బ్రహ్మముడి జనవరి 29 ఎపిసోడ్: మంత్రి 10 లక్షల డీల్, నిజం కక్కిన హెడ్ నర్స్-పాప కోసం ధర్మేంద్ర ఇంటికి దొంగతనంగా రాజ్ కావ్య

బ్రహ్మముడి సీరియల్ జనవరి 29 ఎపిసోడ్‌లో చక్రవర్తి అడ్రస్ గురించి హెడ్ నర్స్ నీలవేణిని అడుగుదామని కావ్య, అనురాధ వెళ్తారు. తనకు వచ్చిన డబ్బు గురించి మాట్లాడి ఇరుక్కుంటుంది నీలవేణి. కావ్య ఎడాపెడా కొట్టడంతో మంత్రితో చేసుకున్న 10 లక్షల డీల్ గురించి నిజం కక్కుతుంది నీలవేణి. మంత్రి ఇంటికి వెళ్తుంది కావ్య.

Published on: Jan 29, 2026, 07:35:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో లేడి డాక్టర్‌ అనురాధను డాక్టర్ చక్రవర్తి ఇంటి అడ్రస్ గురించి కావ్య అడిగితే తనకు తెలియదని చెబుతుంది. కానీ, హెడ్ నర్స్ నీలవేణికి తెలిసే అవకాశం ఉంటుందని అనురాధ చెబుతుంది. మరోవైపు మరో నర్స్‌తో తన మెడలో చైన్ పది లక్షలు అని గొప్పలు చెప్పుకుంటుంది నీలవేణి.

బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 29 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 29 ఎపిసోడ్

హెల్ప్ చేస్తే డబ్బే డబ్బు

ఇంత డబ్బు ఎక్కడిది అని మరో నర్స్ అడిగితే.. మనం తలుచుకుంటే డబ్బుకు కొదవ ఏంటీ. ఎవరికైనా కాసింత హెల్ప్ చేస్తే చాలు డబ్బే డబ్బు. ఎవరైనా పెద్దవారికి హెల్ప్ చేయడానికి చాలా దారులు ఉన్నాయని హెడ్ నర్స్ నీలవేణి అంటుంది. ఆ మాటలన్నీ అనురాధ, కావ్య వింటారు. అయితే నీకు చాలా అడ్డ దారులు తెలుసు అన్నమాట అని కావ్య అనగనే నీలవేణి కంగారుపడుతుంది.

ఏంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని నీలవేణి అంటే.. కావ్య ఒక్కటి లాగిపెట్టి కొడుతుంది. నిజం చెప్పమని అడుగుతుంది. అయినా నీలవేణి చెప్పదు. దాంతో మరో సారి కొడుతుంది కావ్య. దాంతో డాక్టర్ అనురాధ ఆపి నేను అడుగుతానని ఇది చాలా సీరియస్ మ్యాటర్ అని, నువ్వు ఇరుక్కుంటావని అంటుంది. దాంతో మంత్రి ధర్మేంద్ర తనకు బిడ్డను మార్చేందుకు రూ. 10 లక్షలు ఇచ్చారని నీలవేణి చెబుతుంది.

తనతో మంత్రి పది లక్షలు డీల్ పెట్టుకున్నాడని హెడ్ నర్స్ నిజం కక్కడంతో కావ్య కోపంతో ఎడాపెడా కొడుతుంది. నీలవేణికి ఊపిరి ఆడదు. దాంతో అనురాధ ఆపుతుంది. నిజనిజాలు బయటపడ్డాయిగా మంత్రి నుంచి మీ పాపను ఎలా తెచ్చుకోవాలో ఆలోచించు అని అనురాధ అంటుంది. సాక్ష్యం ఇక్కడే ఉందిగా. పదా మంత్రి దగ్గరికి వెళ్లి నిజం చెప్పి నా పాపను తెచ్చుకుంటాను అని నీలవేణితో అంటుంది కావ్య.

చక్రవర్తి కనపడకుండా పోయారు

నీలవేణి వచ్చేందుకు భయపడుతుంది. కావ్యను వేడుకుంటుంది. కావ్య కాళ్లు పట్టుకుంటుంది. మంత్రి గారిని ఎదిరించినందుకే డాక్టర్ చక్రవర్తి కనపడకుండా పోయారు. నాకు ఇద్దరు పిల్లలు. మినిస్టర్‌కు ఎదురెళ్లి నిజం చెప్పలేను. నా పిల్లలు అనాథలు అవుతారు అని కాళ్లు పట్టుకుంటుంది. దాంతో కావ్య వదిలేస్తుంది. ఇప్పుడు ఎలా కాపాడుకుంటావ్ అని డాక్టర్ అడుగుతుంది.

ఆరోజు పుట్టిన పాపలకు పుట్టు మచ్చలు ఎక్కడ ఉన్నాయో రాసే ఉంటారుగా. అది వాళ్లు అంత గమనించి ఉండరు. ఆ డీటేల్స్ కావాలని కావ్య అడిగితే సరేనంటుంది అనురాధ. మరోవైపు కావ్య కోసం అంతా ఎదురుచూస్తుంటారు. కావ్యను నిందిస్తాడు రాజ్. కావ్యకు ఫోన్ చేయమని రాజ్‌కు అంతా చెబుతారు. ఇంతలో రేఖ వచ్చి కావ్య రోడ్ల మీద పిచ్చిదానిలా తిరుగుతుందట అని అంటుంది.

రోడ్ల మీద కార్లను ఆపి చంటి పిల్లలను లాగేసుకుంటుందట, అడ్డం వచ్చిన వాళ్లను కొడుతుంది అంట, కావ్య ప్రవర్తన నెమ్మదిగా పిచ్చిదానిలా ఉందని రేఖ చాడీలు చెబుతుంది. నాకు తెలిసినావిడ చూసిందట, తెలిసింది చెబుతున్నా. దుగ్గిరాల కుటుంబానికి ఎంత అప్రదిష్ట అని రేఖ అంటుంది. దాంతో అపర్ణ భయపడుతుంది. కావ్యకు రాజ్ కాల్ చేస్తాడు.

రిపోర్ట్స్‌లో చెప్పినట్లు లేదు

కావ్య కాల్ కట్ చేస్తుంది. అదే విషయం రాజ్ చెబుతాడు. మరోవైపు ఫైల్ దొరికిందని అనురాధ చెబుతుంది. రిపోర్ట్స్‌లో నువ్వు చెప్పినట్లుగా లేదు. మంత్రికి పుట్టిన పాపకు పుట్టుమచ్చ ఉన్నట్లు మంత్రి రాయించాడు అని అనురాధ చెబుతుంది. ఎవరు అడ్డుపడ్డ నా బిడ్డను తెచ్చుకుంటాను అని కావ్య అంటుంది. సారీ కావ్య నేను నిన్ను నమ్మలేకపోయాను, ఏ సహాయం కావాలన్న నేను చేస్తాను అని డాక్టర్ అనురాధ చెబుతుంది.

మరోవైపు రుద్రాణితో చెబుతూ భయపడుతుంటాడు ధర్మేంద్ర. ఇంతలో కావ్య రావడం చూసి రుద్రాణి షాక్ అయి చెబుతుంది. మీరు స్ట్రాంగ్‌గా హ్యాండిల్ చేయండి అని రుద్రాణి వెళ్లి దాక్కుంటుంది. కావ్య వచ్చి నా బిడ్డను దూరం చేసింది, మార్చింది నువ్వే అని మంత్రిని నిలదీస్తుంది. మినిస్టర్‌ను నీచుడు, దుర్మార్గుడు అని తిడుతుంది కావ్య.

నీది కేవలం అనుమానం అని మంత్రి అంటే.. తన పాప అనారోగ్యంకు సంబంధించిన రిపోర్ట్స్ చూపించి ఇదేంటీ అని కావ్య అంటుంది. హో నిజం తెలిసిపోయిందన్నమాట అని మంత్రి నిజం ఒప్పేసుకుంటాడు. తర్వాత ఇంటికెళ్లిన కావ్య రాజ్‌కు జరిగింది అంతా చెబుతుంది. ఏది నమ్మలేకపోతున్నా అని రాజ్ అంటాడు.

దొంగతనంగా కావ్య, రాజ్

మన బిడ్డను చూస్తే మీకే తెలుస్తుంది అని కావ్య అంటుంది. దాంతో అర్ధరాత్రి రాజ్, కావ్య మంత్రి ధర్మేంద్ర ఇంటికి దొంగతనంగా వెళ్లి పాపను చూస్తారు. పాపను కావ్య ముద్దాడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More