OTT Movies: ఓటీటీలోకి నిన్న రిలీజైన ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్- సీక్వెల్‌కు మారిన ప్లాట్‌ఫామ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Ustaad Bhagat Singh And Dhurandhar 2 OTT Platforms: ఓటీటీలోకి నిన్న ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన రెండు సినిమాలు పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రణ్‌వీర్ సింగ్ ధురంధర్ 2 స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ వివరాలు ఆసక్తిగా మారాయి. వీటిలో సీక్వెల్‌గా వచ్చిన ధురంధర్ 2 ఓటీటీ మారిపోయింది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Mar 20, 2026, 13:28:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉగాది (మార్చి 20)తో కొత్త తెలుగు సంవత్సరం మొదలైపోయింది. ఇదే న్యూ ఇయర్ రోజున అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో రెండు సినిమాలు భారీ అంచనాలతో థియేట్రికల్ రిలీజ్ అయ్యాయి. ఆ రెండు సినిమాలే ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ రెండు సినిమాలు నిన్న (మార్చి 20) థియేటర్లలో విడుదలయ్యాయి.

ఓటీటీలోకి నిన్న రిలీజైన ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్- సీక్వెల్‌కు మారిన ప్లాట్‌ఫామ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న రిలీజైన ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్- సీక్వెల్‌కు మారిన ప్లాట్‌ఫామ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

1300 కోట్లు కొల్లగొట్టి మరి

గతేడాది ధురంధర్ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ సినిమా వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ. 1300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది.

అంతేకాకుండా ధురంధర్ సినిమాలో యాక్షన్ సీన్స్, స్క్రీన్ ప్లే, లవ్ ట్రాక్ ఇండియన్ ఆడియెన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. దాంతో ఆ మూవీ సీక్వెల్ ధురంధర్ ది రివేంజ్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాల నడుమ నిన్న థియేటర్లలో చాలా గ్రాండ్‌గా ధురంధర్ 2 విడుదల అయింది.

ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్

ధురంధర్ 2 కూడా ఫుల్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తొలిరోజే సుమారు రూ. 146 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు రెడీ అయింది ధురంధర్ 2 మూవీ. ఈ నేపథ్యంలో ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి.

అయితే, ధురంధర్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కానీ, ధురంధర్ సీక్వెల్ మూవీ ధురంధర్ ది రివేంజ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ మాత్రం మారిపోయింది. సినిమా నిర్మాణంలో భాగం పంచుకున్న జియో హాట్‌స్టార్‌కు ధురంధర్ 2 ఓటీటీ రైట్స్ ఇచ్చేశారు. దీని ధర సుమారుగా రూ. 150 కోట్లు అని టాక్.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

అంటే, జియో హాట్‌స్టార్‌లో ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ధురంధర్ లాగానే సెకండా పార్ట్ ది రివేంజ్ కూడా సుమారు 8 వారాల తర్వాతే ఓటీటీ ప్రీమియర్ అవనున్నట్లు సమాచారం. అంటే, మే చివరి వీక్‌లో ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక ఉగాది 2026 రోజున టాలీవుడ్‌లో థియేట్రికల్ రిలీజ్ అయిన అతిపెద్ద సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్-పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాల మధ్య మార్చి 19న విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ రిలీజ్

కానీ, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ ట్రీట్‌లా ఉంది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ రిలీజ్ వివరాలు ఆసక్తిగా మారాయి. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ రైట్స్‌ను రూ. 80 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

ఈ లెక్కన నెట్‌ఫ్లిక్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుందని తెలుస్తోంది. థియేట్రికల్ రిలీజ్ అయిన సుమారు నాలుగు లేదా ఐదు వారాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీలోకి వచ్చేయనుందని సమాచారం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More