Dhurandhar 2: రణ్‌వీర్ వర్సెస్ రణ్‌బీర్- యానిమల్ రికార్డులు బద్దలు కొట్టేలా ధురంధర్ 2- బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ మంటలు

Dhurandhar 2: అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో ధురంధర్ 2 దూసుకెళ్తోంది. ప్రీమియర్ షో టికెట్ సేల్స్ లో సత్తాచాటుతోంది. అమెరికాలో జోరు మరింత ఎక్కువగా ఉంది. మరి ఈ మూవీ యానిమల్ సినిమా రికార్డును బ్రేక్ చేస్తుందా? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. 

Mar 11, 2026, 10:44:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రికార్డుల వేటకు ధురంధర్ 2 రెడీ అయింది. బాక్సాఫీస్ ను బద్దలు కొట్టేందుకు సై అంటోంది. అడ్వాన్స్ టికెట్ సేల్స్ లో ధురంధర్ 2 హిస్టరీ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ర‌ణ్‌వీర్ సింగ్‌ హీరోగా నటించిన ధురంధర్ 2 ప్రీమియర్ షో టికెట్ సేల్స్ లో దూసుకెళ్తోంది.

ర‌ణ్‌వీర్ సింగ్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్‌
ర‌ణ్‌వీర్ సింగ్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్‌

ధురంధర్ 2

ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ధురంధర్ 2 ఒకటి. బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 19న రిలీజ్ కానుంది. అంతకంటే ఒక రోజు ముందు మార్చి 18న ధురంధర్ 2 మూవీ ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఈ ప్రీమియర్ షోల టికెట్ సేల్స్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి.

ఇండియాలో ఇలా

గత వారం ధురంధర్ 2 మూవీ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు దేశవ్యాప్తంగా 8,337 షోలకు గాను 3.48 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ చిత్రం ఇప్పటివరకు దాని ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్ నుండి ఇండియాలో రూ.18.64 కోట్లు వసూలు చేసిందని సక్నిల్క్ పేర్కొంది.

తెలుగు కలెక్షన్లు

ట్రేడ్ అనలిస్ట్ సక్నిల్క్ ప్రకారం ఇండియాలో ధురంధర్ 2 ప్రీమియర్ షోలకు హిందీ డాల్బీ సినిమా ఫార్మాట్ 203 టికెట్ల నుంచి రూ.1.57 లక్షలు వచ్చాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.

తమిళంలో 15,385 టికెట్ల నుంచి రూ .23.58 లక్షలు, తెలుగులో 7,827 టికెట్ల నుంచి రూ.18.54 లక్షలు, కన్నడలో వెర్షన్ 479 టికెట్ల నుంచి రూ.2.04 లక్షలు, మలయాళంలో 934 టికెట్ల నుంచి రూ.2.25 లక్షలు ఇప్పటికే ప్రీమియర్ షోల నుంచి ఖాతాలో వేసుకుంది.

ఓవర్సీస్

ఓవర్సీస్ లోనూ అడ్వాన్స్ టికెట్ సేల్స్ లో ధురంధర్ 2 అదరగొడుతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉత్తర అమెరికాలోనే అడ్వాన్స్ బుకింగ్స్ లో 1 మిలియన్ డాలర్లు దాటిందని సక్నిల్క్ తెలిపింది. ఈ మూవీ 2 మిలియన్ డాలర్లకు దగ్గరగా ఉందని పేర్కొంది.

యానిమల్ రికార్డు

ఓవర్సీస్ లో ప్రీమియర్ సేల్స్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ సినిమాగా యానిమల్ రికార్డు ఉంది. ఇది 1.2 మిలియన్ డాలర్లు ఖాతాలో వేసుకుంది. ఇప్పుడీ రికార్డును ధురంధర్ 2 క్రాస్ చేసే అవకాశముంది. ఇది ర‌ణ్‌వీర్ సింగ్‌ వర్సెస్ ర‌ణ్‌బీర్ క‌పూర్‌ పోరుగా మారిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More