బ్రహ్మముడి ప్రోమో: రాజ్‌ను కత్తితో పొడిచిన రౌడీలు- బిడ్డలను మార్చింది రుద్రాణే- రాజ్ త్యాగంతో నిజం ఒప్పేసుకున్న మంత్రి!
బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్, కావ్య దగ్గర ఉన్న పాపను చంపేందుకు రౌడీలను పంపించానని రుద్రాణి చెబుతుంది. దాంతో రుద్రాణిని కొడతాడు ధర్మేంద్ర. హాస్పిటల్‌లో రౌడీలు రాజ్‌ను చుట్టుముట్టి వెనుక నుంచి కత్తితో పొడుస్తారు. రాజ్ త్యాగం చూసిన మంత్రి రుద్రాణి గురించి నిజం చెబుతాడు.
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో తన పాప కాదని తెలిసిన ఆరోగ్యం తల్లడిల్లిపోతున్న కావ్యను దుగ్గిరాల ఇంట్లోవాళ్లంతా మెచ్చుకుంటారు. అదంతా చూసిన రేఖ కోపంగా వెళ్లి రుద్రాణికి చెబుతుంది. నీది చెత్త ఐడియా, ధాన్యలక్ష్మీతో చేసిన ప్లాన్ వర్కౌట్ కాలేదు, రాజ్ అంతా నిజం చెప్పేసారు. కావ్యను ఆకాశానికెత్తుస్తున్నారు అని చెబుతుంది రేఖ.

మధ్యలో నేనున్నా
వాళ్లంతా సంతోషంగా ఉండాలన్నా, కావ్య బిడ్డ తన దగ్గరికి రావాలన్న మంత్రి పాపకు ఆపరేషన్ జరగాలి, ఆరోగ్యం బాగుపడాలి. అది జరగకుండా చేసేందుకు మధ్యలో నేనున్నాను అని రుద్రాణి అంటుంది. మరుసటి రోజు ఉదయం హాస్పిటల్‌లో దుగ్గిరాల కుటుంబం అంతా కంగారుగా కూర్చుంటారు. డాక్టర్ అనురాధ వచ్చి పాపను ఇవ్వమంటుంది.
అంతా డాక్టర్ మీదే నమ్మకం పెట్టుకున్నామని, ఈ పాప క్షేమంగా ఉంటేనే తన పాప తన దగ్గరికి వస్తుందని, కావ్య, అపర్ణ వాళ్లు చెబుతారు. ఈ పాపకు ఏం కాదని, అంతా బాగుంటుందని డాక్టర్ అనురాధ చెప్పి పాపను ఆపరేషన్‌కు తీసుకెళ్తుంది. మరోవైపు రౌడీలతో మాట్లాడుతుంది రుద్రాణి. రాజ్, కావ్య దగ్గర ఉన్న పాప గురించి చెప్పి ఎలాగైనా చంపేయాలని ఆర్డర్ వేస్తుంది.
చిన్న పాపను ఎలా చంపుతామని రౌడీలు అంటే.. చంపితే భారీగా డబ్బు ముట్టజెబుతానని అంటుంది రుద్రాణి. దాంతో రౌడీలు ఒప్పుకుంటారు. హాస్పిటల్‌కు వెళ్తారు రౌడీలు. తర్వాత మంత్రి ధర్మేంద్ర దగ్గరికి వెళ్తుంది రుద్రాణి. జరిగింది తలుచుకుంటూ, రాజ్, కావ్యను ఎలా ఫేస్ చేయాలో తల బాదుకుంటూ కనిపిస్తాడు మంత్రి. రుద్రాణి రాగానే తన బాధ చెప్పుకుంటాడు.
నా బిడ్డను చంపాలని చూస్తావా
ఇక మీకు ఆ బాధలు ఉండవని రుద్రాణి అంటుంది. ఎలా అని ధర్మేంద్ర అడుగుతాడు. మీ పాపకు కావ్య వాళ్లు ఆపరేషన్ చేయిస్తున్నారు. ఆ పాప బతుకుతుందనే నమ్మకంతోనే ఉన్నారు. కానీ, ఆ బిడ్డ బతికినా చింపేసేందుకు రౌడీలను పంపాను. కావ్య బిడ్డ మీ దగ్గరే ఉంటుంది. కావ్య దగ్గర చనిపోయిన పాపకు అంత్యక్రియలు చేయడం తప్పా ఇంకేం చేయలేరు అని రుద్రాణి అంటుంది.
దాంతో ఒక్కసారిగా కోపం తెచ్చుకున్న మంత్రి రుద్రాణిని చెంప చెల్లుమనిపిస్తాడు. నువ్వు చంపాలనుకుంది ఎవరినో తెలుసా. నా పాపను. నా కన్నబిడ్డను. నా బిడ్డను కాపాడాలని వాళ్లు ప్రయత్నిస్తుంటే నువ్వు చంపాలనుకుంటావా. ఇప్పుడు ఈ విషయం రాజ్‌కు చెప్పిన నమ్మడు. ఎలా వాళ్లను ఆపాలని హాస్పిటల్‌కు బయలుదేరుతాడు మంత్రి ధర్మేంద్ర.
మరోవైపు పాప దగ్గరికి రౌడీలు వెళ్తారు. చంపేందుకు ప్రయత్నించే లోపలే రాజ్ ఎంట్రీ ఇస్తాడు. రౌడీలను చితక్కొడతాడు రాజ్. కానీ, ఒక రౌడీ రాజ్‌ను వెనుక నుంచి గట్టిగా అదిమి పట్టుకుంటాడు. మరో రౌడీ వచ్చి రాజ్‌ను వెనుక నుంచి కత్తితో పొడుస్తాడు. ఇంతలో దుగ్గిరాల కుటుంబం, డాక్టర్స్ రావడంతో రౌడీలు పారిపోతారు. రాజ్ రక్తపు మడుగులో ఉంటాడు.
నిజం చెప్పేసిన ధర్మేంద్ర
రాజ్‌కు ఆపరేషన్ చేస్తుంటారు డాక్టర్స్. ఇంతలో మంత్రి ధర్మేంద్ర వస్తాడు. మంత్రిని దుగ్గిరాల కుటుంబం నానా చివాట్లు పెడుతుంది. ఆఖరికి సొంత కూతురునే చంపుకునేంత నీచుడువి అయ్యావ్, నీ బిడ్డను కాపాడేందుకు నా కొడుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడని అపర్ణ అంటుంది.
దాంతో చేతులు జోడించి క్షమాపణలు వేడుకుంటాడు. రౌడీలను నేను పంపించలేదు. ఇదంతా చేసింది రుద్రాణి. బిడ్డలను మార్చమని ఐడియా ఇచ్చేందే తను. నా భార్య కోసం తను చెప్పింది విని చేసి తప్పు చేశాను. ఇప్పుడు నా బిడ్డ కోసం రాజ్ చేసిన త్యాగం, కావ్య గొప్పదనం, తల్లి ప్రేమ చూస్తుంటే నా మీదే నాకు అసహ్యం వేస్తుందని మంత్రి ధర్మేంద్ర నిజం ఒప్పుకుంటాడు.
ఇంత త్యాగం చేసిన రాజ్, కావ్యల కోసం నేను నా భార్యకు నిజం చెప్పి మీ వారసురాలిని మీకు అప్పగిస్తాను అని మంత్రి ధర్మేంద్ర హామీ ఇస్తాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


