Bellamkonda Srinivas: అది నిశ్చితార్థం కాదు- కాబోయే భార్య కావ్యమ్మను పరిచయం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్- ఫొటోలు వైరల్

Bellamkonda Sai Srinivas Introduce Kavya Reddy: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. కావ్య రెడ్డితో ఆయన వివాహం నిశ్చయమైంది. అయితే, ఇటీవల వచ్చిన ఎంగేజ్‌మెంట్ వార్తలు నిజం కాదని, అసలైన సెలబ్రేషన్ ఇప్పుడే మొదలైందని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలిపాడు.

Published on: Mar 9, 2026, 19:32:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. గత కొంతకాలంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి గురించి వస్తున్న వార్తలకు తెరదించుతూ, కావ్య రెడ్డి అనే అమ్మాయితో తన బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.

అది నిశ్చితార్థం కాదు- కాబోయే భార్య కావ్యమ్మను పరిచయం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్- ఫొటోలు వైరల్
అది నిశ్చితార్థం కాదు- కాబోయే భార్య కావ్యమ్మను పరిచయం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్- ఫొటోలు వైరల్

అధికారిక ప్రకటన

అయితే, ఈపాటికే కావ్య రెడ్డి అనే యువతితో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్ జరిగిందని కథనాలు వచ్చాయి. కానీ, నిజానికి నిశ్చితార్థం జరగలేదని, అది కేవలం ఒక చిన్న ఫ్యామిలీ అనౌన్స్‌మెంట్ మాత్రమే అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అధికారికంగా చెప్పాడు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరికీ 'రోకా' (Roka) వేడుక ఘనంగా జరిగింది.

కావ్యమ్మా అంటూ

ఈ సందర్భంగా తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఫొటోలు పంచుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ ఫొటోలు షేర్ చేస్తూ కావ్య రెడ్డిని కావ్యమ్మా అని పిలుస్తూ అందమైన నోట్ రాసుకొచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

నా ప్రపంచంలోకి తీసుకొచ్చింది

"నా కావ్యమ్మకు.. జీవితానికి తనకంటూ ఓ అందమైన సమయం ఉంది. అది నిన్ను నా ప్రపంచంలోకి తీసుకొచ్చింది. నా జీవితంలోకి వచ్చినందుకు, నా జీవితాన్ని పాజిటివిటీతో, లెక్కలేనన్ని చిరు నవ్వులతో నింపినందుకు థ్యాంక్స్" అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాసుకొచ్చాడు.

ఎప్పటికీ వాడిపోనివ్వను

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంకా కొనసాగిస్తూ.. "ఆ చిరునవ్వులను నీ మోముపై కూడా ఎప్పటికీ వాడిపోనివ్వను. మనం ఎప్పటికీ కలిసి జీవించే క్షణం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ప్రేమతో నీ శ్రీని" అని పేర్కొన్నాడు.

అది ఎంగేజ్‌మెంట్ కాదు

అలాగే, "ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. అది ఎంగేజ్‌మెంట్ కాదు. కేవలం ఒక చిన్న ఫ్యామిలీ అనౌన్స్‌మెంట్ మాత్రమే. వేడుకలు ఇక ప్రారంభం కానున్నాయి. డేట్స్‌ను త్వరలోనే ప్రకటిస్తాం. మీ ప్రేమ, సహకారమే నా ప్రపంచం" అంటూ అభిమానులు, ప్రేక్షకుల గురించి రాసుకొచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

ఆరెంజ్ కలర్ చీరలో అందంగా

ఇకపోతే హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుక పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో, ఎంతో ఆత్మీయంగా సాగింది. ఈ ప్రత్యేకమైన రోజున సాయి శ్రీనివాస్ పీచ్ రంగు ఎంబ్రాయిడరీ కుర్తాలో ఎంతో హుందాగా కనిపించగా.. కావ్య రెడ్డి గోల్డ్ వర్క్ ఉన్న ఆరెంజ్ కలర్ చీరలో అందంగా మెరిసిపోయారు.

బోయపాటి శ్రీను-సంయుక్త

ఆదివారం (మార్చి 8) జరిగిన ఈ వేడుకకు డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త మీనన్ తదితర సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. కాగా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు కాబోయే భార్య పేరు కావ్య రెడ్డి. హైదరాబాద్ లాయర్ కుటుంబానికి చెందిన కావ్యకు చిత్ర పరిశ్రమతో సంబంధం లేదు.

న్యాయవాది కుమార్తె

కావ్య రెడ్డి ప్రముఖ న్యాయవాది కుమార్తె. బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. కానీ, ఇది అరెంజ్‌డ్ మ్యారేజ్ అని మరో టాక్ కూడా వినిపిస్తోంది.

అల్లుడు శీను సినిమాతో

ఇదిలా ఉంటే, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడైన సాయి శ్రీనివాస్.. 'అల్లుడు శీను'తో హీరోగా అరంగేట్రం చేయగా 'రాక్షసుడు' మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఇటీవల భైరవం, కిష్కింధపురి చిత్రాలతో అలరించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం టైసన్ నాయుడు, హైందవ మూవీస్‌తో బిజీగా ఉన్నాడు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More