బ్రహ్మముడి ఫిబ్రవరి 5 ఎపిసోడ్: మంత్రికి ఒక్కరోజే గడువు- కల్యాణ్, రాజ్‌కు గుండు- ధాన్యలక్ష్మీతో రుద్రాణి కొత్త స్కెచ్!

బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 5 ఎపిసోడ్‌లో మంత్రి ధర్మేంద్రను రాజ్ ముప్పుతిప్పలు పెట్టి హాస్పిటల్‌కు వచ్చేలా చేస్తాడు రాజ్. కానీ, తులసికి నిజం చెప్పేలా చేయరు. మరోవైపు అప్పుకు డెలివరి డేట్ ఇచ్చారని కల్యాణ్ సంతోషంగా స్వీట్స్ పంచుతారు. మంత్రితో రాజ్ డీల్ కుదుర్చుకుంటాడు. ఇంకా ఒక్కరోజే గడువుందని చెబుతాడు.

Published on: Feb 5, 2026, 07:41:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ భయపెట్టడంతో మంత్రి ధర్మేంద్ర డాక్టర్ చక్రవర్తిని కిడ్నాప్ చేసి పెట్టిన చోటుకు వెళ్తాడు. ఈ చుట్టు పక్కలకు ఎవడు వచ్చిన చింపేయండి. వీడు ఎవడికి దొరకొద్దు అని రౌడీలకు చెబుతాడు మంత్రి.

బ్రహ్మముడి సీరియల్‌ ఫిబ్రవరి 5 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ ఫిబ్రవరి 5 ఎపిసోడ్

నీలవేణితో నిజం

ఇంతలో రాజ్ కాల్ చేసి డాక్టర్ చక్రవర్తి కేవలం డెలివరి మాత్రమే చేశాడు. అదే నువ్ డీల్ కుదుర్చుకున్న హెడ్ నర్స్ నీలవేణితో మీ భార్యకు నిజం చెప్పిస్తే ఎలా ఉంటుంది. అందుకే హాస్పిటల్‌లోకి నీలవేణి దగ్గరికి వెళ్తున్నాం అని రాజ్ అంటాడు. దాంతో మంత్రి కంగారుగా వెళ్లిపోతాడు. తర్వాత ఉన్న ఇద్దరు రౌడీలను చితకబాది డాక్టర్ చక్రవర్తి కట్టు విప్పి కాపాడి తీసుకెళ్తాడు రాజ్.

మరోవైపు నీలవేణి దగ్గరికి మంత్రి ధర్మేంద్ర వెళ్తాడు. గదిలో ఎవరున్నారని చూస్తాడు. కానీ, ఎవరుండరు. మీరేంటీ ఇక్కడికి వచ్చారని నీలవేణి అడిగితే.. నీ గొంతు పెగలకూడదని పది లక్షలు ఇచ్చాను. రాజ్, కావ్యతో ఎందుకు చేతులు కలిపావు, వాళ్లకు నిజం ఎలా తెలిసింందని బెదిరిస్తాడు మంత్రి ధర్మేంద్ర. నేను వాళ్లతో చేతులు కలపలేదు. కానీ, ఆరోజు కావ్యకు డాక్టర్ అనురాధతో కలిసి కావ్యకు నిజం తెలిసిందని నీలవేణి చెబుతుంది.

నేను నిజం ఒప్పుకున్నా కానీ సాక్ష్యం చెబుతానని చెప్పలేదు. నా పిల్లలను చూసి కావ్య వదిలేసిందని నీలవేణి చెబుతుంది. కానీ, నా భార్యకు నిజం చెబుదామని బెదిరిస్తున్నారని మంత్రి అంటాడు. ప్రాణం పోయిన నేను బయటకొచ్చి సాక్ష్యం చెప్పను అని నీలవేణి అంటుంది. వాడు మాత్రం గేమ్స్ ఆడుతున్నాడు. ఏం చేయాలో తెలియట్లేదు అని మంత్రి అంటాడు.

తప్పు మొదలుపెట్టిన చోటే

ఇంతలో రాజ్ కాల్ చేసి ఇప్పుడు నిజం చెబుతున్నా విను. నువ్వు ఈ తప్పు ఎక్కడ మొదలుపెట్టావో అక్కడే కలుద్దాం. చేతనేతే నీ భార్యకు నిజం తెలియకుండా ఆపుకో అని ఛాలెంజ్ విసురుతాడు రాజ్. దాంతో హాస్పిటల్‌కు వెళ్తాడు మంత్రి. తులసి, రాజ్, కావ్యతో డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతుంటారు. అది చూసిన మంత్రి వీళ్లు చెప్పేది నిజం కాదు, అబద్ధం అని మంత్రి కంగారుగా అంటాడు.

మీరెందుకు టెన్షన్‌ పడుతున్నారని రాజ్ అంటాడు. డాక్టర్ ఏం చెప్పాడు అని మంత్రి అడిగితే.. ఆయుర్వేద మందు గురించి చెప్పారు. పాలు తక్కువ వస్తున్నాయిగా అని తులసి అంటుంది. చక్రవర్తి అంతేగా అని మంత్రి అంటే.. నిజం ఇంకేముంటుంది సార్ అని చక్రవర్తి అంటాడు. రాజ్, కావ్య సెటైర్లు వేస్తారు. అంత పెద్ద మనిషి తప్పు చేశారేమో అని కావ్య అంటుంది.

డెలివరి అయ్యాకా ఒక్కసారి కూడా చెకప్‌కి రాలేదు ఎందుకు అని తులసి అడుగుతుంది. సీరియస్ కేసు వస్తే వేరే హాస్పిటల్‌కు నేనే పంపించాను అని మంత్రి అంటాడు. తులసి డాక్టర్‌ను కలుస్తానని వెళ్తుంది. నా బిడ్డను దూరం చేసినందుకు నేనంత తల్లడిల్లానో అర్థమైందా అని కావ్య అంటుంది. ఇచ్చిన గడువులో ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ లోపు మా బిడ్డను మా చేతులో పెట్టండి అని కావ్య అంటుంది.

చాలా నష్టపోతావ్

నీ తప్పు సరిదిద్ధుకుని మా బిడ్డను మాకు ఇవ్వు. అలా అని పలుకుబడి ఉపయోగిస్తే చాలా నష్టపోతావ్ అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతారు రాజ్, కావ్య. తర్వాత పాప హెల్త్ కండిషన్ చాలా బాగుంది. సర్జరీ చేసేందుకు పాప బాడీ సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. నిర్భయంగా సర్జరీకి వెళ్లొచ్చు అని డాక్టర్ అనురాధ చెబుతుంది. ఎలాగైనా పాప ప్రాణాన్ని కాపాడండి అని కావ్య అంటుంది.

తులసికి తన పాపను ఇచ్చేటప్పుడు ఎలాంటి అన్యాయం జరగకూడదు. తనకు ఎలాంటి వెలితి ఉండకూడదు అని కావ్య అంటుంది. వారం రోజుల పాటు రోజు హాస్పిటల్‌కు తీసుకురావాల్సి ఉంటుంది అని డాక్టర్ చెబుతుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరిని పిలిచి కల్యాణ్ స్వీట్స్ పంచుతాడు. ఏమైందని అంతా అడుగుతారు. అప్పుకు డెలివరి డేట్ ఇచ్చారని కల్యాణ్ చెబుతాడు.

అంతా సంతోషిస్తారు. ఇక బాబుకు జన్మనివ్వాలని అంతా అంటారు. రేఖ మాత్రం అసూయతో రగిలిపోతుంది. రాజ్, కావ్య వస్తే వాళ్లకు కూడా కల్యాణ్ చెబుతాడు. పాప ఆరోగ్యం బాగుందన్న విషయం ఇంట్లోవాళ్లకు చెబుతాడు రాజ్. దాంతో రేఖ మరింత రగిలిపోతుంది. రేఖకు రెండు బ్యాడ్ న్యూస్‌లు అన్నట్లుగా ఫీల్ అవుతుంది.

ఒక్కరోజే గడువు

హమ్మయ్యా అంతా సవ్యంగా జరిగితే తిరుపతి మొక్కు చెల్లించుకుంటానని అపర్ణ అంటుంది. అంతేనా, రాజ్, కల్యాణ్‌కి గుండు కొట్టిస్తాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో కల్యాణ్, రాజ్ షాక్ ఇస్తారు. మీ ఆయనకు కొట్టించొచ్చు కదా అని కల్యాణ్ అంటాడు. తర్వాత మినిస్టర్ మూర్ఖుడు. మన పాప మనకిస్తాడా అని కంగారుపడుతుంది కావ్య.

మినిస్టర్ భార్యే బలం అని రాజ్ అంటాడు. కట్ చేస్తే రాజ్, మంత్రి కలుస్తారు. పాపను ఇవ్వలేని, తులసికి నిజం చెప్పలేనని మంత్రి అంటాడు. నా భార్య మాత్రం వేరేవాళ్ల పాపను ఎలా చూసుకోగలదు. మీకుచ్చిన గడువు రేపటి వరకే. మా బిడ్డను మాకివ్వండి. లేకుంటే నిజాలన్నీ బయటపడతాయని రాజ్ చెబుతాడు.

మంత్రితో రాజ్, కావ్య గొడవ పెట్టుకున్నారని, మంత్రి మళ్లీ అప్పును ఏమైనా చేస్తారని ధాన్యలక్ష్మీ భయపడెలా చెబుతుంది రుద్రాణి. రాజ్, కావ్యలను ధాన్యలక్ష్మీతో ఆపేందుకు కొత్త స్కెచ్ వేస్తుంది రుద్రాణి. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More