Dhurandhar 2 Twitter Review: ధురంధర్ 2 ట్విటర్ రివ్యూ- రణ్‌వీర్ సింగ్ నట విధ్వంసం, ఆదిత్య ధర్ టేకింగ్ వావ్-కానీ ఆ రెండే!
Dhurandhar 2 Twitter Review In Telugu: భారీ అంచనాల మధ్య విడుదలైన 'ధురంధర్: ది రివెంజ్' థియేటర్లలో నేటి నుంచి సందడి చేస్తోంది. రణ్‌వీర్ సింగ్ నటన, ఆదిత్య ధర్ మేకింగ్ స్టైల్‌కు ప్రశంసలు దక్కుతున్నప్పటికీ, దాదాపు నాలుగు గంటల నిడివి, సినిమాలోని రాజకీయ అంశాలపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందన వస్తోంది.
నెలల తరబడి సాగిన నిరీక్షణ, సోషల్ మీడియాలో భారీ హైప్.. వీటన్నింటి మధ్య ఆదిత్య ధర్ ప్రతిష్టాత్మక స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar 2) మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బుధవారం (మార్చి 18) సాయంత్రం నుంచే వందలాది ప్రివ్యూ షోలు పడటంతో, అర్ధరాత్రి కల్లా సోషల్ మీడియా వేదికగా రివ్యూలు వెల్లువెత్తాయి.

ట్విట్టర్ టాక్: 'ఇండియన్ సినిమా హిస్టరీలోనే బెస్ట్?'
భారీ అంచనాలను అందుకోవడం ఏ సినిమాకైనా కత్తిమీద సామే.. కానీ, ‘ధురంధర్ 2’ ఆ అంచనాలను వందశాతం అందుకుందని పలు రివ్యూవర్లు చెబుతున్నారు. అలాగే, ప్రివ్యూ షోలు చూసిన ప్రేక్షకులు, విమర్శకులు ధురంధర్ 2 సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఇంటర్వెల్‌కే మైండ్ బ్లాక్
కొందరైతే ఏకంగా ఇది ‘భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యుత్తమ చిత్రం’ అని అభివర్ణిస్తున్నారు. "ఇంటర్వెల్‌కే మైండ్ బ్లాక్ అయిపోయింది. మేకింగ్, మ్యూజిక్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. కథ చాలా సహజంగా, ఇంటెన్స్‌గా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్ మీద అంచనాలు పెంచేసింది. నిడివి ఒక్కటే కొంచెం ఇబ్బందిగా ఉంది" అని ఒక యూజర్ ట్వీట్ చేశారు.
10కి 9.8 రేటింగ్
ఈ సినిమాకు 10కి 9.8 రేటింగ్ ఇస్తూ.. "సినిమా కొంచెం నెమ్మదిగా మొదలైనప్పటికీ, యాక్షన్, పాలిటిక్స్ అదిరిపోయాయి. ఆదిత్య ధర్ దర్శకత్వం అద్భుతం" అని మరికొందరు కొనియాడారు.
నాలుగు గంటల నిడివి.. సహనానికి పరీక్షా?
ఈ సీక్వెల్ రన్‌టైమ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపు 3 గంటల 55 నిమిషాల నిడివితో వచ్చిన ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. "సినిమా చాలా సాగదీసినట్లు ఉంది, కొన్ని చోట్ల స్లో మోషన్ షాట్స్ మరీ ఎక్కువయ్యాయి" అని కొందరు పెదవి విరుస్తుంటే.. "4 గంటలైనా ఎక్కడా బోర్ కొట్టలేదు, స్క్రీన్‌ప్లే అంతలా కట్టిపడేసింది" అని మరికొందరు సమర్థిస్తున్నారు.
రణ్‌వీర్ సింగ్ వన్ మ్యాన్ షో..
ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ నటన పీక్స్‌లో ఉందన్నది మెజారిటీ ప్రేక్షకుల మాట. సీనియర్ హీరోయిన్ ప్రీతి జింటా కూడా రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్‌లపై ప్రశంసలు కురిపించారు.
ముగ్ధురాలైన ప్రీతి జింటా!
"@AdityaDharFilms.. మీ మేకింగ్‌కు నేను ఫ్యాన్ అయిపోయాను. ఇంతటి అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చినందుకు థాంక్యూ. రణ్‌వీర్.. నీ నటన చూసి నా మనసు నిండిపోయింది. ఆ లోతు, ఆ సిన్సియారిటీ మరే నటుడిలోనూ ఉండవు" అని ప్రీతి జింటా పేర్కొన్నారు. రణ్‌వీర్ సింగ్‌కు కచ్చితంగా నేషనల్ అవార్డు రావాల్సిందేనని అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
రాజకీయాలు.. ప్రొపగండా విమర్శలు
అయితే, ధురంధర్ 2 సినిమాలోని రాజకీయ నేపథ్యం ఒక వర్గం ప్రేక్షకులకు రుచించడం లేదు. ఇది ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా తీసిన 'ప్రొపగండా' చిత్రమని కొందరు విమర్శిస్తున్నారు.
బలవంతంగా చొప్పించిన అజెండా
"ఇది సినిమాలా లేదు, ప్రభుత్వ ప్రచార చిత్రంలా ఉంది. పాత్రల కంటే నినాదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. లోతు లేని కథ, బలవంతంగా చొప్పించిన అజెండా వల్ల సినిమా విసిగిస్తోంది" అని ఒక నెటిజన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ధురంధర్ 2 విశేషాలు
కాగా 2025లో బ్లాక్ బస్టర్ అయిన 'ధురంధర్'కు ఇది ముగింపు భాగం. రణ్‌వీర్ సింగ్‌తో పాటు ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, రాకేష్ బేడీ, సారా అర్జున్ వంటి నటీనటులు యాక్ట్ చేశారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ 'రివెంజ్' యాక్షన్ థ్రిల్లర్ ఎలాంటి వసూళ్లు రాబడుతుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


