బ్రహ్మముడి ఫిబ్రవరి 9 ఎపిసోడ్: రౌడీల నుంచి రాజ్‌ను కాపాడిన మంత్రి- కన్నబిడ్డతో ఇంటికి కావ్య- తల్లిని భయపెట్టిన రాహుల్
బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 9 ఎపిసోడ్‌లో హెడ్ నర్స్ నీలవేణికి కాల్ చేసిన రుద్రాణి తన రౌడీలను పాప దగ్గరికి పంపించాలని బ్లాక్ మెయిల్ చేస్తుంది. కానీ, నీలవేణి వెళ్లి రాజ్‌కు రౌడీల విషయం చెబుతుంది. వచ్చిన రౌడీలను కూడా నీలవేణి డైవర్ట్ చేస్తుంది. రౌడీలు రాజ్‌ను కత్తితో పొడవబోతుంటే మంత్రి కాపాడుతాడు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఎలాగైనా పాపను కాపాడమని హాస్పిటల్‌లో డాక్టర్‌తో అంటారు కావ్య, దుగ్గిరాల కుటుంబం. డాక్టర్ అనురాధ పాపను ఆపరేషన్‌కు తీసుకెళ్తుంది. కావ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఐసీయూ వరకు వెళ్తుంది. పాప తిరిగి రాకపోతే ఈ బిడ్డ కన్నతల్లికి ఏమని సమాధానం చెబుతామని భయపడుతుంది కావ్య.

పేగు బంధం గట్టిది
నీ పేగు బంధం గట్టిది కాబట్టే నీ బిడ్డ గురించి తెలిసింది. ఈ తల్లి ప్రేమే ఈ పాపను కాపాడుతుంది అని రాజ్ ఓదారుస్తాడు. మరోవైపు రౌడీలకు రుద్రాణి కాల్ చేస్తుంది. నేను చెప్పింది గుర్తుందిగా. హాస్పిటల్ థియేటర్ నుంచి పాప ప్రాణాలతో బయటకు రాకూడదు. హాస్పిటల్‌లోకి వెళ్లేలా నేను చూసుకుంటాను అని రుద్రాణి చెబుతుంది.
ఇంతలో హెడ్ నర్స్ నీలవేణికి కాల్ చేస్తుంది రుద్రాణి. నీలవేణి భయపడుతుంది. నా మనుషులు హాస్పిటల్‌లోకి వస్తారు. వాళ్లను లోపలికి పంపించు అంతే. కాసేపట్లో డబ్బులు పడతాయ్ అని రుద్రాణి అంటుంది. నాకు ఏ డబ్బులు వద్దు పాపకు మళ్లీ ఏదో హానీ చేయబోతున్నారని నీలవేణి అంటుంది.
వాళ్లను హాస్పిటల్‌కు రానివ్వకుంటే నీ ఇంటికి వెళ్తారు. నీ పిల్లలు ఇంట్లోనే ఉన్నారనుకుంటా అని బ్లాక్ మెయిల్ చేస్తుంది రుద్రాణి. దాంతో సరే మీరు చెప్పిందే చేస్తాను అని నీలవేణి ఒప్పుకుంటుంది. కానీ, నీలవేణి బాగా ఆలోచిస్తుంది. వెళ్లి కావ్యతో మాట్లాడుతుంది నీలవేణి. కావ్య కోప్పడుతుంది.
ఆపరేషన్ సక్సెస్
పాపకు ప్రమాదం ఉంది. కొందరు పాపను ఆపరేషన్ థియేటర్‌లోనే చంపాలని చూస్తున్నారు. ఇప్పటికే నేను చాలా పెద్ద తప్పు చేశాను. ప్రాయిశ్చిత్తంతో ఈ విషయం చెబుతున్నాను అని నీలవేణి అంటుంది. ఎవరు చంపాలని చూస్తున్నారని రాజ్ అడుగుతాడు. ఇంకెవరు ఆ మినిస్టరే. ఇంకొద్ది సేపట్లో వాళ్లు వస్తారట అని నీలవేణి చెబుతుంది.
ఇక్కడ నీలవేణి మినిస్టర్ ధర్మేంద్ర పేరు చెప్పడంతో రుద్రాణి అదృష్టం బాగుండి ఎస్కేప్ అవుతుంది. వాడు ఇంకా దిగజారుతున్నాడని రాజ్ అంటాడు. వాళ్లు చెప్పినట్లు చేయకపోతే నా పిల్లలను చంపాలని బెదిరిస్తున్నారని నీలవేణి అంటుంది. వాళ్లు చెప్పినట్లు మీరు చేయండి. పాపకు ఏం కాకుండా నేను చూసుకుంటాను అని రాజ్ అంటాడు.
దాంతో నీలవేణి వెళ్లిపోతుంది. ఇంట్లోవాళ్లను పంపిద్దామని రాజ్, కావ్య వెళ్తారు. ఇంతలో డాక్టర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది అని చెప్పడంతో అంతా సంతోషిస్తారు. కానీ, పాప స్పృహలోకి వస్తే కానీ కండిషన్ ఏంటో చెప్పలేం. ఇంకో రెండు గంటలు గడిస్తే తెలిసిపోతుంది అని డాక్టర్ అనురాధ అంటుంది.
పరధ్యానంగా ధర్మేంద్ర
ఇంతలో రౌడీలు వస్తారు. ఆ విషయం రాజ్‌కు కాల్ చేసి నీలవేణి చెబుతుంది. పాపకు ఏం కాదు కదా అని ఇందిరాదేవి అంటుంది. డాక్టర్ చెప్పిందిగా ఏం కాదని. ఇక్కడ ఉంటే ఇలాగే కంగారుపడతారు. అంతా ఇంటికి వెళ్లండి అని రాజ్ అంటాడు. దాంతో అంతా ఇంటికి వెళ్లిపోతారు. మినిస్టర్ మనుషులు వచ్చేశారని కావ్యకు చెబుతాడు రాజ్.
కన్నకూతురును చంపుకోవాలని ఎలా అనిపించిందో. ఇంతకు ఇంత అనుభవిస్తాడు అని కావ్య అంటుంది. మరోవైపు రౌడీలను పక్కకు పిలిచిన నీలవేణి పాప ఐసీయూలో ఉంది. వాళ్లంతా అక్కడే ఉన్నారు. వాళ్లు వెళ్లిపోయాక వెళ్లండి అని రౌడీలను డైవర్ట్ చేస్తుంది నీలవేణి. మరోవైపు ధర్మేంద్ర పరధ్యానంగా ఉంటే తులసి వచ్చి కావ్య గురించి మాట్లాడుతుంది.
కావ్య పాపకు ఆపరేషన్ మన హాస్పిటల్‌లోనే ఇవాళ జరుగుతుంది. కావ్య గొప్ప మనసు గురించి తులసి చెబుతుంది. మీరు హెల్ప్ చేసుంటే మనకు పుణ్యం దక్కేది అని చెప్పేసి తులసి వెళ్లిపోతుంది. ఇంతలో రుద్రాణి వచ్చి గుడ్ న్యూస్ అంటుంది. ఈరోజు నేను వేసిన ప్లాన్ వల్ల రాజ్ వాళ్లు మీ జీవితంలోకి శాశ్వతంగా రారు అని రుద్రాణి అంటుంది.
రుద్రాణికి వార్నింగ్
అది సాధ్యం కాదు అని ధర్మేంద్ర అంటాడు. పాపకు ఆపరేషన్ సక్సెస్ అయిన కాకపోయిన చంపేయమని హాస్పిటల్‌కు రౌడీలను పంపించాను. ఆ పాప ఉంటేనేగా మీ దగ్గరున్న పాపను అడిగేది. అసలు ఆ పాపే లేకుంటా ఎలా అడుగుతారు. ఆ పాపకు అంత్యక్రియలు చేయడం తప్పా ఇంకేం చేయలేరు అని రుద్రాణి అంటుంది.
దాంతో ఆవేశంగా రుద్రాణి చెంప చెల్లుమనిపిస్తాడు ధర్మేంద్ర. చంపేస్తాను నోరు తెరిస్తే. అక్కడ ఉంది ఎవరో కాదే నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ. నా పాపను చంపాలనే ఆలోచన ఎలా వచ్చిందే. నా భార్య కోసం తప్పు చేశాను కానీ నా బిడ్డను చంపుకునే దుర్మార్గుడిని కాదు. ఫోన్ చేసి వాళ్లను ఆపమని చెప్పు అని ధర్మేంద్ర అంటాడు.
వాళ్లు ఇలాంటి పనులు చేసేటప్పుడు ఫోన్ స్విచ్ఛాఫ్ పెట్టుకుంటారు. లిఫ్ట్ చేయరు అని రుద్రాణి అంటుంది. దాంతో మరోసారి కొడతాడు మంత్రి. రాజ్‌కు కాల్ చేసిన నా మాట నమ్మరు. ఎలా ఆపాలి అని హాస్పిటల్‌కు కంగారుగా వెళ్తాడు ధర్మేంద్ర. మరోవైపు పాప లేని రూమ్‌లోకి రౌడీలను పంపిస్తుంది నీలవేణి. అక్కడ పాపకు బదులు బొమ్మ ఉంటుంది.
రాజ్‌ను కాపాడిన మంత్రి
రాజ్ ఎంట్రీ ఇచ్చి రౌడీలను చితక్కొడతాడు. రాజ్‌ను కత్తితో రౌడీలు పొడవబోతుంటే మంత్రి వచ్చి అడ్డుకుంటాడు. రాజ్‌ను కాపాడుతాడు మంత్రి ధర్మేంద్ర. కట్ చేస్తే పాప తన కన్నబిడ్డతో అత్తింట్లోకి అడుగుపెడుతుంది. అంతా సంతోషంగా ఉంటారు. మంత్రితో అలా చేయించింది నువ్వు అని ఎప్పటికీ తెలియకూడదు అని తల్లి రుద్రాణిని రాహుల్ భయపెడతాడు. భయంతో వణికిపోతుంది రుద్రాణి.
మరోవైపు హాస్పిటల్‌లో ఎంతోమంది పుట్టిన ఒక్క కావ్య అక్క బిడ్డనే కావాలని మార్చారు. ఎవరో మినిస్టర్‌తో ఈ తప్పు చేయించారని అనిపించట్లేదా అని అప్పు డౌట్ పడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


