బ్రహ్మముడి ప్రోమో: కావ్య చెప్పినట్లే చేసిన మంత్రి భార్య తులసి- బెంబేలెత్తిపోయిన ధర్మేంద్ర- రేఖ, రుద్రాణి గొడవ

బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో హాస్పిటల్‌లో తన పాప ఏడుస్తుంటే తులసి నుంచి తీసుకుని కావ్య పలు పడుతుంది. మంత్రి వల్ల నువ్వు శిక్ష అనుభవిస్తున్నావని కావ్య కుమిలిపోతుంది. ఇంటికెళ్లిన తులసి భర్త ధర్మేంద్రను డాక్టర్ చక్రవర్తి గురించి అడుగుతుంది. దాంతో మంత్రి ఖంగుతింటాడు. రేఖ, రుద్రాణి గొడవ పడతారు.

Published on: Feb 1, 2026, 08:24:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో మంత్రి భార్య తులసి హాస్పిటల్‌కు వస్తుందని తెలిసిన రాజ్, కావ్య కూడా ఆస్పత్రికి వెళ్తారు. డాక్టర్ అనురాధను కలిసిన తులసి తనకు పాలు రావట్లేదని, బిడ్డకు డబ్బా పాలు పట్టడం ఇష్టం లేదని, ఎలాగైనా తన పాపకు తనే పాలు పట్టాలని చెబుతుంది.

బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

మీకు పురుడు పోసింది

ఇంతలో కావ్య వస్తుంది. తులసి, కావ్య పలకరించుకుంటారు. తనకు పాలు రావట్లేదని తులసి చెబుతుంది. డాక్టర్ చక్రవర్తి గారే కదా మీకు పురుడు పోసింది. ఆయనే మీకు ట్రీట్‌మెంట్ ఇస్తే బాగుంటుంది అని కావ్య, రాజ్ అంటారు. నిజమే కానీ, ఆయన నాకు డెలివరి చేసినప్పటి నుంచి హాస్పిటల్‌కు రావట్లేదని తులసి చెబుతుంది.

అదేంటండి, హాస్పిటల్ మీదే కదా. మీ ఆయనను డాక్టర్ చక్రవర్తి గురించి అడగండి. ఆయనే ఏదోటి చేస్తారు అని కావ్య అంటుంది. దానికి సరే అన్నట్లుగా సైలెంట్‌గా ఉంటుంది తులసి. ఇంతలో పాప ఏడుస్తుంది. పని మనిషి ఇచ్చిన డబ్బా పాలు పడుతుంది తులసి. కానీ, పాప తాగదు. ఎంత ఆలించిన పాప ఊరుకోదు. ఏడుస్తూనే ఉంటుంది.

తన పాప తన కళ్లముందే గుక్కపెట్టి ఏడవటం చూసి తట్టుకోలేకపోతుంది కావ్య. ఇక తల్లి ప్రేమను పక్కన పెట్టలేక పాప తల్లి పాల కోసమే ఏడుస్తుంది, అందుకే డబ్బా పాలు తాగట్లేదు. మీరు ఏమనుకోనంటే పాపకు నేను నా పాలు పడతాను అని కావ్య అంటుంది. దానికి తులసి షాక్ అవుతుంది.

సొంత బిడ్డకు పాలు పట్టిన కావ్య

మీరు నా పాపకు పాలు పట్టడం ఏంటని తులసి అంటుంది. ఈ సమయంలో పిల్లలకు తల్లి పాలే రక్ష. నా బిడ్డకు నేను ఎలాగు పాలు పట్టలేను. కనీసం మీ పాప ఆకలినైనా నా తల్లి ప్రేమ తీర్చని అని కావ్య అంటుంది. తులసి ఆలోచనలో పడుతుంది. పక్కనే ఉన్న డాక్టర్ అనురాధ కూడా అలా పాలు పట్టడం వల్ల బిడ్డకు ఏం కాదని, ఏ తల్లి పాలు అయిన బిడ్డకు మంచిదే అని చెబుతుంది.

డాక్టర్ చెప్పడంతో కావ్య పాలు పట్టేందుకు ఒప్పుకుంటుంది తులసి. కావ్యకు పాపను ఇస్తుంది తులసి. కన్నబిడ్డను చేతుల్లోకి తీసుకుంటూ కావ్య మురిసిపోతుంది. పక్కన ఉన్న గదిలోకి పాపను తీసుకెళ్తుంది. జరిగినవన్నీ తలుచుకుంటూ కావ్య కుమిలిపోతుంది. మంత్రి చేసిన తప్పు వల్ల నువ్వు నాకు దూరం అయ్యావని ఏడుస్తుంది కావ్య.

తప్పు ఎవరు చేసిన ఈ అమ్మకు దూరమై నువ్వు శిక్ష అనుభవిస్తున్నావ్ అని కావ్య అంటుంది. గదిలో సొంత బిడ్డకు పాలు ఇస్తుంది కావ్య. గది బయటి నుంచి కావ్యను, కావ్య మాటలు, బాధను చూసిన రాజ్ తలదించుకుంటాడు. ఏం చేయలేకపోతున్నానని బాధపడుతాడు. మరోవైపు తన బిడ్డను ఎత్తుకుని ఆడిస్తుంది తులసి.

కావ్య చెప్పినట్లే చేసిన తులసి

పాప ఏడవడం ఆపాక తులసికి ఇస్తుంది కావ్య. అప్పుడు కూడా కావ్య చాలా ఎమోషనల్ అవుతుంది. తర్వాత ఇంటికెళ్లిన తులసి కావ్య చెప్పినట్లుగానే భర్తను డాక్టర్ చక్రవర్తి గురించి అడుగుతుంది. నాకు డెలివరి చేసినప్పటి నుంచి డాక్టర్ చక్రవర్తి ఎందుకు రావట్లేదు అని తులసి అంటుంది. దాంతో మంత్రి ధర్మేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు.

ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. కావ్య గురించి ఏం చేశారు, ఇవాళ హాస్పిటల్‌కి కావ్య వాళ్లు వచ్చారు, నాతో మాట్లాడారు. డాక్టర్ చక్రవర్తి గురించి కూడా నన్ను అడిగారు అని తులసి చెబుతుంది. దాంతో ఒక్కసారిగా ఖంగుతిన్న ధర్మేంద్ర బెంబేలెత్తిపోతాడు.

మరోవైపు కావ్య మారిందని అంతా ఇంట్లో సంతోషంగా ఉంటారు. అది చూసిన రేఖ కోపంతో తల్లికి ఫోన్ చేస్తుంది. రాజ్ బావకు కావ్యను దూరం చేస్తానన్నావ్. కావ్యను పిచ్చిదానిలా చూపిస్తానన్నావ్. కానీ, ఇప్పుడు ఆ కావ్య అందరిని గెలుచుకుంది అని తల్లి రుద్రాణితో గొడవ పడుతుంది. కావ్య ఇలా ట్విస్ట్ ఇస్తుందని నాకేం తెలుసు అని రుద్రాణి కూడా రివర్స్ అవుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More