Dhurandhar 2 1000 Cr: ధురంధర్ 2కి 1000 కోట్లు వస్తే అందులో సగం అతని వల్లే.. రణ్‌వీర్ సింగ్ అన్న మాటలు చెప్పిన విలన్!

Rakesh Bedi Reveals Ranveer Singh On Dhurandhar 2 1000 Cr: రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేందుకు రెడీ అయింది. ధురంధర్ 2లో కరాచీ రాజకీయ నాయకుడు ‘జమాలి’గా నటించిన సీనియర్ నటుడు రాకేష్ బేడీ నటనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Published on: Mar 19, 2026, 11:10:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రస్తుతం సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా ‘ధురంధర్ 2’ మాటే వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సీక్వెల్‌లో రణ్‌వీర్ సింగ్ తన యాక్షన్‌తో అదరగొడుతుంటే, సీనియర్ నటుడు రాకేష్ బేడీ తన నెగటివ్ షేడ్ ఉన్న పాత్రతో సినిమాకే హైలైట్‌గా నిలిచారు. కరాచీకి చెందిన కుట్రలు, కుతంత్రాలు పన్నే రాజకీయ నాయకుడు ‘జమాలి’ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి.

ధురంధర్ 2కి 1000 కోట్లు వస్తే అందులో సగం అతని వల్లే.. రణ్‌వీర్ సింగ్ అన్న మాటలు చెప్పిన విలన్!
ధురంధర్ 2కి 1000 కోట్లు వస్తే అందులో సగం అతని వల్లే.. రణ్‌వీర్ సింగ్ అన్న మాటలు చెప్పిన విలన్!

రణ్‌వీర్ సింగ్ ఎమోషనల్ కామెంట్స్

ఇటీవల ‘ఇండియా పాడ్‌కాస్ట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ బేడీ షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా చివరి రోజున రణ్‌వీర్ సింగ్ మైక్ తీసుకుని యూనిట్ అందరి ముందు తన గురించి చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేసుకున్నారు.

రాకేష్ జీ వల్లే వస్తాయి

"ఈ సినిమా ఒకవేళ వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తే.. అందులో రూ. 500 కోట్లు కేవలం రాకేష్ జీ వల్లే వస్తాయి" అని రణ్‌వీర్ సింగ్ అన్నట్లు రాకేష్ బేడీ తెలిపారు. అంత పెద్ద మాట అనొద్దని తాను వారించినా, రణ్‌వీర్ మాత్రం అది తన మనసులో మాట అని గట్టిగా చెప్పారని రాకేష్ బేడీ వివరించారు.

డైరెక్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు!

కేవలం హీరో మాత్రమే కాదు, దర్శకుడు ఆదిత్య ధర్ కూడా రాకేష్ బేడీ నటనకు ఫిదా అయ్యారట. "ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కు ఇంతకంటే పెద్ద గౌరవం ఇంకేముంటుంది? షూటింగ్ చివరి రోజున ఆదిత్య నా భుజంపై చేయి వేసి.. 'సర్, ఈరోజు మీ షూటింగ్ పూర్తవుతుంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయి, మిమ్మల్ని చాలా మిస్ అవుతాను' అని చెప్పారు. సెట్‌లో అంతటి ఆత్మీయ వాతావరణం ఉండబట్టే సినిమా ఇంత బాగా వచ్చింది" అని రాకేష్ బేడీ ఆనందం వ్యక్తం చేశారు.

బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట

కాగా మొదటి భాగం ‘ధురంధర్’ భారతదేశంలో రూ. 838.5 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 1303.35 కోట్లు వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు రెండో భాగం ధురంధర్ 2 అంతకు మించిన వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

శిక్షణ కాలం నాటి కథ

ధురంధర్ ది రివేంజ్ మూవీలో రణ్‌వీర్ సింగ్ ‘హంజా అలీ మజారీ’గా ఎలా మారారు అనే శిక్షణ కాలం నాటి కథను చూపించబోతున్నారు. అర్జున్ రాంపాల్, రణ్‌వీర్ సింగ్‌ల మధ్య సాగే పోరాట దృశ్యాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ వంటి స్టార్స్ కూడా యాక్ట్ చేసిన విషయం తెలిసిందే.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More