బ్రహ్మముడి జనవరి 26 ఎపిసోడ్: మంత్రి పాపకు శాంతి పూజ- గుడిలో కన్నబిడ్డను ఎత్తుకున్న కావ్య- ధర్మేంద్ర రుద్రాణికి బిగ్ షాక్

బ్రహ్మముడి సీరియల్ జనవరి 26 ఎపిసోడ్‌లో కావ్యకు గుండె సమస్య ఉందని చెప్పడంతో డాక్టర్‌పై గొడవకు దిగుతుంది కావ్య. ఇంట్లో కావ్యపై రాజ్ కోప్పడుతాడు. తన కన్నబిడ్డను కనిపెట్టేందుకు బయటకు వెళ్తుంది. పాపకు దోషం ఉందని, శాంతి పూజ చేయాలని మంత్రి ధర్మేంద్రకు పంతులు చెబుతాడు. దాంతో గుడిలో శాంతి పూజ చేస్తారు.

Published on: Jan 26, 2026, 08:14:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో పాపకు గుండె సమస్య గురించి డాక్టర్ చెబుతుంది. వెంటనే ఆపరేషన్ చేయమని రాజ్ అంటాడు. చిన్న పాప కాబట్టి బాడీ తట్టుకుంటుందో లేదో. ఆపరేషన్ చేయకుండా చాలా ఇబ్బంది. సర్జరీ చేస్తే పాప ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేం. కానీ, మీరు నిర్ణయం తీసుకుంటే ఏదోటి చేయొచ్చు అని డాక్టర్ అంటుంది.

బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 26 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 26 ఎపిసోడ్

నా బిడ్డను మార్చారు

ఈ పాపను ఇక్కడే ఉంచి నా పాపను నాకు ఇవ్వండి. ఎవరి బిడ్డకో ఆరోగ్యం సరిగా లేదు. హెల్తీగా ఉన్న నా బిడ్డను మార్చారు. అంతా ఒక్కటై మా మీద కుట్ర చేశారు అని కావ్య అంటుంది. మీ భార్యకు నచ్చజెప్పండి. వ్యాధి గురించి చెబితే ఇలా అంటోంది ఏంటీ అని డాక్టర్ అనురాధ తిడుతుంది. దాంతో కావ్యను బలవంతంగా రాజ్ తీసుకెళ్తాడు.

కావ్య గొడవ చేసి హెడ్ నర్స్ నీలవేణి భయపడిపోతుంది. రాజ్, కావ్య ఇంటికి వెళ్తారు. పాపకు ఏమైందని అంతా అడిగితే.. కావ్య చేసిన పని గురించి అవమానంగా చెబుతాడు రాజ్. డాక్టర్‌తో మూర్ఖంగా వాదిస్తావా అని రాజ్ అంటాడు. నిజం ఎక్కడ బయటపడుతుందో అని డాక్టర్ బుకాయిస్తుంది అని కావ్య అంటుంది.

ఆపండి అసలు ఏం జరిగిందో చెప్పండి అని అపర్ణ అరుస్తుంది. దాంతో పాపకున్న గుండె సమస్య గురించి, సర్జరీ చేసిన బతుకుతుందో లేదో చెప్పలేమని డాక్టర్ చెప్పిందని రాజ్ చెబుతాడు. కావ్య చేసిన రాద్ధాంతం గురించి చెప్పుకుంటూ రాజ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. నన్ను అర్థం చేసుకుంటే మార్గం దొరుకుతుంది. ఎవరికో డాక్టర్స్ సహకరించారు అని కావ్య అంటుంది.

నిజం నేను కనిపెడతాను

నీ దగ్గర సాక్ష్యం ఏముందని రాజ్ నిలదీస్తాడు. ఈ అమ్మ పంచిన ప్రేమే సాక్ష్యం. నిజం నేను కనిపెడతాను అని కావ్య అంటుంది. ముందు పాపను ఎలా బతికించాలో ఆలోచించండి అని సుభాష్ అంటాడు. ఈ పాపకు ఏం కానివ్వను. రేపు నా బిడ్డ దొరికినప్పుడు వాళ్లకు ఈ పాపను ఆరోగ్యంగా ఇవ్వాలిగా. నా బిడ్డను కనిపెట్టడం మాత్రం ఖాయం అని కావ్య వెళ్లిపోతుంది.

ఇంతటి భ్రమలో ఉన్న దీనికి ఎలా నచ్చజెప్పాలి అని రాజ్ బాధపడుతాడు. తర్వాత రాత్రి రుద్రాణితో వీడియో కాల్ మాట్లాడుతారు రాహుల్, రేఖ. రుద్రాణిని పొగుడుతారు. రాజ్‌తో పెళ్లి గురించి ఆలోచించు అని రాహుల్ అంటాడు. ఈసారి నేను కొట్టబోయే దెబ్బకు ఆ ఇంటికి రాహుల్ మహారాజు అవుతాడు. రేఖ రాజ్ భార్య అవుతుంది. ఇక నుంచి మీరిద్దరు నేను చెప్పింది చేయండి అని రుద్రాణి అంటుంది.

కావ్యను రెచ్చగొట్టండి, పాపను దూరం చేశారని అనండి. దాంతో కావ్య ఇంట్లోవాళ్లపై తిరగబడుతుంది. కావ్య పిచ్చిదానిలా చేస్తుందని, కావ్య పట్టించుకోకపోవడంతోనే పాపకు ఇలా అయిందని మనం నమ్మిద్దాం. అప్పుడు మొదలవుతుంది అసలైన కథ అని రుద్రాణి అంటుంది. పాపను కావ్య ఆడిస్తుంది. అది చూసి రాజ్ అయోమయంగా ఫీల్ అవుతాడు.

పంతులుకు అనుమానం

మరోవైపు ధర్మేంద్ర ఇంటికి పంతులు వచ్చి జాతకం రాశాను. కానీ, పాప పుట్టాక వైద్యులు ఏమైనా చెప్పారా అని పంతులు అంటాడు. దాంతో మంత్రి ధర్మేంద్ర షాక్ అవుతాడు. పాపకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా. పాప పుట్టిన గడియలను బట్టి కొన్ని గండాలు ఉన్నాయి. పాపకు శాంతి పూజ జరిపించాలి అని పంతులు అంటాడు.

ఇంతలో తులసి వస్తే.. పాప పేరుతో గుడిలో పూజ జరిపిస్తే చాలు అని పంతులు అంటాడు. పాప జాతకం దివ్యంగా ఉంది అని పంతులు అబద్ధం చెబుతాడు. దాంతో తులసి వెళ్లిపోతుంది. పాపకు దోషాలు, గండాలు ఉన్నట్లు నా భార్యకు తెలినివ్వకండి. ఎక్కడ నోరు జారకండి అని పంతులుతో అంటాడు ధర్మేంద్ర.

మరోవైపు అప్పుకు స్వప్న జ్యూస్ ఇస్తుంది. రాహుల్‌ను అనుమానించిన దానికి కోపం పోలేదా అని అప్పు అంటే పరిస్థితులు అలాంటివని స్వప్న అంటుంది. ఇంతలో కావ్య వచ్చి స్వప్నకు పాపను ఇస్తుంది. నేను బయటకు వెళ్తున్నా. నేను నా కన్నబిడ్డను పట్టుకుందామని వెళ్తున్నా. వచ్చేవరకు ఈ పాపను చూసుకో అని కావ్య అంటుంది.

కన్నబిడ్డను ఎత్తుకున్న కావ్య

అత్తింటికి నా మీద నమ్మకం లేకపోవచ్చుగా. కానీ మీకైనా నా మీద నమ్మకం లేదా. నా పాప ఎక్కడుందో కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఈ తల్లి తపనకు అడ్డు తగలకండి. పాపను చూసుకోండి చాలు అని కావ్య వెళ్లిపోతుంది. మరోవైపు కావ్య గుడికి వెళ్తుంది. నా పాప కాదని చెప్పే సాక్ష్యం నా దగ్గర లేదని మొరపెట్టుకుంటుంది కావ్య.

అప్పుడు గుడిలో ధర్మేంద్ర కావ్య కూతురుకు శాంతి పూజ చేయిస్తాడు. పాప ఏడుస్తుంటుంది. పాపను కాసేపు పట్టుకోండని కావ్యకు ఇస్తుంది తులసి. పాపను ఎత్తుకున్న కావ్యకు తన కన్నబిడ్డ అని తన తల్లి ప్రేమ చెబుతుంది. అది చూసి మంత్రి, రుద్రాణిలు తెగ షాక్ అవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More