మరి వయోలెంట్‌గా టాక్సిక్ టీజర్- యశ్‌కు స్ట్రాంగ్ విలన్‌గా మలయాళ స్టార్ హీరో- బ్రూటల్‌గా యాక్షన్ సీన్స్, బోల్డ్‌గా కూడా!
Toxic Teaser Release: ‘కేజీఎఫ్’ తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ టీజర్ విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్ టీజర్‌ను ఇవాళ విడుదల చేశారు. బ్రూటల్ వయోలెన్స్, అదిరిపోయే యాక్షన్‌తో టాక్సిక్ టీజర్ నిండిపోయింది.
చాలా కాలంగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న రాకింగ్ స్టార్ యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ (Toxic) అప్‌డేట్ వచ్చేసింది. శుక్రవారం (ఫిబ్రవరి 20) ఉదయం మేకర్స్ టాక్సిక్ టీజర్‌ను విడుదల చేశారు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, దీనిపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇప్పుడు టీజర్ చూస్తుంటే, ఆ అంచనాలను యశ్ వంద శాతం అందుకుంటాడనిపిస్తోంది.

టీజర్‌లో రాకింగ్ స్టార్ వైల్డ్ అవతార్
టాక్సిక్ టీజర్ ప్రారంభంలోనే యశ్ పోషిస్తున్న ‘రాయ’ పాత్రతో ఈ సారి యుద్ధం వేరు, వాళ్ల కుతంత్రాలు వేరు, అందరిదో విరోధం పెట్టుకుని బతకలేవు, పట్టుదల వదిలేయ్, గివప్ రాయా, ఇట్స్ ఓవర్ అని ఎవరో హెచ్చరిస్తారు.
ఆ తర్వాత మొదలయ్యే యాక్షన్ సీక్వెన్స్ మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి. అంతేకాకుండా "నేను ఓవర్ అన్నప్పుడే అది ఓవర్. అప్పటివరకు నాకు కొంచెం మ్యానర్స్ ఉన్నాయి" అంటూ యశ్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. తర్వాత వచ్చే సీన్స్ చాలా బ్రూటల్‌గా, మరి వయోలెంట్‌గా ఉన్నాయి.
బ్రూటల్ యాక్షన్ సీన్స్
విజువల్స్ చాలా గ్రాండ్‌గా, యాక్షన్ సీన్లు బ్రూటల్ గా ఉన్నాయి. శత్రువుల తలలు నరకడం, చేతులు విరగ్గొట్టడం వంటి సీన్లతో యశ్ తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా టీజర్ చివర్‌లో మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ విలన్ పాత్రలో ఎంట్రీ ఇచ్చి, యశ్‌కు సవాల్ విసరడం హైలైట్‌గా నిలిచింది.
యశ్ పాత్రకు తగ్గాఫర్ విలన్‌గా టొవినో థామస్‌ను చూపించిన విధానం అదిరిపోయింది. ఒక ఆర్మీని అత్యంత కిరాకతంగా మట్టుపెడుతూ విలన్ పాత్ర టొవినో థామస్‌ను చూపించారు. అది టీజర్ చివరిలో హైలెట్‌గా నిలిచింది. అలాగే, ఈ టీజర్‌లో కూడా బెడ్ సీన్స్ బోల్డ్‌గా చూపించారు.
వివాదాలు.. విమర్శలు
ఇలా టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేసేలా ఉంది. ఇక ఇదిలా ఉంటే, ఇదివరకు జనవరి 8న యశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టాక్సిక్ మొదటి వీడియోపై కొంత వివాదం నడిచిన విషయం తెలిసిందే.
స్మశానం నేపథ్యంలో చిత్రీకరించిన కొన్ని సీన్లపై మహిళా కమిషన్, కొన్ని క్రైస్తవ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అయితే, అనురాగ్ కశ్యప్ వంటి దర్శకులు ఈ వీడియోకు మద్దతు తెలపడం విశేషం.
రణ్‌వీర్ సింగ్‌తో భారీ పోటీ!
తాజాగా విడుదలైన టాక్సిక్ టీజర్‌లో కూడా బోల్డ్ సీన్లు, యాక్షన్ డోస్ ఎక్కువగా ఉండటంతో ఫ్యాన్స్ "రాకీ భాయ్ ఈజ్ బ్యాక్" అంటూ రచ్చ చేస్తున్నారు. కాగా, టాక్సిక్ సినిమా మార్చి 19న కన్నడ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇదే రోజున బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) కూడా రిలీజ్ కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెను యుద్ధం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. యశ్ క్రేజ్ చూస్తుంటే బాలీవుడ్ చిత్రానికి గట్టి పోటీ ఎదురయ్యేలా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












