Aditya Dhar: క్షణంలో రీల్స్ స్క్రోల్ చేసే యుగంలోనూ 7 గంటలు థియేటర్లలో కూర్చొబెట్టిన దర్శకుడు ఆదిత్య ధర్- ఎలా సాధ్యమైంది?
Aditya Dhar Dhurandhar 2: సెకన్లలోనే రీల్స్ స్క్రోల్ చేసే కాలంలో ఏడు గంటల పాటు ప్రేక్షకులను కుర్చీలకు హత్తుకుపోయేలా చేయడం సామాన్యం కాదు. దర్శకుడు ఆదిత్య ధర్ తన 'ధురంధర్' ద్వయంతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను సృష్టించారు. మరి ఇది అతనికి ఎలా సాధ్యమైందో ఓ అంచనా వేద్దాం.
ప్రస్తుతం చాలా మందిలో ఓపిక తగ్గిపోయింది. సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటే తప్పా పూర్తిగా వీక్షించడం లేదు. క్షణాల్లో రీల్స్ స్క్రోల్ చేసే యుగంలో ఉన్నాం. మనిషి ఏకాగ్రత (Attention span) కేవలం కొన్ని సెకన్లకే పరిమితమైపోతోందని వార్తలు వస్తున్న రోజులివి.

అసాధ్యమైనదాన్ని సుసాధ్యం చేసి
అలాంటిది రెండున్నర గంటల సినిమా చూడటమే ఒక పెద్ద పనిగా భావిస్తున్న ఈ కాలంలో దర్శకుడు ఆదిత్య ధర్ అసాధ్యమైనదాన్ని సుసాధ్యం చేసి చూపించారు. రెండు భాగాలుగా వచ్చిన తన ‘ధురంధర్’ చిత్రాలతో భారతీయులందరినీ ఏడు గంటల (ధురంధర్ నిడివి సుమారు 3 గంటలు, ధురంధర్ ది రివేంజ్ రన్‌టైమ్ దాదాపుగా 4 గంటలు) పాటు థియేటర్లలో కూర్చోబెట్టడమే కాకుండా, సినిమా అయిపోయాక కూడా "ఇంకా ఉంటే బాగుండు" అనిపించేలా చేశారు.
ఇది కేవలం బాక్సాఫీస్ విజయం మాత్రమే కాదు.. వాస్తవానికి, కల్పనకు మధ్య గీతను చెరిపేస్తూ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఒక అద్భుత సృజనాత్మక ప్రయాణం.
కల్పనలోనూ కనిపించే వాస్తవం
ఆదిత్య ధర్ తన సినిమాల్లో నిర్మించిన 'ప్రపంచం' (World-building) అత్యంత నమ్మశక్యంగా ఉంటుంది. 90వ దశకం చివర నుంచి భారత్ ఎదుర్కొన్న ఉగ్రవాద దాడులు, అంతర్జాతీయ రాజకీయాలు, గూఢచారి సంస్థల అంతర్గత పనితీరు.. వీటన్నింటినీ ఆయన అత్యంత లోతుగా పరిశోధించి వెండితెరపై ఆవిష్కరించారు.
కరాచీలోని ల్యారీ ముఠా గొడవలు కావచ్చు, ఐసీ-814 హైజాకింగ్ ప్రస్తావన కావచ్చు.. అన్నీ కూడా ఒక డాక్యుమెంటరీ చూస్తున్నంత సహజంగా ఉంటాయి. మన ఇంటిలిజెన్స్ వర్గాలకు తెలిసిన విషయాలన్నీ ఆదిత్యకు కూడా తెలుసా? అన్నంతగా ఆయన ఈ కథను మలిచారు.
చాప్టర్ల వారీగా సాగిన విశ్లేషణ
‘ధురంధర్’ను కేవలం సీక్వెల్‌గా కాకుండా, ఒక సుదీర్ఘ కథలోని అధ్యాయాల (Chapters) మాదిరిగా ఆదిత్య రూపొందించారు. మొదటి భాగం పాత్రలను, అక్కడి రాజకీయ సమీకరణాలను పరిచయం చేస్తే.. రెండో భాగం ‘ది రివెంజ్’ ఆ ప్రపంచంలోని భావోద్వేగాలను, ప్రతీకారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లింది. ప్రతి అధ్యాయం ముగింపులోనూ తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను రేకెత్తించడంలో ఆదిత్య ధర్ సఫలమయ్యారు.
భావోద్వేగాల మేళవింపు.. రణ్‌వీర్ విశ్వరూపం!
నేటి కాలంలో భారీ యాక్షన్ చిత్రాలు తీయడం అందరూ చేస్తున్నదే. కానీ, ఆ యాక్షన్‌కు భావోద్వేగాలను (Emotional grounding) జోడించడంలోనే ఆదిత్య ధర్ ప్రతిభ దాగుంది. ఈ విషయంలో రణ్‌వీర్ సింగ్‌ను ఎంచుకోవడం ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి.
మొదటి భాగంలో తన నటనలో ఎంతో నిగ్రహాన్ని ప్రదర్శించిన రణ్‌వీర్ రెండో భాగం ధురంధర్ 2లో మాత్రం విశ్వరూపం చూపించారు. మోసం, ద్రోహం, ప్రేమ, కోపం.. ఇలా అన్ని రకాల భావోద్వేగాలను పండించి ప్రేక్షకులను మెప్పించారు.
ప్రేక్షకుడి మేధస్సుకు గౌరవం
ఆదిత్య ధర్ ప్రేక్షకులకు ప్రతి విషయాన్ని విడమర్చి చెప్పరు. "ప్రేక్షకుడికి అంతా తెలుసు" అనే నమ్మకంతో ఆయన కథను ముందుకు తీసుకెళ్తారు. ప్రతి చిక్కుముడిని విప్పకుండా, కొన్నింటిని ప్రేక్షకుల చర్చకే వదిలేస్తారు. అందుకే ఈ సినిమా విడుదలయ్యాక నెలల తరబడి సోషల్ మీడియాలో దీనిపై విశ్లేషణలు సాగాయి.
హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గని సౌండ్, విజువల్స్, క్లైమాక్స్ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చాయి. పదిహేను సెకన్ల రీల్స్ చూసే ఈ తరానికి ఏడు గంటల పాటు సాగే సినిమాటిక్ అనుభవాన్ని అందించడమే ఆదిత్య ధర్ సాధించిన అసలైన విజయం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


