బ్రహ్మముడి ఫిబ్రవరి 28 ఎపిసోడ్: భర్త, వదినతో కలిసి రేఖ దౌర్జన్యం- కావ్య బిడ్డ పేరు మీద ఆస్తి- అయినా సంతకం చేసిన అపర్ణ!
Brahmamudi Serial February 28th Episode: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 28 ఎపిసోడ్‌లో తన వెంట పడిన భూషణ్‌ను పెళ్లి చేసుకున్న రేఖ అపర్ణ ఇంటికి అడుగు పెట్టి దౌర్జన్యం చేస్తుంది. పిల్లలను, మొగుడుని చంపేస్తానని బెదిరిస్తుంది. కానీ, ఆస్తి మాత్రం కావ్య బిడ్డ పేరు మీద ఉందని అపర్ణ చెప్పడంతో షాక్ అవుతుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రేఖ పెళ్లి చేసుకుని కొత్త ఫ్యామిలీతో అపర్ణ ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఆగమని అపర్ణ అరుస్తుంది. మళ్లీ ఎందుకు వచ్చావని, అడుగు లోపల పడితే చంపేస్తానని బెదిరిస్తుంది అపర్ణ. కానీ, అది లెక్క చేయకుండా రేఖ ఇంట్లోకి వస్తుంది.

ఒక్కదానివి ఎలా పాలించగలవు
దాంతో రేఖ పీక పట్టుకుంటుంది అపర్ణ. ఆవేశపడకండి ఆంటీ. ఇప్పుడు నీకు ఎవరు భయపడరు. ఇంతపెద్ద సామ్రాజ్యాన్ని నువ్వు ఒక్కదానివి ఎలా పాలించగలవు. దుగ్గిరాల ఆస్తులను నా చేతిలో పెట్టండి. కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని రేఖ అంటుంది. నేను నిన్ను జైళ్లో పెట్టి చిప్పకూడు తినిపించగలను అని అపర్ణ అంటుంది.
నీ కొడుకు తలను బద్ధలు కొట్టి చంపిన నా తల్లి రుద్రాణి గుర్తుందా. తన కూతురుని నేను ఎలాంటిదాన్నో ఊహించలేవా. నేను నీ వారసురాళ్లను చంపేస్తే చూస్తూ ఊరుకోగలవా అని బెదిరిస్తుంది రేఖ. భర్తకు సైగ చేయడంతో అతను వెళ్లి అపర్ణ మనవరాళ్లపై కత్తి పెడతాడు. అంతేకాకుండా సుభాష్‌ను రేఖ వదిన కర్రతో కొడుతుంది. భర్త, వదినతో కలిసి రేఖ దౌర్జన్యం చేస్తుంది.
పిల్లలు, మొగుడుని చంపేస్తానని, నోరు మూసుకుని ఆస్తి పేపర్స్ మీద సంతకం చేయమని బెదిరిస్తుంది రేఖ. నేను సంతకం చేస్తే ఆస్తి కాదు కదా ఇంట్లో ఆవగింజ కూడా నీకు రాదు అని అపర్ణ చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు.
నీకు అధికారం ఉండదు
ఆస్తి మొత్తం కావ్య పేరు మీద ఉంది. కావ్య చనిపోయింది కాబట్టి కావ్య కూతురుకు చెందుతుంది. 18 ఏళ్లు వచ్చేవరకు ఇందుకు కూడా అధికారం ఉండదు. అప్పటివరకు నేను గార్డియన్‌గా ఉంటాను. కాదు కూడదు అంటే అంతా ట్రస్ట్‌కు వెళ్లిపోతుంది. నీ అమ్మ గురించి తెలిసే కావ్య, రాజ్ అంతా పకడ్బందీగా ప్లాన్ చేశారు అని అపర్ణ చెబుతుంది.
దాంతో మమ్మల్ని మోసం చేశావా అని రేఖపైనే రివర్స్ అవుతారు తన భర్త, వదిన. ఇప్పుడేం చేస్తారని నిలదీస్తారు. ఇలాంటి దాన్ని నమ్ముకుంటే మీరు కూడా జైలుకెళ్లి చిప్పకూడు తినాలి. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అపర్ణ అంటుంది. ఇది చెబితే వినాలా అని అపర్ణ కర్రపై కొడుతుంది. ఆ పాపకు పాతికేళ్లు వచ్చాక సంతకం పెట్టించుకుందాం అంటుంది.
ఈ పాతికేళ్లు నువ్వు గార్డియన్‌గా ఉండలేవు కానీ సంతకం పెట్టు ఇల్లు ఆస్తి నేను చూసుకుంటాను రేఖ అంటుంది. సంతకం పెట్టకని సుభాష్ అంటాడు. ఈ సంతకం చేయకపోతే పిల్లలతో పాటు నీ మొగుడు కూడా చస్తాడు అని వదినకు కర్ర ఇస్తుంది రేఖ. పిల్లలపై భూషణ్ కత్తి పెడతాడు. ఇద్దరు చంపేయాలని చూస్తారు. దాంతో వద్దని అపర్ణ అంటుంది.
తల్లి ఆశయం సాధించిన రేఖ
మీరు అడిగినట్లు సంతకం పెడతాను అని సంతకం పెడుతుంది అపర్ణ. ఇక నుంచి ఇంట్లో నేను చేసిందే చట్టం. నేనే ఈ ఇంటికి మహారాణి అని చెప్పుకుంటుంది రేఖ. అలా తల్లి రుద్రాణి సాధించలేనిది కూతురు రేఖ సాధిస్తుంది. మరోవైపు స్వరాజ్‌తో తీసుకొచ్చిన వ్యక్తి మాట్లాడుతాడు. అమ్మ నాన్న గురించి అడుగుతాడు. ఇంతలో అతని భార్య వచ్చి గుర్తుకు వస్తే చెబుతాడులెండి అని భోజనం పెడుతుంది.
స్వరాజ్ తింటాడు. మరోవైపు రేఖ చేసింది అంతా అపర్ణ తలుచుకుంటుంది. అపర్ణ చేసిన సంతకం గురించి సుభాష్ బాధపడుతాడు. పవర్ మొత్తం రేఖ చేతిలోకి వెళ్లిపోయింది. రుద్రాణి ఏంటో తెలియక తప్పు చేశాం. ఇప్పుడు రేఖ గురించి తెలిసి తప్పు చేశావ్ అని సుభాష్ అంటాడు. మిమ్మల్ని కాపాడుకునేందుకు ఇంకో మార్గం కనిపించలేదని అపర్ణ అంటుంది.
పోలీసులకు చెప్పి జైలుకు పంపించిన మళ్లీ వస్తుంది. కంటికి కనిపించకుండా ఏదోటి చేస్తుంది. రుద్రాణి అలాగే చేసిందిగా అని అపర్ణ అంటుంది. పిల్లల భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. నువ్వే చూసుకోవాలి. కానీ, నేనే నీకు బారంగా మారాను అని సుభాష్ అంటాడు. మీరు నాకు బారం ఏంటని అపర్ణ అంటుంది. మరోవైపు స్వరాజ్ రాత్రి కలలో బాంబ్ బ్లాస్ట్ గుర్తొచ్చి అమ్మా అంటూ అరుస్తాడు.
పెద్ద ఘోరమే జరిగింది
మంటలు మంటలు అని అరుస్తాడు. అమ్మ పక్కనే ఉందని ఓదారుస్తుంది. మంటలు అంటున్నాడు అంటే.. ఏదో పెద్ద ఘోరమే జరిగి ఉంటుందని తీసుకొచ్చిన తల్లి అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


