Dhurandhar 2 Collections: 'ధురంధర్ 2' బాక్సాఫీస్ విధ్వంసం..ఫస్ట్ డే కలెక్షన్ల మోత.. ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 రికార్డులు ఔట్!

Dhurandhar 2 Collections: భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ధురంధర్ 2 మూవీ ఫస్ట్ డేనే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రికార్డు కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఓపెనింగ్ కలెక్షన్లతో సునామీ సృష్టించింది.

Published on: Mar 20, 2026, 05:40:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ర‌ణ్‌వీర్ సింగ్‌, ఆదిత్య ధర్ కాంబోలో వచ్చిన మోస్ట్ అవేటెడ్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద ఊహకందని రీతిలో ల్యాండ్ అయ్యింది. బుధవారం సాయంత్రం వేసిన ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమా తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. ఇక ఫస్ట్ డే కలెక్షన్లలో కొత్త రికార్డు నమోదు చేసింది. ఫస్ట్ బాలీవుడ్ మూవీగా నిలిచింది.

ధురంధర్ 2లో ర‌ణ్‌వీర్ సింగ్‌
ధురంధర్ 2లో ర‌ణ్‌వీర్ సింగ్‌

ధురంధర్ 2 కలెక్షన్లు

ధురంధర్ 2 మూవీ ప్రీమియర్ షోల ద్వారానే ఇండియాలో రూ.43 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు సక్నిల్క్ తెలిపింది. ప్రీమియర్ షో ద్వారా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ మూవీగా ఇది నిలిచింది. ఇక గురువారం (మార్చి 19) ఫస్ట్ డే ఉదయం నుంచే థియేటర్ల దగ్గర జాతర మొదలైంది.

ఫస్ట్ మూవీ

ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ ప్రకారం ధురంధర్ 2 ఫస్ట్ డే ముగిసే సరికి ఇండియాలోనే రూ.146 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఫస్ట్ డేనే నెట్ కలెక్షన్లలో రూ.100 కోట్లు దాటిన మొదటి హిందీ సినిమాగా ధురంధర్ 2 నిలిచింది. కేవలం హిందీ నుంచే ఈ సినిమాకు రూ.103 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి.

ఈ సినిమాలను దాటి

షారుఖ్ ఖాన్ 'జవాన్' (రూ.75 కోట్లు), 'పఠాన్' (రూ.57 కోట్లు), రణబీర్ కపూర్ 'యానిమల్' (రూ.64 కోట్లు) వంటి బిగ్గెస్ట్ ఓపెనర్స్ అన్నీ ధురంధర్ 2 ధాటికి గల్లంతయ్యాయి. ఇక ఆల్ ఇండియా లెవల్లో చూస్తే బాహుబలి 2 (రూ.121 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.133 కోట్లు) రికార్డులను సైతం ధురంధర్ 2 దాటేసింది. అన్ని భాషల్లో కలిపి చూస్తే పుష్ప 2 (రూ.164 కోట్లు) తర్వాత దేశంలోనే రెండవ అతిపెద్ద ఓపెనింగ్‌ రికార్డును ధురంధర్ 2 అందుకుంది.

డబ్బింగ్ వెర్షన్ల హవా

హిందీతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం దుమ్ము రేపుతోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ రూ.2 కోట్లకు పైగా వసూళ్లతో సౌత్ మార్కెట్‌లో తన పట్టు నిరూపించుకుంది. తమిళ వెర్షన్ కూడా అదరగొడుతోంది. ఆయా భాషల్లో రెగ్యులర్ షోలకి విపరీతమైన రష్ కనిపిస్తోంది.

మేకింగ్ అద్భుతం

ఆదిత్య ధర్ దర్శకత్వ ప్రతిభకు, ర‌ణ్‌వీర్ సింగ్‌ ఎనర్జీ తోడవడంతో ఈ స్పై డ్రామా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు ఉండటం సినిమాకు పెద్ద అసెట్ అయ్యింది. మొదటి పార్ట్ రూ.1300 కోట్లు వసూలు చేస్తే, ఈ సీక్వెల్ అంతకు మించిన మైలురాయిని కేవలం కొద్ది రోజుల్లోనే అందుకునేలా కనిపిస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More