బ్రహ్మముడి ఫిబ్రవరి 27 ఎపిసోడ్: గతం మర్చిపోయిన స్వరాజ్- పెళ్లి చేసుకుని అపర్ణ ఇంటికి రేఖ-కొత్త ఫ్యామిలీతో రివేంజ్ ప్లాన్

Brahmamudi Serial February 27th Episode: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 27 ఎపిసోడ్‌లో హాస్పిటల్‌లో అపర్ణ ఏడుస్తుంటుంది. రేఖ వచ్చి ఓదారుస్తుంది. దాంతో అరిచి రేఖను పంపించేస్తుంది. తనవెంట పడుతున్న బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుని కొత్త ఫ్యామిలీతో ఆస్తి లాక్కునేందుకు ప్లాన్ చేస్తుంది రేఖ.

Published on: Feb 27, 2026 8:01 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో సీనియర్ డాక్టర్ వచ్చి సుభాష్ వెన్నుముకకు బలంగా దెబ్బ తగిలిందని, ఇక జీవితాంతం బెడ్ మీదే అని అపర్ణకు చెబుతాడు. ఆపరేషన్ చేయాలంటే కొంత కాలం ఆగాలి. ఆపరేషన్ చేసిన కూడా తిరిగి నడుస్తారని గ్యారెంటీ లేదని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు.

బ్రహ్మముడి సీరియల్‌ ఫిబ్రవరి 27 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ ఫిబ్రవరి 27 ఎపిసోడ్

అన్యాయం ఎందుకు చేశావ్

దాంతో ఏడ్చిన అపర్ణ దేవుడు దగ్గరకు వెళ్లి జరిగినదానిపై కోప్పడుతుంది. ఇంత అన్యాయం మాకు ఎందుకు చేశావంటూ దేవుడుని నిలదీస్తుంది అపర్ణ. ఆడది ఏదైనా భరిస్తుంది కానీ కడుపు కోతను తట్టుకోలేదు. కన్న కొడుకు కొరివి పెట్టేంత దుస్థితి నాకు ఎందుకు తెచ్చావ్. అంత పాపం చేశానా. ఇంత బారాన్ని నేను ఎలా మోయగలను అని కుమిలిపోతుంది అపర్ణ.

ఇంతలో అపర్ణపై రేఖ చేయి వేస్తుంది. అన్యాయం చేసింది దేవుడు కాదు మా అన్నయ్య, మా అమ్మ. తన కడుపున పుట్టినందుకు సిగ్గుగా ఉంది. ఎంత బాధ ఉన్న లైఫ్‌లో ముందుకు వెళ్లాలిగా. మిమ్మల్ని నమ్ముకుని ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీకు తోడుగా నేనున్నాను. మీకు కూతురులా ఉంటాను అని రేఖ అంటుంది.

ఇక చాలు మిమ్మల్ని నమ్మింది చాలు. నిన్ను చూస్తుంటే మీ అమ్మ చేసిందే గుర్తుకు వస్తుంది. నిన్ను ఏం చేయకముందే ఇక్కడి నుంచి వెళ్లిపో అని అపర్ణ అరుస్తుంది. నేను ఎక్కడికి వెళ్లను, ఒంటరి ఆడదాన్ని. జాలి చూపించండి అని రేఖ అంటుంది. చూపించను. మీ అమ్మ కూడా ఇలాగే జాలి చూపించమని చెప్పి నా కుటుంబాన్నే నామరూపం లేకుండా చేసింది. నువ్వు ఉన్న పిల్లలను కూడా చంపేయాలనుకుంటున్నావా. వెళ్లిపో అని అపర్ణ అంటుంది.

గతం మర్చిపోయిన స్వరాజ్

ఇంతలో నర్స్ వచ్చి అపర్ణను పిలుస్తుంది. మరోవైపు స్వరాజ్ గురించి తన ఫ్రెండ్ కానిస్టేబుల్ కోటికి కాల్ చేసి చెబుతాడు. బాబుకు స్పృహ వచ్చాకా చూసుకుందామని కోటి అంటాడు. ఇంతలో డాక్టర్ వచ్చి బాబుకు తగిలిన దెబ్బ వల్లో, యాక్సిడెంట్ కళ్లారా చూడటం వల్లో షాక్‌లో ఉన్నాడు. కనీసం పేరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడని అంటాడు.

బాబుకు ఏం గుర్తు లేదు. ఇలాంటి కేసుల్లో పది పదిహేను రోజుల్లో గతం గుర్తుకు వస్తుంది. నేను ట్యాబ్లెట్స్ రాసిస్తాను. మెల్లిగా గతం గుర్తు చేసే ప్రయత్నం చేయండి. ఎక్కువగా స్ట్రెస్ చేయకండి. తనకు తానే గుర్తు తెచ్చుకోవాలి. వారం తర్వాత తీసుకురండి అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు. ఈ బాబు ఎవరో తెలుసుకోకుండా ఇంటికి తీసుకెళ్లడం అంటే ఎలా అని అతను అంటాడు.

కానీ, ఈ బాబును చూస్తే గుండె తరుక్కుపోతుంది. మీ ఫ్రెండ్‌తో వీడు ఎవడో తెలుసుకోనివ్వండి. ఇంటికి తీసుకెళ్లాక వాడికి గతం గుర్తుకు వస్తే అప్పుడు వాళ్ల వారికి ఇచ్చేద్దామని లక్ష్మీ అంటుంది. సరే బిల్ కట్టి వస్తానని లక్ష్మీ భర్త వెళ్లిపోతాడు. జరిగింది, కుటుంబాన్ని తలుచుకుంటూ అపర్ణ కుమిలిపోతుంటే.. మరోవైపు రేఖ పగతో రగిలిపోతుంది.

రేఖ కొత్త ఫ్యామిలీ

ఇంత జరిగినా ఆ అపర్ణలో అహంకారం తగ్గలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది నేను ఎందుకు బతికి ఉన్నానో. ఇప్పుడు మిగిలి ఉన్నవాళ్లను నా కాలి కింద చెప్పులా పెట్టుకుంటాను అని రేఖ అనుకుంటుంది. తన వెంట పడుతున్న వ్యక్తిని రేఖ పిలిచి పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. కానీ, మా తమ్ముడు పెళ్లికి సిద్ధంగా లేడని అతని అక్క అంటుంది.

ఇంతకుముందు మీ మమ్మీ దుగ్గిరాల కుటుంబంలో ఉండేది. ఇప్పుడు మీ దగ్గర ఏముంది. ఈ బిడ్డ తప్ప. నా తమ్ముడిది చిన్న కంపెనీ. ఇప్పుడు నిన్ను నమ్ముకుంటే ఏమొస్తుందని అతని అక్క అంటుంది. నన్ను నమ్ముకుంటే మీరు అనుకుంది వస్తుంది. మా అమ్మ చచ్చినా ఆశయం చావలేదు. ఆస్తి లాక్కుని అపర్ణ, చావ చచ్చిన సుభాష్‌ను పైకి పంపేస్తే పగ తీరుతుందని రేఖ అంటుంది.

ఇదంతా చేయాలంటే నాకు బలం కావాలి. ఆ సామ్రాజ్యం నడిపించడానికి తోడు కావాలి. నన్ను పెళ్లి చేసుకుంటే ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆస్తి సొంతం చేసుకోవాలని రేఖ అంటుంది. పెళ్లి చేసుకుని మా ఇంటికి రావాలి లేదా మేమే మీ ఇంటికి రావాలి. నాకు పెళ్లయి భర్త, పిల్లలు కూడా ఉన్నారు. మేమంతా అక్కడికి రావడం అంటే అని ఆమె అంటే.. నాకు ఓకే. పెళ్లి చేసుకున్న మరుక్షణం మీరు నా ఫ్యామిలీ అవుతారని రేఖ అంటుంది.

పెళ్లి చేసుకున్న రేఖ

నేను నా తమ్ముడు కలిసి ఉంటే నాకు ఇంకేం కావాలి. మరి నీ అన్న కూతురుని ఇంకా నీతో ఎందుకు అనాథ శరణాలయంలో పడేయొచ్చు కదా అని ఆమె అంటుంది. మీ తమ్మున్ని పెళ్లి చేసుకుంటే మీరు నా పక్కనే ఉంటారు. కానీ, ఇది నా బాధ్యత. తనలో ప్రవహించేది నా అన్న రక్తం అని రేఖ అంటుంది. సరే నీకే బరువు లేనప్పుడు మాకెందుకు అని ఆమె అంటుంది.

ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. అన్ని రెడీగా ఉన్నాయని రేఖ అంటే.. వాళ్లు సరేనంటారు. మరోవైపు ఇంట్లో అపర్ణ, సుభాష్ ఒంటరిగా ఫీల్ అవుతారు. ఇది పాడుబడిన ఇల్లులా అనిపిస్తుందని అపర్ణ అంటుంది. ఇంతలో రేఖ పెళ్లి చేసుకుని వస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.