బ్రహ్మముడి ఫిబ్రవరి 26 ఎపిసోడ్: రుద్రాణిని త్రిశూలంతో పొడిచి చంపిన కావ్య-జీవచ్ఛవంలా సుభాష్-రేఖ గుప్పిట్లో ఆస్తి, అధికారం
Brahmamudi Serial February 26th Episode: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 26 ఎపిసోడ్‌లో పాపలను రుద్రాణి గన్‌తో షూట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. రాజ్ పిలవడంతో కావ్య లేచి అమ్మోరి త్రిశూలంతో రుద్రాణిని పొడిచి చంపేస్తుంది. తన కూతురును బాగా పెంచమని అపర్ణ దగ్గర మాట తీసుకుని చనిపోతుంది కావ్య.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాహుల్‌ను గన్‌తో షూట్ చేస్తాడు రాజ్. ఇంతలో రుద్రాణి వచ్చి రాజ్ తలపై కర్రతో కొడుతుంది. నీ ప్లాన్ సరిగా అమలు చేయలేదని రుద్రాణితో సారీ చెప్పి చనిపోతాడు రాహుల్. దాంతో కోపంగా అదే కర్ర తీసుకుని రాజ్ తలపై పదే పదే కొడుతుంది. నా వారసుడిని చంపావ్ కదా. నీ వారసుడుని చంపేస్తాను అని గన్ పట్టుకుంటుంది రుద్రాణి.

మన ప్రేమ ప్రమాదంలో ఉంది
కళావతి మన పిల్లలను కాపాడలేకపోయాను. నువ్వే కాపాడాలి కావ్య అని చేయి పట్టుకుని రాజ్ అంటాడు. కాపాడు కళావతి. మన ప్రేమ ప్రమాదంలో ఉంది. ఆ ప్రేమను కాపాడు. లే కళావతి వెళ్లి కాపాడు అని రాజ్ అంటాడు. పిల్లలను ఏం చేయకు అని రుద్రాణిని బతిమిలాడుతుంటుంది అపర్ణ. రాజ్ గట్టిగా అరవడంతో కావ్య చేయి లేచి కర్ర పట్టుకుని విసిరేస్తుంది.
దాంతో రుద్రాణి చేతిలో ఉన్న గన్ కింద పడుతుంది. కావ్య లేచి కూర్చొంటుంది. రుద్రాణి, రేఖ షాక్ అవుతారు. పిల్లలను కాపాడుతానండి అని రాజ్‌కు చెబుతుంది కావ్య. ఏంటే నా కొడుకుని చంపిన నీ కుటుంబాన్ని, నీ పాపను చంపేస్తాను అని రుద్రాణి అంటుంది. మీరేమైనా దాన ధర్మాలు చేశారా. మిమ్మల్ని అపురూపంగా చూసుకున్నారే. నీ కొడుకుకు మంచి గతే పట్టింది. ఇక మిగిలింది నువ్వే అని కావ్య అంటుంది.
త్రిశూలంతో చంపిన కావ్య
నిన్ను అంటూ కావ్య మెడ పట్టుకుంటుంది రుద్రాణి. రాయిపైకి తోసేస్తుంది రుద్రాణి. నీ కళ్ల ముందే నీ కూతురుని చంపేస్తాను. గుండెలు పగిలేలా ఏడు అని రుద్రాణి వెళ్తుంది. పక్కన ఉన్న అమ్మోరు త్రిశూలం తీసుకుని రుద్రాణినిపొడుస్తుంది కావ్య. అమ్మోరులా కావ్యను చూపిస్తారు. త్రిశూలం తీసి మళ్లీ పొడుస్తుంది కావ్య. అది చూసి అమ్మ అని రేఖ షాక్ అవుతుంది.
రుద్రాణి చనిపోతుంది. అత్తయ్య నా కూతురు బాధ్యత మీ చేతుల్లోనే పెడుతున్నాను. నా చావు నాకు కనిపిస్తుంది. మీ కొడుకుతోనే నా చావు. ఏం జరిగిన సరే నా కూతురుతోనే ఉండాలి. తన భవిష్యత్తును తను ఆశపడినట్లుగా తీర్చి దిద్దండి. దుగ్గిరాల ఇంటి పేరును నా కూతురుకు అందివ్వండి. అలా చేస్తానని మాటివ్వండి అని కావ్య అడుగుతుంది. అపర్ణ కావ్యకు మాటిస్తుంది.
మరో ఫ్యామిలీకి స్వరాజ్
దాంతో కావ్య కుప్పకూలిపోతుంది. మరోవైపు దూరంగా పడిన స్వరాజ్ లేస్తాడు. అమ్మా అంటూ లేస్తాడు. మరోవైపు నుంచి ఒక ఫ్యామిలీ కారులో వస్తారు. మల్లీకార్జున స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తుంటారు. అదే కారు ఎదుట స్వరాజ్ పడి ఉంటాడు. కారు ఆపిన ఆ కుటుంబం స్వరాజ్‌ను లేపుతాడు. ఏదో యాక్సిడెంట్ అయినట్లు ఉంది. ఇదంతా నా మెడకు చుట్టుకునేలా ఉందని కారు డ్రైవర్ అంటాడు.
నీకేం సమస్య రాదు. దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌కు తీసుకెళ్లు మేము ట్రీట్‌మెంట్ ఇస్తామని వాళ్లు అంటారు. దాంతో హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. మరోవైపు హాస్పిటల్‌లో అపర్ణ ఏడుస్తూ ఉంటుంది. అందరిని కోల్పోయాను, నా భర్త జీవచ్ఛవంలా ఐసీయూలో ఉన్నారు. ఇదంతా కల అయితే బాగుండు. ఇంత బారాన్ని మోయలేక నాకు పిచ్చి పట్టేలా ఉందని ఏడుస్తుంటుంది అపర్ణ.
రేఖ గుప్పిట్లో ఆస్తి, అధికారం
డాక్టర్ వచ్చి పిల్లలు బాగానే ఉన్నారు. బాగానే ఊపిరి పీల్చుకున్నారు అని డాక్టర్ అంటాడు. తన పొత్తిల్లలో పెట్టుకుని కూతురుని కాపాడుకుంది ఆ తల్లి అని అపర్ణ అంటుంది. తర్వాత సీనియర్ డాక్టర్ వచ్చి సుభాష్‌కు ట్రీట్‌మెంట్ జరుగుతుంది.
సీనియర్ డాక్టర్ వచ్చి సుభాష్ వెన్నుముకకు బాగా దెబ్బ తగిలిందని, ఇక నడవలేరని చెబుతాడు. కట్ చేస్తే దుగ్గిరాల కుటుంబం అంతా చనిపోతుంది. అపర్ణ, సుభాష్ బతికి ఉంటారు. ఆస్తి, అధికారం అంతా రేఖ తన గుప్పిట్లో పెట్టుకుంటుంది. రేఖ దగ్గర కావ్య, అప్పు కూతుళ్లతో అపర్ణ మగ్గిపోతూ బతుకుంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


