Dhurandhar 2 VS Toxic: ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్.. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆ సినిమాదే జోరు.. ఓ లుక్కేయండి

Dhurandhar 2 VS Toxic: బాక్సాఫీస్ దగ్గర రెండు భారీ సినిమాల ఫైట్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ నెలలోనే ర‌ణ్‌వీర్ సింగ్‌ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ ధురంధర్ 2,  యశ్ గ్యాంగ్ స్టర్ డ్రామా  టాక్సిక్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ కానున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఏ మూవీ డామినెన్స్ ఉందో ఓ సారి లుక్కేయండి. 

Published on: Mar 2, 2026, 13:32:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాక్సాఫీస్ దగ్గర భారీ ఫైట్ కు టైమ్ దగ్గరపడుతోంది. మార్చి నెలలో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ కాబోతుంది. రెండు భారీ ప్రాజెక్టులు ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. ర‌ణ్‌వీర్ సింగ్‌ నటించిన ధురంధర్ 2, యశ్ మూవీ టాక్సిక్ బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టబోతున్నాయి. మార్చి 19, 2026న ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్
ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్

ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్

మార్చి నెల వచ్చేసింది. ఇప్పుడు ఇండియన్ మూవీ లవర్స్, బాక్సాఫీస్ ఎక్స్ పర్ట్స్ ఫోకస్ మొత్తం ధురంధర్ 2, టాక్సిక్ పైనే ఉన్నాయి. ఈ సినిమా మార్చి 19న పాన్ ఇండియానే కాదు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఇది మెగా క్లాష్ కానుంది. ఇప్పుడు ఈ సినిమాల మధ్య పోరే హాట్ టాపిక్ గా మారింది.

అడ్వాన్స్ బుకింగ్స్

ధురంధర్ 2, టాక్సిక్ సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ అమెరికాలో స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమాల ప్రీమియర్ల టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత ట్రెండ్ చూస్తే టాక్సిక్ కంటే ధురంధర్ 2 టికెట్ల సేల్స్ లో దూసుకుపోతోంది. సక్నిల్క్ వెబ్ సైట్ ప్రకారం యుఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ లో ధురంధర్ ఇప్పటివరకు 33,723 అమెరికా డాలర్లు సంపాదించింది. 151 థియేటర్లలో 209 షోలను వేయబోతున్నారు. ఇందులో ఇప్పటికే 1953 టికెట్లు అమ్ముడయ్యాయి.

ఇక టాక్సిక్ విషయానికి వస్తే ఈ మూవీ ప్రస్తుతానికి 81 థియేటర్లలో 122 షోలలో రిలీజ్ అయేందుకు రెడీ అయింది. దీని టికెట్లు కేవలం 189 మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ సినిమా 3,665 అమెరికా డాలర్లు ఖాతాలో వేసుకుంది.

ధురంధర్ 2 గురించి

బ్లాక్ బస్టర్ ధురంధర్ మూవీకి సీక్వెల్ గా ధురంధర్ 2 రాబోతుంది. డిసెంబర్ 5, 2025న రిలీజైన ధురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇందులో ర‌ణ్‌వీర్ సింగ్‌, సారా అర్జున్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్.మాధవన్ తదితరులు నటించారు. దీనికి ఆదిత్య ధర్ డైరెక్టర్.

టాక్సిక్ గురించి

కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ సినిమాల తర్వాత యశ్ నటించిన సినిమా టాక్సిక్. దీనికి లేడీ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహించింది. ఇదో గ్యాంగ్ స్టర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో కియారా అద్వాణీ, నయన తార, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితర హీరోయన్లు నటించారు. ఈ మూవీ గ్లింప్స్, టీజర్ ఇప్పటికే కాంట్రవర్సీ క్రియేట్ చేశాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More