Preity Zinta: 18.50 కోట్లకు లగ్జరీ అపార్ట్‌మెంట్ అమ్మేసిన ప్రీతి జింటా- 4 నెలలో ఇది రెండోసారి- ఆ 100 కోట్ల ఇంటి కోసమేనా?

Preity Zinta Sells Bandra Apartment For 18.50 Cr: బాలీవుడ్ డింపుల్ గర్ల్ ప్రీతీ జింటా ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా పాలి హిల్ ప్రాంతంలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌ను రూ.18.50 కోట్లకు విక్రయించారు. గత నాలుగు నెలల్లోనే ప్రీతి జింటా చేసిన రెండో భారీ రియల్ ఎస్టేట్ లావాదేవీ ఇది కావడం విశేషం.

Published on: Mar 7, 2026, 06:08:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ జట్టు యజమాని ప్రీతీ జింటా ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరోసారి వార్తల్లో నిలిచారు. బాంద్రాలోని అత్యంత సంపన్న ప్రాంతమైన పాలి హిల్‌లో తనకున్న విలాసవంతమైన (లగ్జరీ) అపార్ట్‌మెంట్‌ను ప్రీతి జింటా రూ. 18.50 కోట్లకు విక్రయించినట్లు ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా వెల్లడైంది.

18.50 కోట్లకు లగ్జరీ అపార్ట్‌మెంట్ అమ్మేసిన ప్రీతి జింటా- 4 నెలలో ఇది రెండోసారి- ఆ 100 కోట్ల ఇంటి కోసమేనా? (HT Files)
18.50 కోట్లకు లగ్జరీ అపార్ట్‌మెంట్ అమ్మేసిన ప్రీతి జింటా- 4 నెలలో ఇది రెండోసారి- ఆ 100 కోట్ల ఇంటి కోసమేనా? (HT Files)

నాలుగు నెలల్లో రెండో విక్రయం

ప్రీతీ జింటా గత నాలుగు నెలల కాలంలో అపార్ట్‌మెంట్‌ను విక్రయించడం ఇది రెండోసారి. గతేడాది నవంబర్‌లో ఇదే 'రుస్తోమ్‌జీ పరిశ్రమ్' భవనంలోని 11వ అంతస్తులో ఉన్న 1,474 చదరపు అడుగుల ఫ్లాట్‌ను ప్రీతి జింటా రూ. 14 కోట్ల కంటే ఎక్కువ ధరకు విక్రయించారు.

రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లు

తాజాగా మార్చి 2, 2026న రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ల ప్రకారం.. అదే భవనం, అదే అంతస్తులో ఉన్న మరో 1,770 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను తాజాగా ప్రీతి జింటా అమ్మేశారు.

భారతీయ సంతతికి చెందిన

భారతీయ సంతతికి చెందిన అమెరికన్ పౌరులు ప్రియా నగర్, రాజీవ్ నగర్ ఈ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. ఈ డీల్ కోసం సుమారు రూ. 1.11 కోట్ల స్టాంప్ డ్యూటీతో పాటు రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు సమాచారం.

రూ. 100 కోట్ల కొత్త ఇంటి కోసమేనా?

ప్రీతీ జింటా వరుసగా తన ఆస్తులను విక్రయించడం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బాంద్రా ప్రాంతంలోనే దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఒక భారీ ప్రాపర్టీని కొనుగోలు చేసేందుకు ప్రీతి జింటా సిద్ధమవుతున్నారని, గత విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును అందులో పెట్టుబడిగా పెట్టనున్నారని సమాచారం.

భవనం పునర్నిర్మాణం తర్వాత

ఈ అపార్ట్‌మెంట్‌ను 2023లో జరిగిన రీడెవలప్‌మెంట్ ఒప్పందంలో భాగంగా బిల్డర్ (రుస్తోమ్‌జీ/కీస్టోన్ రియల్టర్స్) ప్రీతి జింటాకు కేటాయించారు. అక్టోబర్ 23, 2023న కుదిరిన ఒప్పందం ప్రకారం పాత భవనం పునర్నిర్మాణం తర్వాత ఆమెకు ఈ ఫ్లాట్ దక్కింది. ఈ వ్యవహారంపై ప్రీతీ జింటా నుంచి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.

బాలీవుడ్ తారల రియల్ ఎస్టేట్ హవా

కేవలం ప్రీతీ జింటా మాత్రమే కాదు, ఇటీవల కాలంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు కూడా భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ డీల్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

100 కోట్ల విలువైన ఆస్తులు

2025లో అక్షయ్ కుమార్ తన వివిధ ఆస్తులను విక్రయించడం ద్వారా రూ. 100 కోట్లకు పైగా ఆర్జించగా, అమితాబ్ బచ్చన్ కూడా దాదాపు రూ. 100 కోట్ల విలువైన ప్రాపర్టీలను విక్రయించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. తాజాగా జీతేంద్ర, ఏక్తా కపూర్ కూడా ముంబైలోని తమ అపార్ట్‌మెంట్‌ను రూ. 12.25 కోట్లకు అమ్మేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More