Bellamkonda Srinivas Dhurandhar 2: రణ్‌వీర్ అన్న ప్రతి ఫ్రేమ్‌లో నీదే రాజ్యం- ధురంధర్ 2పై బెల్లంకొండ శ్రీనివాస్ రివ్యూ!

Bellamkonda Srinivas Dhurandhar 2 Review: మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రామ్ గోపాల్ వర్మ వంటి స్టార్ సెలబ్రిటీల తర్వాత యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ధురంధర్ 2పై రివ్యూ ఇచ్చారు. రణ్‌వీర్ సింగ్‌ను అన్న అంటూ సంబోధిస్తూ ప్రతి ఫ్రేమ్‌లో నీదే రాజ్యమంటూ ప్రశంసించారు.

Published on: Mar 20, 2026, 11:35:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' మార్చి 19 థియేటర్లలోకి వచ్చేసింది. మొదటి రోజే దేశవ్యాప్తంగా థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం కనిపించింది.

రణ్‌వీర్ అన్న ప్రతి ఫ్రేమ్‌లో నీదే రాజ్యం- ధురంధర్ 2పై బెల్లంకొండ శ్రీనివాస్ రివ్యూ!
రణ్‌వీర్ అన్న ప్రతి ఫ్రేమ్‌లో నీదే రాజ్యం- ధురంధర్ 2పై బెల్లంకొండ శ్రీనివాస్ రివ్యూ!

స్టార్ హీరోల తర్వాత

ఇప్పటికే విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ గోపాల్ వర్మ వంటి స్టార్లు ధురంధర్ ది రివేంజ్ సినిమాను మెచ్చుకోగా తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సోషల్ మీడియా వేదికగా ధురంధర్ 2పై తన రివ్యూ ఇచ్చారు.

రణ్‌వీర్ అన్న.. ప్రతి ఫ్రేమ్‌లో నీదే రాజ్యం

"గత రాత్రి 'ధురంధర్ 2' చూశాను.. ఇదొక అద్భుతమైన అనుభవం! సినిమాలో ఇంటెన్సిటీ, ఎమోషన్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. రణ్‌వీర్ సింగ్ బ్రదర్.. ప్రతి ఫ్రేమ్‌లో నీ విశ్వరూపం చూపించావు. తెలుగు ప్రేక్షకులతో నీకు ఏర్పడిన బాండింగ్ నెక్ట్స్ లెవల్‌లో ఉంది. నీ సినిమాలు మాకు రెగ్యులర్‌గా కావాలి" అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ తన ఎక్స్ (Twitter) ఖాతాలో రాసుకొచ్చారు.

దర్శకుడి విజన్‌ను పొగుడుతూ

అలాగే సీనియర్ నటుడు మాధవన్ నటనను, దర్శకుడు ఆదిత్య ధర్ మేకింగ్ విజన్‌ను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆకాశానికెత్తేశారు. కాగా ధురంధర్ 2 సినిమా భారతీయ సినీ చరిత్రలోనే అతిపెద్ద పేయిడ్ ప్రివ్యూ రికార్డును నెలకొల్పింది.

రికార్డుల వేట.. 'OG' రికార్డులు బ్రేక్!

దేశవ్యాప్తంగా 6,000 స్క్రీన్లలో 9,000 షోలతో దుమ్మురేపింది ధురంధర్ 2. కేవలం పేయిడ్ ప్రివ్యూల ద్వారానే సుమారు రూ. 44 కోట్ల నెట్ (రూ. 52.50 కోట్ల గ్రాస్) వసూలు చేసి ఆల్-టైమ్ రికార్డు సృష్టించింది ధురంధర్ ది రివేంజ్ చిత్రం. ఇప్పటివరకు పవన్ కల్యాణ్ 'ఓజీ' (రూ. 25 కోట్లు) పేరిట ఉన్న రికార్డును 'ధురంధర్ 2' భారీ తేడాతో అధిగమించింది.

కరాచీ గ్యాంగ్ వార్ నేపథ్యం.. హమ్జాగా రణ్‌వీర్!

పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న ల్యారీ టౌన్ నేపథ్యంలో ధురంధర్ 2 సినిమా సాగుతుంది. గ్యాంగ్ వార్లకు నిలయమైన ఆ ప్రాంతంలో జరిగే రహస్య ఆపరేషన్లను దర్శకుడు అద్భుతంగా చూపించారు. జస్కీరాత్ సింగ్ రంగీ అనే వ్యక్తి, హమ్జా అలీ మజారీ అనే స్పైగా ఎలా మారాడు అనే సైకలాజికల్, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను రణ్‌వీర్ తన నటనతో పండించారు.

సినిమా ఎలా ఉంది?

ధురంధర్ 2 సినిమా ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ చాలా పవర్‌ఫుల్‌గా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంటర్వెల్ పాయింట్ దగ్గర వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. దర్శకుడు ఆదిత్య ధర్ మొదటి పార్ట్ జ్ఞాపకాల జోలికి వెళ్లకుండా, కథను వేగంగా ముందుకు నడిపించడం సినిమాకు ప్లస్ పాయింట్.

ధురంధర్ 2 కలెక్షన్స్

అయితే, సినిమాలో ప్రభుత్వ విధానాలను పదే పదే పొగడటం కొంచెం అతిగా అనిపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద తొలి రోజూ రూ. 146 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More