బ్రహ్మముడి ఫిబ్రవరి 24 ఎపిసోడ్: స్వరాజ్ వెన్నుపోటు- దారి మధ్యలోనే వ్యాన్ ఆపించిన కావ్య- బాంబ్ పేల్చిన రుద్రాణి!

బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 24 ఎపిసోడ్‌లో రుద్రాణి రౌడీని పంపి వ్యాన్‌కు బాంబ్ ఫిక్స్ చేయిస్తుంది. బాంబ్ ఫిక్స్ చేసే సమయంలో స్వప్న వచ్చి విజయవాడ ప్రాపర్టీ ట్యాక్స్ సమస్య గురించి చెబుతుంది. దాంతో వేరే కారులో వెళ్లేందుకు స్వప్నను ఒప్పిస్తాడు రాహుల్. బాంబ్ పెట్టిన వ్యాన్‌ను దారి మధ్యలో ఆపుతుంది కావ్య.

Published on: Feb 24, 2026, 07:33:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో వ్యాన్ డ్రైవర్ సూరితో రాహుల్, రేఖ డీజిల్, కండిషన్ గురించి మాట్లాడుతారు. వెళ్లి భోజనం చేసి, స్వీట్స్ తిని రా అని వ్యాన్ కీ తీసుకుని డ్రైవర్‌ను పంపిస్తాడు రాహుల్. రుద్రాణికి కాల్ చేస్తాడు రాహుల్. బాంబ్ పెట్టేందుకు రౌడీ వచ్చాడని చెబుతుంది.

బ్రహ్మముడి సీరియల్‌ ఫిబ్రవరి 24 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ ఫిబ్రవరి 24 ఎపిసోడ్

రాహుల్, రేఖ టెన్షన్

స్వప్నకు కాల్ వెళ్లింది.. ఈ వ్యాన్‌లో కూర్చోదు అని చెబుతాడు రాహుల్. రౌడీ వచ్చి వ్యాన్‌కు బాంబ్ ఫిక్స్ చేస్తుంటాడు. ఇంతలో స్వప్న పాపతో వస్తుంది. అది చూసి రాహుల్ కంగారుపడతాడు. ఏంటీ టెన్షన్ పడుతున్నారు అంటుంది. ఈ వ్యాన్ చెక్ చేయిస్తున్నా అని రాహుల్ అంటాడు.

విజయవాడ ప్రాపర్టీ మేనేజర్ కాల్ చేశాడు. రేపే వెళ్లి మునిసిపాలిటీ వాళ్లతో మాట్లాడమంటున్నాడు అని స్వప్న అంటుంది. అయితే, మనం సెపరేట్‌గా కారు తీసుకుని అటు నుంచి విజయవాడ వెళ్దామని రాహుల్ అంటాడు. సరే అని పాపను రాహుల్‌కు ఇచ్చి లోపలికి వెళ్లిపోతుంది స్వప్న. రౌడీ వ్యాన్‌కు బాంబ్ ఫిక్స్ చేస్తాడు. చెప్పిన టైమ్‌కు సెట్ చేశాను, ఆ టైమ్‌లో శ్రీశైలం ఘాటు రోడ్డుకు వచ్చేలా చేసుకోండి అని రౌడీ అని వెళ్లిపోతాడు.

నీ భార్యతోనే మనల్ని కాపాడేలా చేశావ్. సూర్యుడు అస్తమించేలోపు దుగ్గిరాల కుటుంబం ఉండదు. ఇక రుద్రాణి కుటుంబమే చక్రం తిప్పుతుందని రేఖ అంటుంది. శాంతి పూజ పూర్తయిందని, ఊయలలో వేసి నామకరణం చేయాలని పంతులు చెబుతాడు. ఇంతలో రేవతి, స్వరాజ్ వస్తారు. నాకు న్యాయం కావాలి నా మరదలిని నేనే ఊయలలో వేస్తాను అని స్వరాజ్ అంటాడు.

స్వరాజ్ వెన్నుపోటు

దానికి అంతా సరేనంటారు. నీ పెళ్లాన్ని నువ్వే ఊయలలో వేసుకుని నువ్వే పేరు పెట్టుకో అని అపర్ణ అంటుంది. నామకరణం జరుగుతుంది. నా పెళ్లాం పేరు ఏంటీ స్వరాజ్ అంటే.. నా పేరేరా ఇందిరాదేవి అని తాతమ్మ చెబుతుంది. ఛీ.. అస్సలు బాగా లేదు. ఇంత పాత పేరా అని స్వరాజ్ అంటాడు. రేయ్ దీనికన్న వెన్నుపోటు ఉంటుందారా. నిన్ను ఇంటికి తీసుకురాడానికి ఎంత అగచాట్లు పడ్డానురా అని ఇందిరాదేవి అంటుంది.

చాక్లెట్ ఇచ్చావని పేరు పెట్టలేంగా అని స్వరాజ్ అంటాడు. అమ్మో.. వీడు మరో రాజ్ అయ్యేలా ఉన్నాడు. కావ్య నీ కూతురు పని అయిపోయిందే అని ఇందిరాదేవి అంటుంది. ఇందిరాదేవి నచ్చకుంటే ఇందు అని పిలు అని కావ్య అనడంతో బాగుందని స్వరాజ్ అంటాడు. తర్వాత అప్పు కూతురుకు ధాన్యలక్ష్మీ పెట్టిన నందన పేరు బాగుందని అప్పు అంటే.. నందు అని పిలవచ్చని ఇందిరాదేవి అంటుంది.

కావ్య, అప్పు కూతుళ్ల పేర్లు నందు, ఇందు అని పెడతారు. తర్వాత శ్రీశైలం వెళ్దామని, 9 గంటలలోపు ఫారెస్ట్ దాటాలని, లేకుంటే చెక్ పోస్ట్ వేస్తారని రాహుల్ చెబుతాడు. దాంతో దుగ్గిరాల కుటుంబం అంతా శ్రీశైలం టూర్‌ కోసం వ్యాన్ ఎక్కుతారు. రాహుల్ వాళ్లు సెపరేట్‌గా రావడం చూసి రాజ్ అడుగుతాడు. విజయవాడ ప్రాపర్టీకి ట్యాక్స్ సమస్య వచ్చిందని స్వప్న చెబుతుంది.

చాలా పవర్‌ఫుల్

సరేనని రాజ్ అంటాడు. అంతా వ్యాన్ ఎక్కుతారు. అదే విషయం రుద్రాణికి చెబుతుంది. ఆ బాంబ్ చాలా పవర్‌ఫుల్, మీరు 200 కిలోమీటర్ల దూరంలో ఉండాలని రుద్రాణి అంటుంది. నేను ఆ దుగ్గిరాల కుటుంబం అంతమవడం చూడాలి, అందుకే ఘాటు రోడ్డు దగ్గరున్న గెస్ట్ హౌజ్‌లో ఎదురుచూస్తున్నా అని బిల్డింగ్ పైనుంచి ఫోన్‌లో చెబుతుంది రుద్రాణి.

వ్యాన్‌లో బోర్ కొడుతుందని ప్రకాశం అంటే.. కపుల్స్‌లో ఒకరు పాట పాడుతారు, మరొకరు డ్యాన్స్ చేయాలని కావ్య చెబుతుంది. అది ప్రకాశంతో మొదలుపెడతారు. ఒక్కొక్క కపుల్ పాట పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు. తర్వాత దారి మధ్యలోనే వ్యాన్‌ను కావ్య ఆపమంటుంది. అప్పుతో సహా వ్యాన్ దిగుతుంది కావ్య. అది చూసి రాహుల్, రేఖ షాక్ అవుతారు.

తర్వాత మళ్లీ కావ్య, అప్పు వ్యాన్ ఎక్కుతారు. పాడుతు డ్యాన్స్ చేస్తుంటారు. వ్యాన్ శ్రీశైలం ఘాటు రోడ్డుకు రావడం చూసిన రుద్రాణి బాంబ్ పేలుస్తుంది. దాంతో వ్యాన్‌ కిందనుంచి మంటలు అంటుకుంటాయి. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More