Dhurandhar 2 BO: 5 రోజులు, 829 కోట్లు- బాక్సాఫీస్ వద్ద ధురంధర్ 2 అరాచకం-షారుఖ్, యశ్, రాజమౌళి సినిమాల రికార్డ్స్ బద్దలు!

Dhurandhar 2 Box Office Collection Day 5: రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్ల మార్కును దాటేసి అత్యంత వేగంగా వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో చేరిపోయింది ధురంధర్ ది రివేంజ్.

Published on: Mar 24, 2026, 06:17:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ గూఢచారిగా నటించిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. వీకెండ్ ముగిసిన తర్వాత సోమవారం (మార్చి 23) సాధారణంగా వసూళ్లలో తగ్గుదల కనిపించడం సహజం.

5 రోజులు, 829 కోట్లు- బాక్సాఫీస్ వద్ద ధురంధర్ 2 అరాచకం-షారుఖ్, యశ్, రాజమౌళి సినిమాల రికార్డ్స్ బద్దలు!
5 రోజులు, 829 కోట్లు- బాక్సాఫీస్ వద్ద ధురంధర్ 2 అరాచకం-షారుఖ్, యశ్, రాజమౌళి సినిమాల రికార్డ్స్ బద్దలు!

అయితే, ధురంధర్ 2 మాత్రం ఆ ప్రభావాన్ని తట్టుకుని నిలబడటమే కాకుండా, సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తోంది. ఐదు రోజులు ముగిసేసరికి ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 829.76 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

ఐదో రోజు వసూళ్ల వివరాలు

విడుదలైన ఐదో రోజు (మొదటి సోమవారం) ధురంధర్ 2 చిత్రం ఇండియాలో రూ. 65 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ఆదివారం (మార్చి 22) నాటి రూ. 114.85 కోట్లతో పోలిస్తే ఇది 43.4 శాతం తగ్గుదల అయినప్పటికీ, వర్కింగ్ డే కావడంతో ఈ వసూళ్లు అత్యంత భారీగా పరిగణించవచ్చు.

దేశవ్యాప్తంగా 20,382 షోల ద్వారా ఈ స్థాయి వసూళ్లు రావడం విశేషం. దీనితో కలిపి ఇప్పటివరకు ఐదు రోజుల్లో భారత్‌లో మొత్తం నెట్ కలెక్షన్స్ రూ. 519.12 కోట్లకు (గ్రాస్ రూ. 619.76 కోట్లు) చేరుకున్నాయి.

అంతర్జాతీయ వేదికపై 'ధురంధర్' సత్తా

కేవలం దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటివరకు ఈ చిత్రం రూ. 210 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. వెరసి ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు రూ. 829.76 కోట్లు దాటాయి. ఈ దూకుడుతో షారుఖ్ పఠాన్, జవాన్, యశ్ కేజీఎఫ్: చాప్టర్ 2, రాజమౌళి ఆర్ఆర్ఆర్ వంటి భారీ పాన్-ఇండియా చిత్రాల ఓపెనింగ్ కలెక్షన్స్ రికార్డులను కూడా ‘ధురంధర్ 2’ వెనక్కి నెట్టడం గమనార్హం.

వారాంతం గణాంకాలు ఒకసారి చూస్తే..

శనివారం (3వ రోజు): రూ. 135.15 కోట్ల గ్రాస్ (థియేటర్ల ఆక్యుపెన్సీ 81.6%)

ఆదివారం (4వ రోజు): రూ. 137.43 కోట్ల గ్రాస్ (థియేటర్ల ఆక్యుపెన్సీ 79.7%)

సోమవారం (5వ రోజు): రూ. 77.79 కోట్ల గ్రాస్ (థియేటర్ల ఆక్యుపెన్సీ 43.1%)

కథా నేపథ్యం

ఇదిలా ఉంటే, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 చిత్రం కరాచీలోని నేర సామ్రాజ్యం, రాజకీయ వ్యవస్థలోకి చొచ్చుకుపోయే భారతీయ గూఢచారి సాహసాల చుట్టూ తిరుగుతుంది. 26/11 దాడుల అనంతర పరిణామాలు, పొంచి ఉన్న ముప్పులను ఎదుర్కోవడంలో హీరో జరిపిన పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.

ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తోపాటు అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి హేమాహేమీలు ఉండటం ధురంధర్ 2కి అదనపు బలాన్ని ఇచ్చింది. ఇక ప్రస్తుత దూకుడు చూస్తుంటే, మరికొద్ది రోజుల్లోనే ధురంధర్ 2 చిత్రం రూ. 1000 కోట్ల మార్కును కూడా సునాయాసంగా దాటేలా కనిపిస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More