Dhurandhar 2: ప్రపంచంలోనే #2 సినిమాగా ధురంధర్ 2 రికార్డ్- ఆ భారీ చిత్రాలను వెనక్కి నెట్టి మరి- తొలి స్థానంలో ఏదంటే?
Dhurandhar 2 Is #2 Movie In World: ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధరంధర్ 2' భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డులు సృష్టిస్తోంది. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కలెక్షన్స్ విషయంలో ప్రపంచంలోనే రెండో సినిమాగా రికార్డ్ కొట్టింది. తొలి స్థానంలో ఏది ఉందంటే?
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ధరంధర్ 2’ నామస్మరణే వినిపిస్తోంది. రణ్‌వీర్ సింగ్ గూఢచారిగా నటించిన ధురంధర్ ది రివేంజ్ విడుదలైన మొదటి వారాంతంలోనే బాలీవుడ్ చరిత్రలో ఏ సినిమాకూ సాధ్యం కాని రీతిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కూడా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా నిలబడి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది.

విదేశాల్లోనూ రికార్డుల వేట!
అంతర్జాతీయ మార్కెట్‌లో ‘ధురంధర్ 2’ ప్రభంజనం మామూలుగా లేదు. ఈ చిత్రం సుమారు 2.5 మిలియన్ డాలర్ల భారీ ఓపెనింగ్స్‌తో మొదలై, ప్రతిరోజూ విదేశాల్లో 4 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో కొన్ని ఉద్రిక్తతల కారణంగా విడుదల కాకపోయినప్పటికీ, మిగిలిన చోట్ల ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది.
ఓవర్సీస్ మార్కెట్‌లో కేవలం ఆదివారం (మార్చి 22) నాటికి 22 మిలియన్ డాలర్ల మైలురాయిని ధురంధర్ 2 చేరుకోవడం విశేషం. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో 9.6 మిలియన్ డాలర్ల వసూళ్లతో టాప్-3 స్థానంలో నిలిచి హాలీవుడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది ధురంధర్ ది రివేంజ్ మూవీ.
ప్రపంచంలోనే నంబర్ 2 సినిమాగా 'ధరంధర్ 2'
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధిస్తున్న చిత్రాల జాబితాలో ‘ధరంధర్ 2’ రెండో స్థానంలో నిలిచింది. మొదటి వారంలో వరల్డ్ వైడ్‌గా ధురంధర్ 2 సినిమాలు 80 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ శని, ఆది వారాల్లోనే దాదుపుగా 56 మిలియన్ డాలర్స్ వచ్చినట్లు సమాచారం.
80 మిలియన్ డాలర్లతో వరల్డ్‌లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా ధురంధర్ 2 రెండో స్థానంలో నిలిచింది. హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గోస్లింగ్ నటించిన 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' (వారంలో 140 డాలర్లు) తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ధురంధర్ 2 కావడం విశేషం.
భారీ హాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి
'హాప్పర్స్' (52 మిలియన్ డాలర్లు), రెడీ ఆర్ నాట్ 2 (12 మిలియన్ డాలర్లు) 'స్క్రీమ్ 7' (10.5 మిలియన్ డాలర్లు) వంటి భారీ హాలీవుడ్ చిత్రాలను సైతం రణ్‌వీర్ సింగ్ సినిమా వెనక్కి నెట్టేసింది. అతి త్వరలోనే ధురంధర్ 2 చిత్రం 100 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరి, ఈ ఏడాది గ్లోబల్‌గా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 సినిమాల్లో ఒకటిగా నిలవనుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దేశీయంగా 454 కోట్ల నెట్ కలెక్షన్స్!
అలాగే, భారతదేశంలో ధురంధర్ 2 సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం ఒక చరిత్ర అనే చెప్పాలి. మొదటి నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం దాదాపు రూ. 454 కోట్ల నెట్ (రూ. 542 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ సాధించింది. ఇందులో వరుసగా మూడు రోజుల పాటు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రావడం బాలీవుడ్ చరిత్రలోనే ఇదే మొదటిసారి.
ధురంధర్ 2 విశేషాలు
2025లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ‘ధరంధర్’ చిత్రానికి ధురంధరి ది రివేంజ్ సీక్వెల్ అని తెలిసిందే. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో రణ్‌వీర్ సింగ్ ఇండియన్ స్పైగా తన నట విశ్వరూపాన్ని చూపించారు.
రణ్‌వీర్‌తో పాటు ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బేడీ తమ నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ధురంధర్ 2 దూకుడు చూస్తుంటే మరిన్ని పాత రికార్డులు కనుమరుగవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


