బ్రహ్మముడి ఫిబ్రవరి 7 ఎపిసోడ్: మంత్రి కన్నబిడ్డను చంపేందుకు రౌడీలను పంపిన రుద్రాణి- చెంప చెల్లుమనిపించిన ధర్మేంద్ర

బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 7 ఎపిసోడ్‌లో రుద్రాణి చెప్పుడు మాటలు విని రాజ్, కావ్యతో గొడవ పడుతుంది ధాన్యలక్ష్మీ. రచ్చ రచ్చ చేస్తుంది. దాంతో మంత్రి బిడ్డలను మార్చిన నిజాన్ని చెప్పేస్తాడు రాజ్. కావ్యకు దండం పెట్టి మరి క్షమించమంటుంది ధాన్యం. మంత్రి కన్నబిడ్డను చంపడానికి రౌడీలను పంపిస్తుంది రుద్రాణి.

Published on: Feb 7, 2026, 09:03:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ధాన్యలక్ష్మీకి రుద్రాణి కాల్ చేస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికి కాల్ చేశాను. నీ వారసుడుకి ప్రమాదం పొంచి ఉందని చెప్పిన వినవా అంటుంది. రాజ్, కావ్య చేసిన తప్పు వల్ల ఆ మినిస్టర్ మన కుటుంబం మీద పగ పెంచుకున్నాడు. ఎవరికి ఎలాంటి ప్రమాదం తలపెడతాడో తెలియదు అని రుద్రాణి అంటుంది.

బ్రహ్మముడి సీరియల్‌ ఫిబ్రవరి 7 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ ఫిబ్రవరి 7 ఎపిసోడ్

గొడవ పడకుండా చూసుకో

నీ కోడలి ప్రాణానికి కూడా ప్రమాదమే. ఆ రాజ్, కావ్య మంత్రితో గొడవ పడకుండా ఉండకుండా నువ్వే చూసుకోవాలి అని రుద్రాణి అంటుంది. దాంతో కాల్ కట్ చేసి కిందకు వెళ్తుంది ధాన్యలక్ష్మీ. పాపకు ఆపరేషన్ గురించి రాజ్ బాధగా చెబుతాడు. అంతా మంచే జరుగుతుందని ఇంట్లోవాళ్లు ఓదారుస్తారు. ఇంతలో ధాన్యం వచ్చి వీళ్లిద్దరి పనులకు వల్ల భయం లేకుండా ఎలా ఉంటుందని అంటుంది.

వీళ్లు చేసే పనుల వల్లే భయం కలుగుతుంది. పాప ఆపరేషన్‌కు భయమెందుకు కలుగుతుందని ధాన్యలక్ష్మీ తిడుతుంది. రాజ్, కావ్య చేసిన తప్పు దాచిపెట్టారని మంత్రి గురించి, యాక్సిడెంట్స్ గురించి మాట్లాడుతుంది. వీరిద్దరు కలిసి మంత్రితో ఇంకేదో శత్రుత్వం పెట్టుకున్నారని, మళ్లీ మళ్లీ మంత్రితో శత్రుత్వం పెట్టుకున్నారని, వాడు కక్ష్య పెంచుకుంటున్నారని అంటుంది ధాన్యం.

వాడి వల్ల ఏం కాదని రాజ్ అంటాడు. ఆరోజు ఏం చేశారని రచ్చ రచ్చ చేస్తుంది రాజ్. కుటుంబం అంతా చనిపోతే మీరు మీ బిడ్డ హాయిగా ఉందామనుకుంటున్నారా అని ధాన్యం అంటుంది. అసలు బిడ్డంటూ ఉంటే కదా హాయిగా ఉండటానికి అని రాజ్ అరుస్తాడు. మా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ మా చేతుల్లో లేనందుకే వాడితో శుత్రుత్వం పెంచుకోవాల్సి వచ్చిందని రాజ్ అంటాడు.

బిడ్డలను మార్చిన నిజం

ఆ మినిస్టర్ హాస్పిటల్ నుంచే నా బిడ్డను ఎత్తుకెళ్లిపోయాడు. పుట్టగానే బిడ్డలను మార్చేశాడని, కళావతి మాటే నిజం, మంత్రి పాపకు ఆరోగ్య సమస్య గురించి, జరిగింది అంతా చెబుతాడు రాజ్. ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు దాచారు అని అడుగుతారు. వాడు చేసింది నిజమని తేల్చడానికి ఏ సాక్ష్యం లేదని రాజ్ అంటాడు.

వాడి భార్యతో స్నేహం చేశాం. ఎటు చూసిన వాడికే డేంజర్. ఎటు తేల్చుకోలేక వాడే పాపను మనకిచ్చే రోజు దగ్గరిలోనే ఉందని రాజ్ అంటాడు. కావ్యను అంతా మెచ్చుకుంటారు. దేవత అంటుంది ఇందిరాదేవి. క్షమించమని అపర్ణ అంటే.. ధాన్యలక్ష్మీ చేతులతో మొక్కి మరి తప్పు అయిందని క్షమాపణ చెబుతుంది.

ముందు పాప ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని, అప్పుడే మనం అనుకున్నది జరుగుతుందని రాజ్ అంటాడు. అదంతా చూసిన ఇరిటేట్ అయిన రేఖ వెళ్లి రుద్రాణికి జరిగింది అంతా చెబుతుంది. నువ్వు నీ చెత్త ఐడియాలు అని తిడుతుంది. రాజ్, కావ్య నిజం చెప్పేశారని చెబుతుంది రేఖ. షాక్ అయిన రుద్రాణి ఆలోచిస్తున్నా అంటుంది. ఆలోచిస్తూనే ఉండు ఇక్కడ నేను విషం తాగి చస్తానంటుంది రేఖ.

రుద్రాణిని కొట్టిన మంత్రి

నాది కూడా నీలాగే తెగిన గాలిపటం అవుతుందని రేఖ అంటుంది. అదంతా జరగాలంటే కావ్య దగ్గరున్న పాపకు ఆపరేషన్ జరగాలి, క్షేమంగా ఉండాలి, మధ్యలో నేనున్నా. నేను చేయాల్సింది చేస్తానంటుంది రుద్రాణి. మరుసటి రోజు హాస్పిటల్‌లో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఉంటారు. డాక్టర్ అనురాధ వచ్చి పాపను ఇవ్వమంటుంది. అంతా డాక్టర్‌నే నమ్ముకుంటారు.

పాపకు ఏం కాదు. కావ్యను గెలిపించేది దేవుడే అని హామీ ఇస్తుంది డాక్టర్ అనురాధ. మరోవైపు పాపకు ఆపరేషన్ అయి బతికిన చంపేయమని రౌడీలను పంపిస్తుంది రుద్రాణి. అదే విషయం మంత్రి ధర్మేంద్రకు చెబుతుంది. అంటే తన కన్నబిడ్డనే చంపేయమని రౌడీలను పంపించినట్లు మంత్రికే చెబుతుంది రుద్రాణి.

ఇక పాపకు అంత్యక్రియలు తప్ప ఏం చేయలేరు అని రుద్రాణి అనడంతో లాగి పెట్టి కొడతాడు మంత్రి ధర్మేంద్ర. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More