ ఆడియెన్స్‌ను పలకరించింది. రణ్‌వీర్ సింగ్ ఇండియన్ స్పైగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి ధురంధర్ 2 రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ధురంధర్ పార్ట్ 2 మొదలవుతుంది. రెహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా) మరణం తర్వాత ల్యారీ గ్యాంగ్‌స్టర్ సామ్రాజ్యం ఖాళీ అవుతుంది. అదే అదనుగా భావించిన మరో గ్యాంగ్ నాయకుడు అర్షద్ పప్పు (అశ్విన్ ధర్) ల్యారీకి కింగ్‌గా ప్రకటించుకుంటాడు. తన అన్న చావుకు అర్షద్ కారణమని తెలిసిన ఉజెయిర్ బలోచ్ (డానిష్) పగ తీర్చుకోవాలనుకుంటాడు.

అన్న చావుపై ఉజేయిర్ ఎలా పగ తీర్చుకున్నాడు? ల్యారీ పీఠంపై ఉజేయిర్‌ను కూర్చోబెట్టి జస్కిరాత్ సింగ్ అలియాస్ హమ్జా అలీ మజారీ (రణ్‌వీర్ సింగ్) ఎలాంటి మైండ్ గేమ్ ఆడాడు?, హమ్జా గతం ఏంటీ? అతను ఎందుకు ఇండియన్ స్పైగా మారాడు? ల్యారీలో ఎస్పీ అస్లాం చౌదరి (సంజయ్ దత్) నుంచి హమ్జాకు ఎదురైన సవాళ్లు ఏంటీ? మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) వేసిన ఉగ్రదాడులు ఏంటీ? వాటిని హమ్జా అడ్డుకున్నాడా? అనేది తెలియాంటే ఈ ధురంధర్ ది రివేంజ్ చూడాల్సిందే.

విశ్లేషణ:

మొదటి పార్ట్‌లాగే ఈ సీక్వెల్‌ను కూడా పార్ట్స్‌లాగా అర్థమయ్యేలా తెరకెక్కించారు. ఆరు చాప్టర్లుగా ఉన్న ధురంధర్ 2 ఇంటెన్స్ సీన్స్, యాక్షన్, థ్రిల్, ఎమోషన్ వంటి అన్ని అంశాలతో సాగిపోతుంది. కథ నుంచి కథనం వరకు ఇండియన్ స్పై థ్రిల్లర్స్‌లోకెల్లా అరుదైన సినిమాగా ధురంధర్ 2ని నిలబెట్టారు డైరెక్టర్ ఆదిత్య ధర్.

జస్కిరాత్ సింగ్ కుటుంబానికి జరిగిన అన్యాయం, దానికి అతను తీర్చుకున్న పగ నుంచి సినిమాను ప్రారంభించారు. ఆ సీన్లతో జస్కిరాత్ సింగ్ పాత్ర ఎంత హింసాత్మకంగా ఉంటుందో చూపించారు. ఆ తర్వాత ల్యారీలో అర్షద్ పప్పు కింగ్ అవడం, ఆ స్థానాన్ని ఉజేయిర్ బలోచ్‌కు దక్కేలా చేస్తూ వెనుక నుంచి హమ్జా కథ అంతా నడిపించే సీన్స్ అదిరిపోతాయి.

మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్

ఇండియాలో డ్రగ్స్, ఫేక్ కరెన్సీ సరఫరా, వాటి నుంచి వచ్చే రాబడి పాకిస్థాన్‌కు ఎలా చేరుతుందనే అంశాలతో స్లోగా నడిచిన ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంటుంది. సెకండాఫ్ అంతా ఫాస్ట్‌గా సాగిపోతుంది. ఒక్కో సన్నివేశం అలా వెళ్లిపోతూనే ఉంటుంది.

హమ్జాపై అస్లాంకు డౌట్ రావడం, ఎలీనాకు తన భర్త నిజ స్వరూపం తెలియడంతో కథ ఒక్కసారిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. జమీల్ జమాలీ పాత్ర ఇచ్చే ట్విస్ట్ మాములుగా ఉండదు. హమ్జా స్పై అని తెలియడంతో మేజర్ ఇక్బాల్ చేసే పనులు, ఎస్పీ అస్లాం అటాక్ చేయడం, ల్యారీ టాస్క్ ఫోర్స్ నుంచి హమ్జా తప్పించుకునే సీన్స్ నెక్ట్స్ లెవెల్ ఉంటాయి.

ఇక క్లైమాక్స్‌కు అరగంట ముందు వచ్చే యాక్షన్ బ్లాక్ విధ్వంసం అని చెప్పొచ్చు. ఆ తర్వాత వరుసగా వచ్చే ట్విస్టులు థ్రిల్ పంచుతాయి. క్లైమాక్స్ అదిరిపోతుంది. శశ్వత్ సచ్‌దేవ్ అందించిన బీజీఎమ్ సినిమాకు వెన్నెముకగా నిలిచింది. కానీ, పాటలు అంతగా గుర్తుండేలా లేవు. క్లైమాక్స్ బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, విజువల్స్ టాప్ నాచ్ అని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి

రణ్‌వీర్ సింగ్ నట విశ్వరూపం

ఇక జస్కీరాత్ సింగ్ అలియాస్ హమ్జాగా రణ్‌వీర్ సింగ్ నట విశ్వరూపం చూపించాడు. నటనతో సినిమాను తన భుజాలపై మోశాడు. రెండు విభిన్న పార్శ్వాలను ఆయన పండించిన తీరు అమోఘం. ఆయన పడే వేదన, సంఘర్షణ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి.

మేజర్ ఇక్బాల్‌గా అర్జున్ రాంపాల్ మెప్పించాడు. ఎస్పీ అస్లాంగా సంజయ్ దత్, జమీల్ జమాలీగా రాకేష్ బేడీ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆర్. మాధవన్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువైనా, ఉన్నంతలో తన ముద్ర వేశారు. సారా అర్జున్ తన పరిధి మేరకు ఆకట్టుకుంది. ఆదిత్య ధర్ టేకింగ్, రైటింగ్‌ అదిరిపోయింది.

ఫైనల్‌గా చెప్పాలంటే

ఫైనల్‌గా చెప్పాలంటే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ మొదటి భాగం కంటే ఎక్కువగా మెప్పించే సినిమా ఇది. ఇండియన్ స్పై యాక్షన్ థ్రిల్లర్స్‌లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసే ధురంధర్ ది రివేంజ్‌ను కచ్చితంగా చూడొచ్చు.

రేటింగ్: 3.5/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More